ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్
లక్నో: వచ్చేఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు అన్నిజట్టు కట్టే ప్రయత్నం చేస్తుండంపై బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ప్రతిపక్ష పార్టీలు మాత్రమే ఒకే వేదికపైకి వచ్చాయి, కానీ వారి మనుసులు కలువలేదని ఆరోపించారు. గురువారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు కలిశాయి. కానీ వారి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఇలాంటి సమైఖ్యత ఎక్కువ రోజులు ఉండదని, దాని వల్ల ఫలితాలు రావన్నారు.
ప్రస్తుతం బీజేపీ వెంటా రైతులు, జాట్‌లు, శాంతిని కోరుకునే వారంతా ఉన్నారన్నారు. దేశంలోని చిన్నపిల్లల్ని అడిగినా సరే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతల పరిస్థితులు సమూలంగా మారినట్లు చెబుతారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు బీజేపీ వెంటా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
మే 28న ఖైరానా లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికల ఫలితం 2019 లోక్‌సభ ఎన్నికలపై ఉంటుందా అని ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు యోగీ సమాధానవిస్తూ..‘ నాకు తెలియదు. ఖైరానాలో దివంగత నాయకులు హుకుమ్ సింగ్ వారసులు ఎంపీగా గెలుస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment