Ananya Nagalla First Look Poster From Her Latest Movie Tantra Poster Released Today, Deets Inside - Sakshi
Sakshi News home page

Ananya Nagalla Tantra First Look: అనన్య నాగళ్ల 'తంత్ర'.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్!

Published Fri, Aug 4 2023 4:44 PM | Last Updated on Fri, Aug 4 2023 7:00 PM

Ananya Nagalla Latest Movie Tantra Poster Released Today - Sakshi

'మల్లేశం', 'వకీల్‌సాబ్‌' చిత్రాల ఫేం అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘తంత్ర’. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను మేకర్ రిలీజ్ చేశారు. అతి భయంకరమైన క్షుద్రశక్తులు.. అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది. అనన్య నాగళ్ల పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పోస్టర్‌ విడుదల చేసింది. టాలీవుడ్ స్టార్‌, దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. మరో కీలక పాత్రలో ‘మర్యాదరామన్న’ ఫేం సలోని ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. 

(ఇది చదవండి: ప్రియుడితో ఎంగేజ్‍మెంట్‌ చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు!)

మన తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న హారర్‌ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.  తాంత్రిక శాస్త్రం, పురాణగాధల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో టెంపర్‌ వంశీ, మీసాల లక్ష్మణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతమందిస్తున్నారు. 

(ఇది చదవండి: నంది అవార్డ్స్ వివాదం.. ఆయన మధ్యలోకి ఎంటర్ కావడంతో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement