హైదరాబాద్: బుద్ధుడు, జ్యోతిరావుçఫూలే, డా.బీఆర్.అంబేడ్కర్, సావిత్రిబాయిఫూలే స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పిలుపునిచ్చారు. బహుజన ప్రతిఘటన వేదిక(బీఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీనగర్‌లో హలో బహుజన ఛలో హైదరాబాద్ సదస్సును డా.సూరేపల్లి సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంచ ఐలయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద బహుజన మహిళలపై మతోన్మాద దాడులను తిప్పి కొట్టేందుకు బహుజనులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను పట్టించుకోవడం లేదని, బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఒక్క తాటిపై ఉండి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌లు ఎఫ్.గోపీనా«థ్, డా.జయధీర్ తిరుమలరావు, లక్ష్మీనారాయణ, వై.రత్నం, జిలుకర శ్రీనివాస్, బండారు లక్ష్మయ్య, ఎంఎం.రెహమన్, శంకర్, బత్తుల వెంకన్న, బైరి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment