![Ananya Nagalla U Turn About Bold Scene - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/29/Ananya-Nagalla.jpg.webp?itok=mOCTixYi)
మల్లేశం మూవీతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది అనన్య నాగళ్ల. ఒక్క సినిమాతోనే పేరు తెచ్చుకున్న ఈ సుందరాంగి వరుస అవకాశాలు అందుకుంది. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మాస్ట్రో, మళ్లీ పెళ్లి.. ఇలా అనేక సినిమాలు చేసింది. అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈసారి తంత్ర అనే హారర్ మూవీతో భయపెట్టేందుకు రెడీ అయింది. ఈ సినిమాతో పాటు పొట్టేల్ అనే మూవీ కూడా పూర్తి చేసింది. ఇది రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇకపోతే బోల్డ్ సన్నివేశాలకు తాను దూరమని చెప్పిన అనన్య పొట్టేలు చిత్రంలో మాత్రం హద్దులు చెరిపేసి యాక్ట్ చేసింది.
సినిమాకు అవసరం, అందుకే..
తంత్ర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనన్యకు 'పొట్టేల్'లోని ముద్దు సన్నివేశం గురించి ప్రశ్న ఎదురైంది. అలాంటి సన్నివేశాలు తంత్రలో కూడా ఉంటాయా? అని ఓ విలేఖరి ప్రశ్నించాడు. ఇందుకు అనన్య స్పందిస్తూ.. 'ముద్దు సన్నివేశమనేది ఆ సినిమాకు చాలా అవసరం. అందుకని చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో గ్లామర్, రొమాంటిక్ సీన్స్, హారర్.. అన్నీ ఉన్నాయి.
అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది
ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనిషి ఆలోచనల్లో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పు లేకపోతే మన ఎదుగుదల ఆగిపోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నేను ఎలా ఉన్నా మంచి రోల్స్ నా దగ్గరకు వస్తాయనుకున్నాను. పర్ఫామెన్స్ చేస్తే చాలనుకున్నాను. కానీ.. పర్ఫామెన్స్‌లో ఈ తరహా రోల్స్ కూడా భాగమేనని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది' అని చెప్పుకొచ్చింది. అంటే కథ డిమాండ్ చేస్తే ఎటువంటి బోల్డ్ సీన్స్ చేయడానికైనా రెడీ అని చెప్పకనే చెప్పింది అనన్య.
చదవండి: 'అవును.. ఊహించిందే జరిగింది'.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన దీపికా పదుకొణె!
Comments
Please login to add a commentAdd a comment