'తంత్ర'.. పిల్ల‌బ‌చ్చాలు ఈ సినిమాకు రావ‌ద్దు! | Ananya Nagalla's 'Tantra' Movie Release Date Poster Out | Sakshi
Sakshi News home page

Ananya Nagalla: అన‌న్య నాగ‌ళ్ల హార‌ర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Feb 23 2024 3:21 PM | Updated on Feb 23 2024 3:31 PM

Ananya Nagalla Tantra Movie Release Date Poster Out - Sakshi

హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా చూపించారు. అనన్య నాగళ్లకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధ

హీరోయిన్ అన‌న్య నాగ‌ళ్ల ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హార‌ర్ మూవీ తంత్ర‌. ఈ సినిమాకు సెన్సార్‌వాళ్లు A సర్టిఫికేట్ ఇవ్వ‌డంతో 'తంత్ర' టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయింది. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ 'A' ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిం. నిజానికి ఇదొక  సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ. త‌మ సినిమా క‌చ్చితంగా భ‌య‌పెడుతుంద‌న్న న‌మ్మ‌కమున్న మేక‌ర్స్‌ తమ సినిమాకి చిన్నపిల్లలు రావొద్దని వారిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌లో హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా చూపించారు. అనన్య నాగళ్లకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి న‌టించాడు. మర్యాద రామన్న ఫేం సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ముఖ్య‌పాత్ర‌లు పోషించారు.

శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గోపిశెట్టి.. వాల్ట్‌డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగి, సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని 'తంత్ర 'తో సాధించాడు. ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు నరేష్ బాబు, రవిచైతన్య పేర్కొన్నారు.

చ‌ద‌వండి: ష‌ణ్ముఖ్ అన్న‌ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement