స్కూల్లో ఉన్నప్పుడే ఆ టాలీవుడ్ హీరో అంటే క్రష్: అనన్య నాగళ్ల | Ananya Nagalla Interesting Comments About Her Crush On Tollywood Hero | Sakshi
Sakshi News home page

Ananya Nagalla: 'ఆ టాలీవుడ్‌ హీరోతో ఛాన్స్‌.. ఎగిరి గంతేస్తా'

Published Mon, Jul 22 2024 7:50 PM | Last Updated on Mon, Jul 22 2024 8:26 PM

Ananya Nagalla Interesting Comments About Her Crush On Tollywood Hero

2019లో విడుదలైన ' మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత  పవన్​ కల్యాణ్​ చిత్రం వకీల్​ సాబ్ మూవీ​తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సమంత నటించిన శాకుంతలం చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది.  తాజాగా ప్రియదర్శి నటించిన డార్లింగ్ చిత్రంలో మెరిసింది ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య.. టాలీవుడ్‌ హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ప్రభాస్‌తో నటించే ఛాన్స్ వస్తే ఎలాంటి క్యారెక్టర్‌ చేస్తారు? ‍అన్న ప్రశ్నకు అనన్య నాగళ్ల స్పందించింది. ఆయనతో నటించే అవకాశం వస్తే.. ఏ క్యారెక్టర్ అయినా ఎగిరి గంతేసి చేస్తానని చెప్పింది. ప్రభాస్ నటించిన వర్షం సినిమా చూసినప్పటి నుంచి ఆయనంటే క్రష్‌. ఆ సమయంలో నేను స్కూల్లోనే చదువుతున్నా. ఆ సినిమాను నేను థియేటర్లో చూడలేదు. టీవీల్లో వచ్చినప్పుడు నేను, మా ఫ్రెండ్‌ కలిసి వర్షం సినిమా చూశామని అనన్య నాగళ్ల నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఏడాదిలో తంత్ర మూవీతో డిఫరెంట్‌ రోల్‌లో అనన్య నాగళ్ల మెప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement