దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా మగధీర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్‌లను తిరగరాసింది. పునర్జన్మల నేపథ్యంలో ఫాంటసీ కథాశంతో తెరకెక్కిన మగధీర సినిమా రాజమౌళిని టాప్ డైరెక్టర్‌గా నిలిపింది. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.
బాహుబలి సినిమాతో రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో బాహుబలి చిత్రానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు మగధీర సినిమాను కూడా జపనీన్ భాషలతో డబ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. అయితే గతంలోనే మగధీర జపనీస్ సబ్‌టైటిల్స్‌తో అక్కడ రిలీజ్ అయ్యింది.
కానీ ఆ సమయంలో రాజమౌళికి జపాన్‌లో ఎలాంటి ఇమేజ్ లేదు. బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు జపాన్‌లోనూ మారుమోగిపోయింది. అందుకే మగధీరను డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారట. అయితే విషయంపై చిత్రయూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment