ఐక్య పోరాటంతోనే బలోపేతం | unity of success | Sakshi
Sakshi News home page

ఐక్య పోరాటంతోనే బలోపేతం

Published Tue, Jul 26 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

unity of success

పెద్దాపురం :
ఐక్య పోరాటంతోనే సంఘ బలోపేతం సాధ్యపడుతుందని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు కుండల సాయి అన్నారు. పెద్దాపురం యాదవ కమ్యూనిటీ హాలులో సోమవారం అఖిల భారత యాదవ మహాసభ అధికార ప్రతిని«ధి చావల రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ యాదవులంతా ఐక్యంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది యాదవ సంక్షేమ నిధి వెయ్యికోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గొర్రెలు, మేకల పెంపకం దారులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు. యాదవ సంఘం నాయకులు పైల చిన్నబ్బాయి, సందక రాంబాబులు మాట్లాడుతూ యాదవ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘం పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో కన్నారావు, సందక సత్తిబాబు, మామిడి శివ, విడదాసరి రాజా, బొమ్మాడ సూరి, రెల్లబోయిన శ్రీనివాస్, గణేష్, లోవరాజు, మడక సుబ్బారావు, బొట్టా రామకృష్ణ, నీలపాల శ్రీను  తదితరులు పాల్గొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement