‘మిస్టర్ రావణ’గా మిస్టర్ వరల్డ్‌ | Anup Thakur Singh, Saloni Starrer Mister Ravana Movie Launch | Sakshi
Sakshi News home page

‘మిస్టర్ రావణ’గా మిస్టర్ వరల్డ్‌

Published Sat, Aug 31 2019 4:37 PM | Last Updated on Sat, Aug 31 2019 4:37 PM

Anup Thakur Singh, Saloni Starrer Mister Ravana Movie Launch - Sakshi

సింగం 3, రోగ్‌ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అయిన అనుపూ థాకూర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ రావణ. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవల ముంబైలోని ప్రపంచ ప్రసిద్దమైన శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రారంభమైంది. ‌కుందన ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా అనూప్ సింగ్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్, నా క్యారక్టరైజేషన్‌ను చాలా బాగా డిజైన్ చేశారు. ‌నటుడుగా నా కెరీర్‌లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందన్నారు. సలోని మాట్లాడుతూ.. రియలిస్టిక్ కథాశంతో ఈ సినిమా ఉంటుంది. నా పాత్ర వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు. 

దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ... ‘అనూప్ సింగ్ విలన్‌గా మనకు సుపరిచితుడే.‌ ఈ సినిమాలో కూడా ఆయన టైటిల్ పాత్రలో నట విశ్వరూపాన్ని చూపిస్తారు.‌ సలోని హీరోయిన్‌గా మంచి పాత్రలో కనిపిస్తారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది అన్నారు.‌ నిర్మాత కుందన్ రాజ్ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్ తో నాలుగు భాషల్లో ఈ సినిమా తెరమీదకు రానుంది. అన్నీ భాషల నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement