'ఆ తెలుగు హీరో నా మొదటి క్రష్'.. యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల..! | Tollywood Actress Ananya Nagalla Open About Her Crush On Young Hero | Sakshi
Sakshi News home page

Ananya Nagalla: 'ఆ టాలీవుడ్ హీరో అంటే క్రష్'.. క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య కామెంట్స్ వైరల్!

Published Thu, Mar 7 2024 5:17 PM | Last Updated on Thu, Mar 7 2024 6:08 PM

Tollywood Actress Ananya Nagalla Open About Her Crush On Young Hero - Sakshi

2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత  పవన్​ కల్యాణ్​ చిత్రం 'వకీల్​ సాబ్'​తో మరింత ఫేమస్​ అయింది. గతేడాది సమంత లీడ్​ రోల్​ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది.

ప్రస్తుతం అనన్య ప్రధాన పాత్రలో వస్తోన్న హారర్ మూవీ తంత్ర. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య తన కెరీర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. అంతే కాదు టాలీవుడ్‌ యంగ్ హీరో అంటే క్రష్ అని ఓపెన్ అయింది ముద్దుగుమ్మ. ఆ వివరాలేంటో చూద్దాం. 

(ఇది చదవండి: అనన్య నాగళ్ల కొత్త మూవీ.. సాంగ్ రిలీజ్‌ చేసిన మంగళవారం బ్యూటీ!)

అనన్య మాట్లాడుతూ.. 'తనకు కాబోయేవాడు నిజాయితీగా ఉంటే చాలు. అలాంటి వాడైతే ఓకే. సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నా. ఇండస్ట్రీ వాళ్లయితే కొంచెం కష్టం. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావొచ్చు. సినిమా వాళ్లకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో నా ఫస్ట్ క్రష్ నాగశౌర్య. నా చిన్నప్పుడు అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్‌ను అంటే చాలా ఇష్టం. వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగా. నాకు ఇంతవరకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఇండస్ట్రీ వాళ్లను చూస్తే కమిట్ అయి ఉంటారని అనుకుంటారు. కానీ నేను మాత్రం కమిటేడ్ కాదు. అంతేకాదు నాకు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురవ్వలేదు ' అని ‍అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement