దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్ర
–అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పిలుపు
–పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన పరేడ్ మైదానం
– డీఎస్‌పీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మార్చ్‌ఫాస్ట్
– నగరమంతా విస్తతంగా బాంబ్‌స్వా్కడ్ తనిఖీలు
కర్నూలు: దేశ సమగ్రతను దెబ్బతీయడానికి అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వారిని కట్టడి చేసేందుకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆకె రవికృష్ణ పోలీస్ సిబ్బందికి పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకల పరేడ్ రిహార్షల్స్‌ను ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ రిహార్షల్స్‌ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేరాలు నివారణకు సీసీ టీవీల వినియోగాన్ని పెంచేందుకు ప్రతి పోలీసు అధికారి కషి చేయాలన్నారు. అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించి, పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కష్ణా పుష్కరాలతో పాటు స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న దష్ట్యా శాంతి భద్రతలపై పోలీసు నిఘాను పటిష్టం చేశామన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కష్ణమంత్రి పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొంటారని తెలిపారు. సివిల్, ఏఆర్ హోంగార్డు సిబ్బందితో పాటు ఎన్‌సీసీ విద్యార్థులు చక్కటి టర్నవుట్‌తో పరేడ్ రిహార్షల్స్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఆర్‌ఐ రంగముని, ఆర్‌ఎస్‌ఐలు మోహన్‌రెడ్డి, రంగనాథ్‌బాబు, నారాయణ, నరేష్, రఘురాముడు, శివయ్యశెట్టితో పాటు హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.
నగరంలో రూట్ మార్చ్:
పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి నేతత్వంలో ఆదివారం సాయంత్రం భారీ ఎత్తున రూట్‌మార్చ్ నిర్వహించారు. సాయుధ బలగాలతో పాటు సివిల్ పోలీసులు మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నారు. నగరంలోని అన్ని స్టేషన్ల సీఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత కంట్రోల్ రూమ్ (కోట్ల విగ్రహం) దగ్గర నుంచి కిడ్స్ వరల్స్, రాజ్‌విహార్ సెంటర్, మౌర్యా ఇన్, ఐదు రోడ్ల కూడలి, ఎస్‌బీఐ సర్కిల్, ఎకై ్సజ్ కార్యాలయం మీదుగా కొండారెడ్డి బురుజు వరకు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు.
పరేడ్ మైదానం ముస్తాబు:
స్వాతంత్య్ర వేడుకలకు పోలీసు పరేడ్ మైదానం ముస్తాబైంది. ఆదివారం నిర్వహించిన మాక్ వేడుకలతో ç(రిహార్షల్స్) పంద్రాగస్టు కల కొట్టొచ్చినట్లు కనిపించింది. కొండారెడ్డి బురుజుతో పాటు సమీపంలో ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని అలంకరించారు. డీఎస్పీ రమణమూర్తి ఆదేశాల మేరకు నగరమంతా బాంబ్‌స్క్వాడ్ బందం విస్తతంగా తనిఖీలు నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ నబీరసూల్‌తో పాటు సిబ్బంది కష్ణంరాజు, నరసింహా, శేఖర్, మద్దిలేటి తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు.