ఇదొక అందమైన ప్రపంచం
‘ఒక జాతి సంస్కృతి ఆ దేశప్రజల హృదయంలో కొలువై ఉంటుంది’ అన్నారు మహాత్మాగాంధీ. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా...ప్రతి సంస్కృతిలో తనదైన గొప్ప విలువ ఉంటుంది. సౌందర్యం ఉంటుంది. ఆ విలువ, సౌందర్యం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాకూడదు. విశ్వవ్యాప్తం కావాలి. భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచ సంస్కృతిని బలోపేతం చేయాలి. సంస్కృతుల పునాదుల మీద ‘ఐక్యత’ వెల్లివిరియాలి. ఈ ఆశయంతో వెలిసిందే ‘వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్’. అమెరికా నుంచి జాంబియా వరకు ప్రతిదేశ సాంస్కృతిక వైవిధ్యం వందపూలై వికసించాలి. వెయ్యి నక్షత్రాలై వెలిగిపోవాలి.