మంచిగా నిద్రపోకపోతే ఉదయం వేళ చురుకుగా పనిచేయడం సాధ్యం కాదు. ఏదో విధమైన చికాకు, కోపం ఎక్కువగా ఉంటాయి. అదీగాక వైద్యులు ఆరోగ్యకరమైన వ్యక్తికి సగటున ఆరు నుంచి 8 గంటలు నిద్ర అవసరమని సిఫార్సు చేస్తుంటారు. అలాంటిది ఓ జపాన్ వ్యక్తి కేవలం 30 నిమిషాల నిద్రపోతున్నాడట. అయినా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా చురుగ్గా తన పనులు చేసుకుంటున్నాడు. ఇలా అరంగంట నిద్రతోనే తన పనిసామర్థ్యం మరింత మెరుగుపడిందని చెబుతుండటం విశేషం.
వివరాల్లోకెళ్తే..జపాన్‌లో హ్యూగో ప్రిఫెక్చర్‌కు చెందిన డైసుకే హోరీ గత 12 ఏళ్లుగా అరగంటే నిద్రపోతున్నాడట. దీనివల్ల తన పని సామర్థ్యం మెరుగుపడిందని చెబుతున్నాడు. ఇలా 30 నిమిషాలే నిద్రపోయేలా తన శరీరానికి, మెదడుకు శిక్షణ ఇచ్చానని, అందుల్ల తాను అలిసిపోనని చెప్పాడు. తాను 12 ఏళ్ల క్రితం నుంచి ఇలా నిద్రను తగ్గించుకోవడం ప్రారంభించానని అలా ప్రస్తుతం తన నిద్రను రోజుకు 30 నుంచి 45 నిమిషాలకు తగ్గించుకోగలిగానని వెల్లడించాడు. తాను భోజనానికి ఒక గంట ముందు క్రీడలు లేదా కాఫీ తాగడం వంటివి చేసి నిద్ర వస్తుందనే భావన రాదని అంటున్నాడు.
అలాగే తమ పని సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వాళ్లు సుదీర్ఘ నిద్రకంటే నాణ్యమైన నిద్రతోనే ఎక్కువ ప్రయోజనం పొందగలరని చెబుతున్నాడు. ఇలాంటి టెక్నీక్‌తోనే సదా అప్రమత్తంగా ఉండే వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తక్కువసేపు నిద్రపోయినా అధిక సార్థ్యాన్ని కలిగి ఉంటారని చెప్పాడు. జపాన్‌లోని యోమియూరి టీవీ ఛానల్ డైసుకే ఎలా జీవిస్తున్నాడో చూపించే ఒక రియాలిటీ షో చేసింది. ఈ షో పేరు “విల్ యు గో విత్ మీ?”.వారు మూడు రోజుల పాటు డైసుకేని గమనించారు. అయితే ఒక ఎపిసోడ్‌లో డైసుకే కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు.
ఆ తర్వాత చాలా ఉత్సాహంగా లేచి, బ్రేక్‌ఫాస్ట్ చేసి పనికి వెళ్లడం, జిమ్ చేయడం వంటివి చేశాడు. ఇదంతా నమ్మశక్యంగా అనిపించకపోయినా అదే రియల్‌గా జరిగింది. అంతేగాదు 2016లో హోరీ జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసీయేషన్‌ని స్థాపించాడు. అక్కడ రెండు వేలకు పైగా విద్యార్థులకు తనలాగే తక్కువసేపు నిద్రపోవడం ఎలాగో నేర్పించాడు.
అయితే ఈ అల్ట్రా షార్ట్ స్లీపర్స్‌కు ఎందుకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావడం లేదనేది శాస్త్రవేత్తలకు అర్థకాని చిక్కుప్రశ్నలా ఉంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఇది ఎలానో నేర్చుకోవాలనుకుంటున్నామని, మరికొందరూ అందరికీ సరిపోదని, దీని వల్ల పలు సమస్యలు వస్తాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: నటుడు ఆశిష్ విద్యార్థి ఇష్టపడే బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment