హారర్‌ చిత్రంతో సలోని రీఎంట్రీ | Saloni Plays Key Role In 'Tantra' Movie - Sakshi
Sakshi News home page

Tantra Movie: హారర్‌ చిత్రంతో సలోని రీఎంట్రీ.. భయపెడుతోందిగా?

Published Thu, Aug 24 2023 4:00 PM | Last Updated on Thu, Aug 24 2023 4:08 PM

Saloni Play Key Role In Tantra Movie - Sakshi

హీరోయిన్‌ సలోని గుర్తుందా..? అదేనండి ‘మర్యాద రామన్న’లో హీరో సునీల్‌ సరసన నటించి, తనదైన అందంతో ఆకట్టుకుంది. ఈ ఒక్క చిత్రంతో సలోనికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘బాడీగార్డ్‌’చిత్రంతో పాటు పలు సినిమల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో నటించి మెప్పించింది. చివరగా రేసుగుర్రం చిత్రంలో అతిథి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.. తెలుగు సినిమాలకు కొంత గ్యాప్‌ ఇచ్చింది.

చాలా కాలం తర్వాత ‘తంత్ర’ చిత్రంతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వైజాగ్  ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ‘మగధీర’లో షేర్‌ఖాన్‌ లాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన  దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. 

ఈ మేరకు దర్శనిర్మాతలు మాట్లాడుతూ  ‘‘ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాఽథల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా స?గుతుంది. తంత్ర శాస్ర్తానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలను ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాం. ఇందులో అనన్య నాగళ్లతోపాటు ‘మర్యాదరామన్న’ ఫేం సలోని కీ రోల్‌ పోషిస్తున్నారు. గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌ రోల్‌తోపాటు గ్లామర్‌ పాత్రలతోనూ మెప్పించిన సలోని ఇందులో డిఫరెంట్‌గా కనిపిస్తారు. నటనకు ఆస్కారమున్న పాత్ర అది. ఇటీవల అనన్యా, సలోని, హీరోపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అవుట్‌పుట్‌బాగా వచ్చింది. ఈ చిత్రం టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకురావడంతోపాటు సలోనికి మంచి కమ్‌బ్యాక్‌ అవుతుంది’’ అని తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement