జపాన్లో మర్యాదరామన్న
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాదరామన్న చిత్రం త్వరలో జపాన్ దేశవ్యాప్తంగా విడుదల కానుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇప్పటికే హిందీ, తమిళ్, బెంగాలీ భాషల్లోకి అనువాదమైన ఆ చిత్రం అక్కడి బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో మర్యాద రామన్న చిత్రాన్ని జపాన్లో విడుదల చేయాలని ఆ చిత్ర హక్కుదారుడు సంకల్పించినట్లు సమాచారం. కాగా అందుకు సంబంధించిన వర్క్ దాదాపుగా పూరైనట్లు తెలిసింది.
మరికొద్ది రోజుల్లో మర్యాద రామన్న చిత్రం జపాల్ దేశవ్యాప్తంగా హల్చల్ చేయనుంది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సునీల్, సలోనీ హీరోహీరోయిన్లుగా నటించిన మర్యాదరామన్న చిత్రం తెలుగులో బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వరుసగా వచ్చిన మగధీర, మర్యాదరామన్న, ఈగ చిత్రాలు విజయఢంకా మోగించిన విషయం విదితమే.
జపాన్లో రజనీకాంత్కు మంచి పాలోయింగ్ వుంది. ఆయన నటించిన ముత్తు, బాషా తదితర చిత్రాలలోపాటు ఇటీవలే విడుదలైన కొచ్చాడియాన్ వరకు అన్ని జపాన్ భాషలోకి అనువాదమై విడుదలైయ్యాయి. ఆ చిత్రాలకు జపనీయులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సునీల్ చిత్రం మర్యాదరామన్న కూడా జపాన్లో విడుదలకు సిద్ధమవుతున్నాడు. సునీల్ జపనీయులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.