వేణుస్వామిని కలిసిన అనన్య నాగళ్ల.. కారణం ఇదేనా? | Ananya Nagalla Meet To Venu Swamy | Sakshi
Sakshi News home page

వేణుస్వామిని కలిసిన అనన్య నాగళ్ల.. కారణం ఇదేనా?

Published Tue, Mar 12 2024 4:11 PM | Last Updated on Tue, Mar 12 2024 4:53 PM

Ananya Nagalla Meet To Venu Swamy - Sakshi

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ప్రముఖ జ్యోతిష్కుడిగా వేణుస్వామికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ, సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన చెప్పిన వాటిలో ఎక్కువ శాతం జరుగుతాయని కొందరు అభిప్రాయం. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య నాగళ్ల కూడా వేణుస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. వకీల్‌ సాబ్‌ చిత్రం ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర' అనే హారర్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించాయి. మార్చి 15న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.  ఇలాంటి సమయంలో అనన్య కూడా వేణుస్వామిని కలవడం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఆయనతో పాటుగా దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. గత కొన్నేళ్లుగా వేణు స్వామి ద్వారా పూజలు చేపించుకున్న హీరోయిన్ల లిస్ట్‌ చాలా ఎక్కువగానే ఉంది.  ర‌ష్మిక మంద‌న్న, నిధి అగ‌ర్వాల్, డింపుల్ హయాతి, అషురెడ్డి  వంటి వారు వేణు స్వామితో పూజలు చేపించారు.

ప్రస్తుతం అనన్య నాగళ్ల కూడా ఆయన్ను కలవడంతో ఆమె కూడా ఏమైనా పూజలు చేపించారా అని పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ త్వరలో తను నటించిన తంత్ర సినిమా విజయవంతం కావాలని ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు ఏమైనా వెళ్లారా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. రీసెంట్‌గా హీరోయిన్‌ డింపుల్‌ హయాతితో మరోసారి వేణు స్వామి పూజలు జరిపించారు. మద్యం సీసాలు ఉంచి  పూజలో పాల్గొన్నారు. ఆ ఫోటోలు కూడా భారీగా నెట్టింట వైరల్‌ అయ్యాయి. తాను చేసే వామచార పూజలు, బాగాలమ్మకు,రాజ శ్యామల, తార, చిన్నమస్త.. ఇలా ప్రతి పూజకు లిక్కరే వాడతానని బహిరంగంగా చెప్పినట్లు బయట కథనాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement