Saloni
-
Google software engineer : ఏ డే ఇన్ మై లైఫ్...
గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సలోని రక్హోలియా ‘ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ గూగుల్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో 2.4 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఉదయం ఇంటి నుంచి బయలుదేరడం నుంచి గూగుల్ ఆఫీసులోకి అడుగు పెట్టడం, చెక్ అప్డేట్స్, బ్రేక్ ఫాస్ట్, ప్లాన్ ఫర్ ది డే అండ్ వర్క్, గెట్ సమ్ వాటర్ అండ్ స్నాక్స్, కోడ్ అండ్ అటెండింగ్ మీటింగ్స్, కొద్ది సమయం పుస్తకం చదవడం, టేబుల్ టెన్నిస్ ఆడడం, వర్క్ చేస్తూ స్నాక్స్, కాఫీ ఆస్వాదించడం. వర్క్కోడ్, డిజైన్, డిస్కస్, మ్యూజిక్ రూమ్‌లో కొద్దిసేపు గడపడం, జిమ్‌లో కొద్దిసేపు ఎక్సర్సైజ్, కోడింగ్ సెషన్లు, సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లడం...ఇలాంటి దృశ్యాలెన్నో ఈ వీడియోలో కనిపిస్తాయి. ఆఫీస్ జిమ్‌లో క్విక్ వర్కవుట్ సెషన్లాంటి వెల్–టైమ్డ్ బ్రేక్స్‌ను ఈ వీడియో హైలెట్ చేస్తుంది. -
'తంత్ర'.. పిల్లబచ్చాలు ఈ సినిమాకు రావద్దు!
హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ తంత్ర. ఈ సినిమాకు సెన్సార్‌వాళ్లు A సర్టిఫికేట్ ఇవ్వడంతో 'తంత్ర' టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయింది. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ 'A' ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిం. నిజానికి ఇదొక సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ. తమ సినిమా కచ్చితంగా భయపెడుతుందన్న నమ్మకమున్న మేకర్స్ తమ సినిమాకి చిన్నపిల్లలు రావొద్దని వారిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లో హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా చూపించారు. అనన్య నాగళ్లకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి నటించాడు. మర్యాద రామన్న ఫేం సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి.. వాల్ట్‌డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగి, సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని 'తంత్ర 'తో సాధించాడు. ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు నరేష్ బాబు, రవిచైతన్య పేర్కొన్నారు. మనమంతా నిద్రపోయాక స్మశానంలో మరో ప్రపంచం మేల్కొంటుంది! ఆ ప్రపంచాన్ని చూసే ధైర్యం మీకుందా?.. థియేటర్లో కలుద్దాము!🔥#Tantra is coming to scare you all in cinemas from MARCH 15th❤️🔥#TANTRAOnMarch15 pic.twitter.com/5Yvz49GGKp — Eluru Sreenu (@IamEluruSreenu) February 20, 2024 చదవండి: షణ్ముఖ్ అన్న ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో.. -
హారర్ చిత్రంతో సలోని రీఎంట్రీ
హీరోయిన్ సలోని గుర్తుందా..? అదేనండి ‘మర్యాద రామన్న’లో హీరో సునీల్ సరసన నటించి, తనదైన అందంతో ఆకట్టుకుంది. ఈ ఒక్క చిత్రంతో సలోనికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘బాడీగార్డ్’చిత్రంతో పాటు పలు సినిమల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించి మెప్పించింది. చివరగా రేసుగుర్రం చిత్రంలో అతిథి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.. తెలుగు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత ‘తంత్ర’ చిత్రంతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్’ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ‘మగధీర’లో షేర్‌ఖాన్ లాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ మేరకు దర్శనిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఫీమేల్ ఓరియెంటెడ్ లైన్‌తో రూపొందుతున్న హారర్ ఎంటర్టైనర్ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాఽథల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా స?గుతుంది. తంత్ర శాస్ర్తానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలను ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాం. ఇందులో అనన్య నాగళ్లతోపాటు ‘మర్యాదరామన్న’ ఫేం సలోని కీ రోల్ పోషిస్తున్నారు. గాళ్ నెక్ట్స్ డోర్ రోల్‌తోపాటు గ్లామర్ పాత్రలతోనూ మెప్పించిన సలోని ఇందులో డిఫరెంట్‌గా కనిపిస్తారు. నటనకు ఆస్కారమున్న పాత్ర అది. ఇటీవల అనన్యా, సలోని, హీరోపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అవుట్‌పుట్‌బాగా వచ్చింది. ఈ చిత్రం టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావడంతోపాటు సలోనికి మంచి కమ్‌బ్యాక్ అవుతుంది’’ అని తెలిపారు. -
రాజమౌళితో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..!
సాధారణంగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం చాలా కష్టమే. కొందరు తక్కువకాలంలోనే స్టార్డమ్ సొంతం చేసుకుంటే మరికొందరేమో మరిన్ని అవకాశాల కోసం వెయిట్ చేస్తారు. ఇండస్ట్రీలోకి అలా వచ్చి ఇలా వెళ్లేవారిని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో ముందువరుసలో ఉంటుంది ఆ నటి. దర్శకధీరుడు రాజమౌళితో హిట్ కొట్టిన హీరోయిన్ ఆ తర్వాత కనుమరుగైనపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? మర్యాద రామన్నలో మెప్పించిన సలోని. తాజాగా హైదరాబాద్‌లోని ఓ జువెలరీ ర్యాంప్ షోలో కనిపించింది భామ. ఆమెను చూసిన చాలామంది అభిమానులు మొదట గుర్తు పట్టలేకపోయారు. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినా అంత ఈజీగా మరిచిపోయే గ్లామర్ కాదు. సునీల్‌తో మర్యాద రామన్నలో కనిపించిన నటి ఇప్పుడు చూస్తే షాకవ్వడం ఖాయం. అప్పుడు సన్నగా ఉన్న సలోని ఇప్పుడేమో కాస్త బొద్దుగా కనిపించే సరికి గుర్తుపట్టడం కష్టమైంది. ఈ సినిమాకు ముందు సలోని గురించి ఎవరికీ తెలియదు. అంతుకుముందు ఆమె చేసిన కొన్ని సినిమాలు కూడా ఎప్పుడొచ్చి వెళ్లాయనేది కూడా తెలీదు. సునీల్ హీరోగా నటించిన ఈ సినిమాతో రాజమౌళి హిట్ కొట్టారు. View this post on Instagram A post shared by salloniasvwani🧚♀️😇 (@saloniaswani_official) -
Saloni Gaur: కంగనాను అనుకరిస్తూ ‘రన్- అవుట్’.. 17 లక్షల మంది సబ్స్క్రైబర్స్!
Saloni Gaur Story In Telugu: ఆమెకు చిన్నప్పటినుంచి రోజూ న్యూస్ పేపర్లు చదవడం అలవాటు. వీటితోపాటు కథల పుస్తకాలు, నవలలు కూడా చదివేది. అలాగని పాఠ్యపుస్తకాలంటే పడదని కాదు...పాఠాలు కూడా శ్రద్ధగానే చదివేది. ఇలా బాల్యం నుంచి అనేక అంశాలపై పట్టుపెంచుకుని వాటి మీద కామెడీ చేసేది. అప్పట్లో సరదాగా చేసిన ఆ కామెడీనే ఇప్పుడామెని డిజిటల్ స్టార్‌ను చేసింది. ఆమే సలోని. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన సలోని గౌర్ అక్కడే స్కూలు చదువు పూర్తిచేసింది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. చిన్నప్పటి నుంచి కరెంట్ ఈవెంట్స్‌ను ఫాలో అవుతూ అన్నింటిలోనూ చురుకుగా ఉండేది. దేశంలో జరిగే అనేక సమకాలీన అంశాలపై హాస్యాన్ని జోడించి తనదైన శైలిలో అందరినీ అనుకరించేది. ఆమె అనుకరణకు స్నేహితులు బాగా నవ్వుకునేవారు. దాంతో తను చేసే కామెడీని తన ఫోన్లో వీడియోలు తీసుకునేది. తర్వాత వాటిని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసేది. ఈ వీడియోలకు మంచి స్పందన లభించడంతో వీడియోలను మరింత మెరుగ్గా పోస్ట్ చేసేందుకు ప్రయత్నించేది. కాలుష్యంపై కామెడీ.. చిన్న చిన్న కామెడీ వీడియోలు పోస్టుచేస్తోన్న సలోనీ.. 2019 నవంబర్‌లో తన పేరు మీదనే ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. ఢిల్లీలోని కాలుష్యంపై ‘నజ్మా ఆపీ’ పేరిట వీడియో పోస్టు చేసింది. ఢిల్లీ కాలుష్యంపై చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. అతి తక్కువ కాలంలో దాదాపు పదిలక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. నజ్మా అంటే.. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మధ్యతరగతి ముస్లిం మహిళ. తన సాధక బాధలు, రాజకీయ, సామాజిక అంశాలను తోటివారితో ఎలా చర్చిస్తుందో తెలిపే ఫన్నీవీడియోలు నజ్మా ఆపీలో కనిపిస్తాయి. ఈ క్యారెక్టరేగాక దేశంలోని ట్రెండింగ్‌లో ఉన్న వార్షిక బడ్జెట్, ఉల్లిపాయ ధరలు, సీఏఏ, ఢిల్లీలో ఎముకలు కొరికే చలి, పాకిస్థాన్ రచయిత ఫైజ్ అహ్మద్ వివాదాస్పద రచనలు, కరోనా, లాక్డౌన్, నిరసన లు, ఇండియన్ మామ్స్, డే టు డే లైఫ్, దేశంలో నిరసనలు, హక్కుల పోరాట ఉద్యమాలు, బాలీవుడ్ నటీనటులపై కామెడీ, మిమిక్రీ వీడియోలను పోస్టు చేసేది. వీటికి మంచి స్పందన ఉండేది. రన్–అవుట్ టిక్‌టాక్, కరోనా వైరస్, ఢిల్లీ ఎన్నికలు, అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన వంటి సలోని కామెడీ వీడియోలకు మంచి ఆదరణ లభించింది. కామెడీతోపాటు.. అనుకరణ కూడా చేసేది. ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వరాన్ని బాగా అనుకరిస్తుంది. కంగనా మీడియా వేదికగా ఏది మాట్లాడినా, దానిని నవ్వించే విధంగా ‘రన్–అవుట్’ పేరిట వీడియోలు పోస్ట్ చేసేది. ఈ వీడియోలు నెటిజనులను బాగా ఆకట్టుకునేవి. ఆ మధ్యకాలంలో కమేడియన్ కునాల్ కమరా, న్యూస్ యాంకర్ అర్నాబ్ గోస్వామిపై కంగన స్పందనను అనుకరించిన వీడియోలకు యాభై లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. అంతేగాక నజ్మా ఆపీ క్యారెక్టర్‌తో వందకుపైగా వీడియోలు చేసింది. వీటన్నింటికీ లక్షల్లో వ్యూస్ వచ్చేవి. ఆదర్శ బహు, ట్యూమర్ భరద్వాజ్, సాసు మా వంటి క్యారెక్టర్లు కూడా మంచి పేరు తెచ్చాయి. ఇప్పుడు సలోనీ యూట్యూబ్ చానల్‌కు దాదాపు 17 లక్షలమంది సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు ఆరు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. -
Saloni Sacheti: బాన్సూలీ అంటే ఏమిటో తెలుసా.. ఈ నగలు ధరిస్తే!
సలోని లా కాలేజి విద్యార్థి. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వివిధ మారుమూల ప్రాంత వాసులను కలిసే అవకాశం వచ్చింది. వచ్చామా, పని చూసుకుని వెళ్లామా అనుకోలేదు సలోని. తన ఇంటర్న్‌షిప్‌తోపాటు పర్యటిస్తోన్న గ్రామాల్లో.. ముఖ్యంగా గిరిజనుల ఆర్థికస్థితిగతులు, జీవన శైలి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంది. వీరికోసం ఏదైనా చేసి మంచి జీవితం ఇవ్వాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఐదుగురు మహిళలతో కలిసి వెదురుతో జ్యూవెలరీని తయారు చేయించడం మొదలు పెట్టింది. ఈ వెదురు నగలు అందంగా ఆకర్షణీయంగా ఉండడంతో విక్రయాలు బాగానే జరిగేవి. గిరిపుత్రికలకు శిక్షణ ఇస్తున్న సలోని అలా 13 నెలలు గడిచిపోయాక సలోని ప్రాజెక్టు వర్క్ పూర్తయింది. దీంతో తన సొంత ఊరు వెళ్లడం, ఇంట్లో వాళ్లు పెళ్లి చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. కానీ వెదురుతో జ్యూవెలరీ తయారు చేస్తూ ఉపాధి పొందవచ్చని గ్రహించిన గిరిజన మహిళలు .. తమ జ్యూవెలరీ వర్క్‌ను మరింత ముందుకు తీసుకెళ్లమని సలోనిని అడగడంతో.. సలోనికి మళ్లీ రంగంలో దిగక తప్పలేదు. వెంటనే ‘బాన్సూలి’ పేరిట ఓ స్టార్టప్‌ను ప్రారంభించి.. గిరిజన మహిళలు సొంత ఊరు వదిలి, వలస వెళ్లకుండా అక్కడే ఆనందంగా, ఆర్థిక భరోసాతో జీవించేలా ఉపాధి కల్పిస్తోంది. అల్వార్ అమ్మాయి రాజస్థాన్‌లోని అల్వార్‌లో మార్వారి జైన్ కుటుంబంలో జన్మించింది సలోని సఛేతి. స్కూలు విద్యాభ్యాసం పూర్తయ్యాక ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ హానర్స్ ఫిలాసఫీ చేసింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే సలోని కాలేజీలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేది. డిగ్రీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా అందుకుంది. బిఏ తరువాత బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎల్ఎల్బీలో చేరింది. ఎల్ఎల్బీ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా గుజరాత్‌లోని డ్యాంగ్ జిల్లాలో వివిధ గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకునేది. ఈ క్రమంలోనే గిరిజన ప్రాంతాలను పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఉపాధిలేక పేదరికంతో అల్లాడడం చూసింది. పొట్టచేతబట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్తున్న వారి దయనీయ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయి 2009లో ‘బాన్ సూలి’ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. బాన్సూలీ అంటే బాన్ అంటే వెదురు. సూలీ అంటే నగలు బాన్సూలీ అంటే నగల నమూనా అని అర్థం. బాన్సూలీ ద్వారా డ్యాంగ్ జిల్లా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడ అధికంగా దొరికే వెదరును జూవెలరీ తయారీలో వినియోగించడం విశేషం. సమకాలిన ఫ్యాషన్‌కు అద్దం పట్టేలా వెదురుకు రాళ్లు, రత్నాలు, పూసలు జోడించి జ్యూవెలరీని తయారు చేస్తున్నారు. ఎక్కువ బరువు లేకుండా కేవలం ఏడు నుంచి పది గ్రాముల్లోపే ఆకర్షణీయమైన ఆభరణాలను రూపొందించి విక్రయిస్తున్నారు. తొలినాళ్లలో ఆర్యా, మిమనాస, ద్యుతి, బోగన్ విలియ డిజైన్లను రూపొందించగా, ప్రస్తుతం రెండువందలకు పైగా విభిన్న రకాల డిజైన్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటిలో జ్యూవెలరీతోపాటు లాప్టాప్ స్టాండ్స్, లైట్ స్టాండ్స్, రాఖీలు, దియాలు, కిచెన్, గృహాలంకరణ వస్తువులు కూడా ఉన్నాయి. ప్రారంభంలో బాన్సూలీ డిజైన్లను... ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పేజీలు క్రియేట్ చేసి వాటిల్లో వీరి సరికొత్త వెదురు జ్యూవెలరిని అప్లోడ్ చేసేవాళ్లు. అంతేగాక వివిధ నగరాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి వెదురు నగలను ప్రదర్శించేవారు. వీటికి మంచి స్పందన రావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కొరియర్ కంపెనీలతో కలిసి బాన్సూలీ జ్యూవెలరినీ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బాన్సూలీ పదిహేనులక్షల టర్నోవర్‌తో విజయవంతంగా నడుస్తోంది. దీని ద్వారా దాదాపు నలభై మంది గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఫోర్బ్స్ జాబితాలో... బాన్సూలీ ఉత్పత్తుల విక్రయాలు ఆశించిన దానికంటే అధికంగా జరగడంతో అనేక సంస్థలు సలోని కృషికి గుర్తింపుగా వివిధ అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ‘అండర్–30’ జాబితాలో సలోని పేరు ఉండడం విశేషం. ఇవేగాక 3ఎమ్ సీఐఐ ఇన్నోవేటర్ ఛాలెంజ్ అవార్డు, ఎన్ఐఆర్డీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ‘‘బెస్ట్ స్టార్టప్ అవార్డు’’, టాప్ 18 సోషల్ ఇన్నోవేటర్, సోషల్ సెక్టార్లో ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డులను దక్కించుకుంది. ఒక్క గుజరాత్లోనేగాక వెదురు అధికంగా లభ్యమయ్యే ప్రాంతాల్లో బాన్సూలిని విస్తరించనున్నట్లు సలోని చెబుతోంది. చదవండి: Humans Of Patuli: కొత్త చీరలు కొని డొనేట్ చేస్తున్నారు.. ఎందుకంటే.. -
డూడులమ్మలు...
మొదట ఏమిటోగానీ ఇప్పుడు ‘డూడుల్’ అనేది పక్కింటి అబ్బాయి పేరు విన్నంత సహజమైపోయింది. నిఘంటువు అర్థం ప్రకారం ‘డూడుల్’ అంటే వోన్లీ వన్ వే... అదే ఫన్ వే! కొందరు మహిళా ఇలస్ట్రేటర్లు ఆ దారి తప్పకుండా, ఒకవైపు వినోదం పంచుతూనే మరోవైపు సామాజికస్పృహకు ప్రాధాన్యత ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నేహాశర్మ’(దిల్లీ) ‘నేహా డూడుల్స్’ పేరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ‘స్త్రీ సాధికారత’ను ప్రధాన వస్తువుగా తీసుకొని ఆమె డూడుల్స్ రూపొందిస్తుంటుంది. తన కళాత్మక అంశం చాలామందికి రియాలిటీచెక్లా ఉపయోగపడుతుంది. ‘డూడుల్స్‌లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు? హాయిగా నవ్వించవచ్చు కదా! అనుకుంటారు చాలామంది. అయితే సామాజిక విషయాలను డూడుల్స్‌గా ఎంచుకున్నంత మాత్రాన సీరియస్‌గానే చెప్పాలనే రూల్ ఏమీ లేదు కాదా! సున్నితంగా నవ్విస్తూనే విషయాన్ని సూటిగా చెప్పవచ్చు అని చెప్పడానికి ‘నేహా డూడుల్స్’ ఉదాహరణగా నిలుస్తాయి’ అని చెబుతుంది నేహాశర్మ చిరకాల ఫాలోవర్ రమ్య. సలోని పటేల్ (కోల్‌కతా) రూపొందిస్తున్న డూడుల్స్ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయం ఒక్కటే...‘జీవితాన్ని గ్లోబ్ మోసినంత భారంగా మోయనక్కర్లేదు. చిన్న జీవితాన్ని ప్రతిరోజూ పెద్దపండగలా జరుపుకోవచ్చు’ ‘ఎప్పుడైన మనసు బాగలేకపోతే నా దృష్టి సలోని సృష్టించే డూడుల్స్పై మళ్లుతుంది. హాయిగా నవ్వుకుంటాను. కొత్త ఉత్సాహంతో పనిచేస్తాను’ అంటుంది జాన్వీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకసారి యాదృచ్ఛికంగా ఆమె సలోని వేసిన డూడుల్స్‌ను ఇన్స్టాగ్రామ్ లో చూసింది. ఇక అప్పటి నుంచి రెగ్యులర్‌గా ఫాలో అవుతోంది. వైబ్రంట్ కలర్స్, ఇమేజరీలతో ఆకట్టుకుంటుంది దిల్లీకి చెందిన భావ్య దోషి. రోజూ వినే సాధారణ సంభాషణలే ఆమె రూపొందించే డూడుల్స్‌లో కొత్త సొగసును సంతరించుకుంటాయి. బిగ్గరగా నవ్విస్తాయి. ‘కంటెంట్ కోసం జుట్టు పీక్కోవాల్సిన పనిలేదు. మన చుట్టూ ఉన్న జీవితం నుంచే ఎంతో సృష్టించుకోవచ్చు’ అంటుంది కోల్‌కతాకు చెందిన శ్రేయా కుందు. ‘శ్రేయా రూపొందించే డూడుల్స్‌లో బొమ్మలు కనిపించవు. ఎక్కడో ఒకచోట మనకు పరిచయం ఉన్నవారు కనిపిస్తారు. అదే శ్రేయా ప్రత్యేకత’ అంటుంది శ్రేయా అభిమాని సత్య. ఇక ఆకాంక్ష కుంచె నుంచి జాలువారే డూడుల్స్ ఆకట్టుకునేలా ఉండడమే కాదు కాసేపు ఆలోచించేలా చేస్తాయి. నవ్వించడం మంచిదే. నవ్వించడం ద్వారా మంచిని చెప్పడం అందులోనూ సునిశితంగా... కళాత్మకంగా బోధించడం అంతకంటే మంచిది కదా! -
మళ్లీ మర్యాద రామన్న జోడీ
హీరోగా సునీల్ కెరీర్లో మంచి విజయం అందించిన చిత్రం ‘మర్యాద రామన్న’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో సునీల్, సలోని జంటగా నటించారు. ఈ సినిమా 2010లో విడుదలైంది. పదేళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ స్క్రీన్ మీద జంటగా కనిపించబోతోందట. సునీల్, సలోని హీరోహీరోయిన్లుగా దర్శకుడు వీఎన్ ఆదిత్య ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం చేయాలనుకుంటున్నారని తెలిసింది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. -
మిస్టర్ రావణ
‘విన్నర్’, ‘రోగ్’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాల్లో ప్రతి నాయకుడిగా నటించిన అనూప్‌సింగ్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. అనూప్‌సింగ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మిస్టర్ రావణ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో సలోని కథానాయిక. కుందన్ ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ చిత్రానికి ఇంద్రజిత్ సహ–నిర్మాత. అనూప్ మాట్లాడుతూ–‘‘స్క్రిప్ట్ బాగుంది. నా క్యారెక్టరైజేషన్‌ను బాగా డిజైన్ చేశారు. నటుడిగా నా కెరీర్లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర వాస్తవానికి దగ్గరగా ఉంటుంది’’ అన్నారు సలోని. ‘‘అన్ని భాషల నటీనటులు ఈ సినిమాలో ఉంటారు’’ అన్నారు కుందన్ రాజ్. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి. -
‘మిస్టర్ రావణ’గా మిస్టర్ వరల్డ్
సింగం 3, రోగ్ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అయిన అనుపూ థాకూర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ రావణ. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవల ముంబైలోని ప్రపంచ ప్రసిద్దమైన శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్లో ప్రారంభమైంది. కుందన ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అనూప్ సింగ్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్, నా క్యారక్టరైజేషన్ను చాలా బాగా డిజైన్ చేశారు. నటుడుగా నా కెరీర్లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందన్నారు. సలోని మాట్లాడుతూ.. రియలిస్టిక్ కథాశంతో ఈ సినిమా ఉంటుంది. నా పాత్ర వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు. దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ... ‘అనూప్ సింగ్ విలన్‌గా మనకు సుపరిచితుడే. ఈ సినిమాలో కూడా ఆయన టైటిల్ పాత్రలో నట విశ్వరూపాన్ని చూపిస్తారు. సలోని హీరోయిన్గా మంచి పాత్రలో కనిపిస్తారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది అన్నారు. నిర్మాత కుందన్ రాజ్ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్ తో నాలుగు భాషల్లో ఈ సినిమా తెరమీదకు రానుంది. అన్నీ భాషల నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలిపారు. -
టక్కరి దొంగ.. చక్కని చుక్క
‘హృదయ కాలేయం’ ఫేమ్ సంపూర్ణేశ్ బాబు హీరోగా ‘టక్కరి దొంగ.. చక్కనిచుక్క’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. అలీ కథానాయకుడిగా ‘అల్లరి పెళ్లికొడుకు’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జె.జె.ప్రకాష్ రావు, నిర్మాత ఎం.రాజ్ కుమార్ కాంబినేషన్లో ఆర్.కె. ఫిలిం ఫ్యాక్టరీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోని కథానాయికగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రకాష్ రావు, నిర్మాత ఎం.రాజ్ కుమార్ మాట్లాడుతూ –‘‘లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. స్క్రిప్ట్ బాలా బాగా వచ్చింది. ఈ చిత్రంలో నాలుగు ఫైట్లు, ఆరు పాటలు ఉంటాయి. ఈ నెల రెండో వారంలో షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమెరా: పైడాల శ్రీనివాస్. -
'మీలో ఎవరు కోటీశ్వరుడు' మూవీ రివ్యూ
టైటిల్ : మీలో ఎవరు కోటీశ్వరుడు జానర్ : సెటైరికల్ కామెడీ తారాగణం : పృథ్వీ, సలోని, నవీన్ చంద్ర, శృతిసోథి, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, రఘుబాబు సంగీతం : డిజె వసంత్ దర్శకత్వం : ఇ. సత్తిబాబు నిర్మాత : కె కె రాధామోహన్ కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఇ సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సెటైరికల్ కామెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు. తొలిసారిగా కామెడీ స్టార్ 30 ఇయర్స్ పృథ్వీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, శృతిసోథీ, సలోనిలు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. తొలిసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పృథ్వీకి మీలో ఎవరు కోటీశ్వరుడు సక్సెస్ అందించిందా..? సత్తిబాబు, తన కామెడీ ఫార్ములాతో మరోసారి ఆకట్టుకున్నాడా..? కథ : ప్రశాంత్(నవీన్ చంద్ర) ఓ సిన్సియర్ స్టూడెంట్. కాలేజ్ టాపర్ అయిన ఈ కుర్రాడికి ఓ రోజు అర్థరాత్రి ఫుల్‌గా తాగేసి.. కారును డివైడర్‌కు గుద్దేసిన ప్రియా(శృతిసోథీ) కనిపిస్తుంది. ప్రియా పరిస్థితిని చూసి తానే వెళ్లి ఇంట్లో దిగబెట్టి వస్తాడు ప్రశాంత్. ఓ అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో కనిపించినా.. ఏ మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చిన ప్రశాంత్‌తో ప్రేమలో పడుతుంది ప్రియా. ముందు కాస్త బెట్టు చేసినా ఫైనల్‌గా ప్రశాంత్ కూడా ప్రేమలో పడతాడు. తమ ప్రేమకు ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా.., మల్టీ మిలియనీర్ అయిన ప్రియా త్రండి మాత్రం ఏబీఆర్(మురళీ శర్మ) అంగీకరించడు. తన ఆస్తి కోసమే ప్రియను ప్రేమలో పడేశావని ప్రశాంత్‌ని అవమానిస్తాడు. ప్రశాంత్ మాత్రం డబ్బుతో ఆనందం రాదని, కావాలంటే మీరు ఒక్కసారి ఏదైన బిజినెస్ చేసి నష్టపోయి చూడండి తరువాత మీకు ఆనందం విలువ ఏంటో తెలుస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పటి వరకు ఏ బిజినెస్‌లోనూ నష్టపోని ఏబీఆర్, నష్టాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియా ఇవ్వమని పేపర్ ప్రకటన ఇస్తాడు. అలాంటి ఐడియా ఇచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి ప్రకటిస్తాడు. స్టార్ హీరోలతో సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణమురళి) ఆ ప్రకటన చూసి ఏబీఆర్ను కలుస్తాడు. తాను ఓ ఫ్లాప్ సినిమా తీసి పెడతానని దాంతో భారీగా నష్టం వస్తుందని ప్రామిస్ చేస్తాడు. జీవితంలో ఒక్క హిట్ కూడా ఇవ్వని దర్శకుడు రోల్డ్ గోల్డ్ రమేష్ (రఘుబాబు) డైరెక్టర్‌గా, 30 ఏళ్లుగా జూనియర్ ఆర్టిస్ట్‌గానే మిగిలిపోయిన వీరబాబు( పృథ్వీ) హీరోగా సలోని హీరోయిన్గా తమలపాకు పేరుతో సినిమా ప్లాన్ చేస్తాడు. చివరకు రోల్డ్ గోల్డ్ రమేష్ తెరకెక్కించిన తమలపాకు సినిమా రిలీజ్ అయ్యిందా..? అనుకున్నట్టుగా ఏబీఆర్ నష్టపోయాడా..? ప్రశాంత్, ప్రియా ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : పేరుకు నవీన్ చంద్ర హీరో అయినా.. సినిమా అంతా పృథ్వీనే హీరోగా కనిపిస్తాడు. తనకు బాగా అలవాటైన పేరడీ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్‌తో పాటు పంచ్ డైలాగ్స్తోనూ అలరించాడు. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు పాత్రకు పోసాని కృష్ణమురళి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రఘుబాబు, పోసాని కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కితకితలు పెడతాయి. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, జయప్రకాష్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, ధనరాజ్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : రెండు విభిన్న కథలను ఓకె కథలో చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఇ సత్తిబాబు ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రెండు కథలను కనెక్ట్ చేసిన తీరు కూడా బాగుంది. ఇప్పటికే తనకు కామెడీ సినిమాలు తెరకెక్కించటంలో తిరుగులేదని ప్రూవ్ చేసుకున్న సత్తిబాబు, ఈ సినిమాతో పేరడీ కామెడీని కూడా బాగానే డీల్ చేశాడు. సినీ రంగం మీదే సెటైరికల్‌గా తెరకెక్కించిన కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. డిసె వసంత్ సంగీతం బాగుంది. ఎక్కువగా పాత సినిమా పాటలనే వాడుకున్నా.. నేపథ్య సంగీతంతో తన మార్క్ చూపించాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ పృథ్వీ క్యారెక్టర్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఓవరాల్‌గా మీలో ఎవరు కోటీశ్వరుడు కాస్త సాగదీసినట్టుగా అనిపించినా.. కడుపుబ్బా నవ్వించే సెటైరికల్ కామెడీ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
హాస్య నటులు కూడా హీరోలే
‘‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అదే ఐడియా నలుగురు ప్రేమికుల జీవితాన్ని ఎలా మార్చిందన్నదే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కథ’’ అన్నారు కథానాయిక సలోని. నవీన్‌చంద్ర, శ్రుతీ శోధి, పృధ్వీ, సలోని ముఖ్య పాత్రల్లో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సలోని చిత్ర విశేషాలు పంచుకున్నారు. ⇒ లవ్, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో మహేశ్ పాత్రలో ‘థర్టీ ఇయర్స్’ పృధ్వీ, సమంత పాత్రలో నేను ఇంటర్మీడియట్ విద్యార్థులుగా కనిపిస్తాం. మా ఇద్దరి మధ్య వచ్చే పాటకు సెట్స్‌లో క్లాప్స్, విజిల్స్ కొట్టారు. ⇒ కామెడీ సీన్స్ చేయడం చాలా కష్టం.నా దృష్టిలో హాస్య నటులు కూడా హీరోలే. నా మనసుకు నచ్చితే ఎవరితోనైనా నటిస్తా. నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రా వదులుకోను. ఈ చిత్రదర్శకుడు సత్తిబాబు కూల్ పర్సన్. తనకు కావాల్సిన నటన రాబట్టుకున్నారు. రాధామోహన్ గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. ⇒హిందీలో అమితాబ్ బచ్చన్‌గారితో ఓ చిత్రం డిస్కషన్స్‌లో ఉంది. కొన్ని తెలుగు, తమిళ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. -
ప్రదేశాలే వేరు...ప్రయాణాలు ఒకటే...
ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం ఉంచితే... అక్కడితో వివాహం పూర్తయినట్లే. మిగతా తంతు అంతా వేడుక కోసమే. అయితే ఈ దంపతులు వేడుకల వరకు వెళ్లలేదు. పెళ్లి మాత్రం అయ్యిందనిపించి, వెంటనే ఎవరి డ్యూటీకి వారు వెళ్లిపోయారు! వాళ్లేమీ సామాన్యులు కాదు... ఇద్దరూ ఐఏఎస్ ఆఫీసర్లు! ఐదు వందల రూపాయల ఖర్చుతో వివాహం చేసుకుని 48 గంటల లోపే మధ్యప్రదేశ్‌కి ఒకరు, ఆంధ్రప్రదేశ్‌కి ఒకరు విధి నిర్వహణకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వధువు ‘సలోని సిదానా’ను సాక్షి ‘ఫ్యామిలీ’ పలకరించింది. ‘‘మా వివాహం గురించి పెద్దగా రాయవలసింది ఏమీ లేదు. మా ఇరుపక్షాల పెద్దల అంగీకారంతోనే ఇలా.. ఖర్చు లేకుండా చేసుకున్నాం. అన్ని వివాహ విధానాలనూ నేను గౌరవిస్తాను. అయితే మేము ఎంచుకున్న విధానం అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే బాధ్యతలలోకి వచ్చాను. ఇంకా ఎన్నో చేయాలి. కొత్తగా చిగుళ్లు తొడుగుతున్న రాజధానికి సబ్‌కలెక్టర్‌గా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అంటున్న సలోని మనోభావాలివి. మెడిసిన్ చదివి... సివిల్స్ లోకి మాది వ్యవసాయ కుటుంబం. పంజాబ్‌లోని జలాలాబాద్‌లోని చిన్న గ్రామం మా ఊరు. మేము ముగ్గురం. తమ్ముడు అనిష్, అక్క మమతా సిదాని, నేను. తమ్ముడు ఐఐటి చదువుతున్నాడు. నేను ఢిల్లీలో ఎంబిబిఎస్ పూర్తి చేసి, ఎయిమ్స్‌లో రేడియాలజిస్టుగా పనిచేశాను. అయితే నా మనసు నన్ను సివిల్స్ వైపు లాగుతుండేది. ఆ సమయంలోనే అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో పీజీ సీటు వచ్చింది. సివిల్ సర్వీసులో చేరాలని ఆసక్తి ఉండటంతో, పీజీ వదులుకున్నాను. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాను. 2013లో యుపిఎస్సి పరీక్ష రాశాను. 74వ ర్యాంకు వచ్చింది. సివిల్ సర్వీసులో చేరడం వల్ల నేను ఎక్కువమందికి సేవలు అందించగలుగుతాను. ముఖ్యంగా పేదలకు సహాయం చేయడం కోసమే ఇటువైపు వచ్చాను. పెద్ద నోట్ల రద్దు కారణం కాదు శిక్షణా కాలంలో విజయవాడలో ట్రెయినీ కలెక్టర్‌గా పనిచేశాను. పోస్టింగ్ కూడా విజయవాడలోనే వచ్చింది. తెలుగు వారి కోసం కేవలం నెల రోజుల వ్యవధిలో తెలుగులో మాట్లాడటం నేర్చుకున్నాను. దక్షిణ భారతదేశానికి ఇది నా మొదటి ప్రయాణం. అంతకుముందే ముస్సోరి ట్రైనింగ్‌లో లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో అవినాష్‌కి నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం ప్రేమగా, ప్రేమ పెళ్లిగా మారింది. నవంబరు 28 న మధ్యప్రదేశ్‌లోని భిండ్ కోర్టులో అతి సామాన్యంగా మా పెళ్లి జరిగింది. అవినాష్‌ది రాజస్థాన్. అతడి పోస్టింగ్ మధ్యప్రదేశ్‌లో. అక్కడి వశిష్ఠ గోహాడ్‌లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నారు. పెద్ద నోట్లు రద్దయిన కారణంగా ఇలా నిరాడంబరంగా మేము పెళ్లి చేసుకోలేదు కానీ, ఆదర్శ వివాహానికి ఒక మంచి అవకాశం లభించిందనుకున్నాం. సంభాషణ: డా. వైజయంతి, సాక్షి, విజయవాడ -
ఒకటి కాదు.. పది!
ఎక్కడా పెద్దగా అవకాశాలు లేక సతమతమవుతున్న బబ్లీ గాళ్ సలోనీ.. రూటు మార్చినట్టుంది. వచ్చిన ఒక్క చాన్స్‌ను వందగా మార్చుకోవాలని స్కెచ్ గీసినట్టుంది. అందుకే కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్రకు గాలం వేసే ప్రయత్నం చేసిందీ సుందరి. వీరిద్దరూ నటించిన చిత్రం ‘శివం’. చాలా కాలం తరువాత మళ్లీ శాండల్‌వుడ్‌లో చేసిన అమ్మడు... ఉపేంద్రతో పది సినిమాలు చేయాలనుందంటూ అతగాడిని ఆకాశానికెత్తేసింది. ‘ఉప్పీతో మూడో చిత్రం ఇది. నాకు దక్కిన గౌరవమిది. గత రెండూ సూపర్ హిట్స్. ఇది కూడా విజయం సాధింస్తుందన్న నమ్మకం ఉంది. ఉపేంద్రతో కనీసం పది సినిమాలు చేయాలనుకుంటున్నా. అంతటి అద్భుతమైన నటుడు, దర్శకుడు ఆయన’ అంటూ ఆకాశానికెత్తేసింది. -
ఫ్యాషన్ దివాస్
తెలుగమ్మాయి పాటలో వెలిగిన అమ్మాయి... ర్యాంప్‌పై మెరిసింది. న్యూయార్క్‌కు చెందిన అంతర్జాతీయ బ్రాండ్ దివాజియా నగరంలో తమ షోరూమ్‌ను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా... మాసబ్‌ట్యాంక్ గోల్కొండ హోటల్లో కర్టన్‌రైజర్ కార్యక్రమం నిర్వహించింది. సినీనటి సలోని సెంటరాఫ్ అట్రాక్షన్. ఈ ఈవెంట్లో బ్రాండ్‌కు చెందిన డిజైనర్ దుస్తులు, ఫుట్‌వేర్ , యాక్సెసరీస్‌ను మోడల్స్‌తో కలసి ఆమె ప్రదర్శించింది. - సాక్షి, సిటీ ప్లస్ -
జపాన్‌లో మర్యాదరామన్న
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాదరామన్న చిత్రం త్వరలో జపాన్ దేశవ్యాప్తంగా విడుదల కానుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇప్పటికే హిందీ, తమిళ్, బెంగాలీ భాషల్లోకి అనువాదమైన ఆ చిత్రం అక్కడి బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో మర్యాద రామన్న చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేయాలని ఆ చిత్ర హక్కుదారుడు సంకల్పించినట్లు సమాచారం. కాగా అందుకు సంబంధించిన వర్క్ దాదాపుగా పూరైనట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో మర్యాద రామన్న చిత్రం జపాల్ దేశవ్యాప్తంగా హల్చల్ చేయనుంది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సునీల్, సలోనీ హీరోహీరోయిన్లుగా నటించిన మర్యాదరామన్న చిత్రం తెలుగులో బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వరుసగా వచ్చిన మగధీర, మర్యాదరామన్న, ఈగ చిత్రాలు విజయఢంకా మోగించిన విషయం విదితమే. జపాన్‌లో రజనీకాంత్‌కు మంచి పాలోయింగ్ వుంది. ఆయన నటించిన ముత్తు, బాషా తదితర చిత్రాలలోపాటు ఇటీవలే విడుదలైన కొచ్చాడియాన్ వరకు అన్ని జపాన్ భాషలోకి అనువాదమై విడుదలైయ్యాయి. ఆ చిత్రాలకు జపనీయులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సునీల్ చిత్రం మర్యాదరామన్న కూడా జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాడు. సునీల్ జపనీయులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి. -
కోలీవుడ్‌కు మరో ముంబయి భామ
సినిమా అనే వినోద ప్రపంచంలో పాత నీరు పోయి కొత్త నీరు రావడం అన్నది సర్వసాధారణం. అదే విధంగా కోలీవుడ్లోకి ఇతర భాషా భామల రాక నానాటికీ పెరుగుతూనే ఉంది. నిజం చెప్పాలంటే ఇక్కడ మాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీల హవానే ఎక్కువ. నయనతార, హన్సిక, అనుష్క, కాజల్, అమలాపాల్, లక్ష్మీమీనన్ వంటి వారు ఈ కోవకు చెందినవారే. తాజాగా సలోని అనే ముంబాయి ముద్దుగుమ్మ చేరనుంది. ఈ అమ్మడు ఇంతకు ముందు మోడలింగ్ రంగంలోను, థియేటర్ ఆర్టిస్టుగాను రాణించారట. ఇప్పుడు సరభం అనే చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. పిజ్జా, సూదుకవ్వుం, తెగిడి తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సి.వి.కుమార్ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం సరభం. దర్శకుడు గౌతమ్‌మీనన్ శిష్యుడు, నటుడు అనుమోహన్ కొడుకు అయిన అరుణ్ మోహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నటించడం గురించి నవ హీరోయిన్ సలోని మాట్లాడుతూ ఇది నటనకు అవకాశమున్న థ్రిల్లర్ కథా చిత్రమని చెప్పింది. దర్శకుడు కథను నెరేట్ చేసినప్పుడు తాను చాలా థ్రిల్ అయ్యానంది. పలు వైవిద్యభరిత చిత్రాలను నిర్మించి విజయం సాధించిన నిర్మాత సి.వి.కుమార్ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని సలోని అంటోంది. -
సినిమా రివ్యూ: రేసుగుర్రం
ప్లస్ పాయింట్స్: అల్లు అర్జున్, 'కిక్' శ్యామ్, రవి కిషన్, బ్రహ్మానందం యాక్టింగ్ శృతి హాసన్ గ్లామర్ సాంగ్స్, కామెడీ మైనస్ పాయింట్స్: రొటీన్ కథ ఫైట్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'రేసుగుర్రం' ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. దానికి తోడుగా ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న విడుదలైన రేసుగుర్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే ముందు కథ గురించి తెలుసుకోవాల్సిందే. లక్ష్మణ్ ఉరప్ లక్కీ, రామ్ ఇద్దరూ అన్నదమ్ములు. నీతి, నిజాయితీ ఉన్న బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ రామ్, ఎప్పుడూ జల్సాగా తిరిగే లక్కీలకు క్షణం కూడా పడదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో స్పందన (శృతి హాసన్)తో లక్కీ ప్రేమలో పడతాడు. అయితే ఓ కారణంగా లక్కీ, స్పందన ప్రేమ వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు రామ్ ప్లాన్ వేస్తాడు. శృతిని తనకు దక్కకుండా చేసిన రామ్‌కు తగిన గుణపాఠం చెప్పాలని అతని పోలీస్ కారును దొంగిలిస్తాడు. లక్కీ దొంగిలించిన కారులో ఉన్నది రామ్ అనుకుని రాజకీయవేత్తగా మారిన రౌడీ మద్దాలి శివారెడ్డి వర్గం ఎటాక్ చేసి చంపాలనుకుంటాడు. ఆ దాడి నుంచి లక్కీ క్షేమంగా బయటపడుతాడు. ఆ దాడి నుంచి బయటపడిన శివారెడ్డి ఏం చేశాడు? శివారెడ్డికి రామ్ మధ్య శతృత్వానికి కారణమేంటి? లక్కీ, స్పందనల ప్రేమ వ్యవహారాన్ని రామ్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటాడు? రామ్, లక్కీల మధ్య ఉన్న మనస్పర్ధలు ఎలా తొలగిపోయాయి అనే సమస్యలకు ముంగిపే 'రేసుగుర్రం' చిత్ర కథ. పెర్ఫార్మెన్స్: అల్లు అర్జున్‌లో ఎనర్జీ లక్కీ పాత్రకు సూట్ అయింది. యాక్షన్, ఎంటర్టైన్ మెంట్, లవ్ సీన్స్‌లో నటించడం అర్జున్‌కు కొత్తేమీ కాదు. తనదైన శైలిలో లక్కీ పాత్రలో ఉండే వివిధ కోణాలకు అల్లు అర్జున్ న్యాయం చేకూర్చారు. స్పందనగా శృతి హాసన్ గత చిత్రాల్లో ఎన్నడూ లేనంతగా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. స్పందన పాత్రలో ఓ ఢిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. దాన్ని శృతి హాసన్ బాగా పండించింది. కిక్ శ్యామ్ ప్రేయసిగా సలోని గెస్ట్ గా కనిపించింది. ఈ చిత్రంలో తనకు లభించిన సీన్లలో తెలంగాణ యాసలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అంతగా గుర్తుండిపోయే పాత్రేమీ కాదు. కిక్ శ్యామ్ పోలీస్ ఆఫీసర్‌గా, అల్లు అర్జున్ అన్నగా పర్వాలేదనిపించాడు. కిక్ తర్వాత అలాంటి తరహా పాత్రనే రిపీట్ చేశాడా అనిపించింది. మెయిన్ విలన్‌గా మద్దెల శివారెడ్డి పాత్రలో భోజ్‌పూరి నటుడు రవికిషన్ నటించాడు. రౌడీగా మారిన రాజకీయవేత్తగా రవికిషన్ వీలైనంత మేరకు మంచి నటనే అందించాడు. మరోసారి బ్రహ్మనందం కామెడీతో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఓ ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ కిల్ బిల్ పాండే గా క్లైమాక్స్‌లో హంగామా చేశాడు. ప్రీ క్లైమాక్స్ ఎంటరై.. క్లైమాక్స్ వరకు చిత్ర భారాన్ని తన భుజాలపై బ్రహ్మానందం ఎత్తుకున్నాడు. చిత్రమంతా రొటీన్‌గా ఉందే అనుకునే సమయంలో మరోసారి తన ప్రతిభతో ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేశ్ తదితర కమెడియన్లు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. స్పందన తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కొన్ని సీన్లకు తనదైన స్టైల్లో ప్రకాశ్ రాజ్ న్యాయం చేశాడు. మిగతా పాత్రల్లో తనికెళ్ల భరణి, ముఖేశ్ రుషి నటించారు. టెక్నికల్: తమన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కీలక సన్నివేశాలకు మంచి సపోర్ట్ ఇచ్చింది. పాటల్లో అర్జున్ పై చిత్రీకరించిన సోలో సాంగ్... బూచోడే, 'సినిమా చూపిస్త మామా' పాటలు ఆడియో పరంగానే కాకుండా తెరపై కూడా ఆకట్టుకున్నాయి. టెక్నికల్ అంశాలు చూస్తే మనోజ్ పరమహంస కెమెరా చాలా రిచ్‌గా ఉంది. శృతి హాసన్, అల్లు అర్జున్ క్యాస్టూమ్ అదిరిపోయేలా ఉన్నాయి. కొత్త లుక్ తో డిజైన్ చేసిన క్యాస్టూమ్ శృతి, అల్లు అర్జున్ కు మరింత గ్లామర్ ను పెంచాయి. డైరెక్షన్: టేకింగ్‌లో దర్శకుడు సురేందర్ రెడ్డి టాలీవుడ్లో విలక్షణమైన శైలి అని గత చిత్రాలతో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విషయానికి వస్తే కథ కన్నా అల్లు అర్జున్‌లోని స్టైలిష్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మనందం కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. కిక్ సినిమాలో ఆలీ క్యారెక్టర్‌ను కొనసాగింపుగా ఈ చిత్రంలో ఇంట్రడ్యూస్ చేసినా సరైన స్పేస్ లేని కారణంగానో, ఇతర పరిమితుల కారణంగానో బెడిసి కొట్టింది. ముఖేశ్ రుషి, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ క్యారెక్టర్లను సరైన దృష్టి పెట్టకుండా వదిలేశాడనే ఓ చిన్న ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ కథ, కొత్తదనం లేని విలనిజంతో చేసిన సాహసం అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వకపోయినా.. క్లైమాక్స్‌లో బ్రహ్మానందాన్ని తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు. బ్రహ్మనందం ఎపిసోడ్ నడిపించిన తీరు గ్రిప్పింగ్ గా ఉంది. ఈ చిత్రంలోని 'రేసుగుర్రం' అర్జున్ ఎనర్జీని బ్రహ్మానందానికి ఇచ్చేసి రొటీన్‌కు భిన్నంగా కొత్త ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు. సెకంఢాఫ్ లో కథపై కొంత ఎక్సర్ సైజ్ చేసి ఉంటే మంచి ఫలితాలన్ని రాబట్టే అవకాశం ఉండేది. మార్కెట్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పై దృష్టి సారిస్తున్నారనే ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మాస్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను జోడించి రేసుగుర్రాన్ని పరిగెత్తించిన సురేందర్ రెడ్డి... వినోదాన్ని ఆశించిన ప్రేక్షకుల్లో సంతృప్తి నింపి.. కొత్తదనం ఆశించిన వారిని కొంచెం నిరాశకు గురి చేశాడు. ట్యాగ్: బ్రహ్మీ బలంతో పరుగెత్తిన రేసుగుర్రం