టక్కరి దొంగ..  చక్కని చుక్క | Super Star Krishna's Film Title For Sampoornesh Babu | Sakshi
Sakshi News home page

టక్కరి దొంగ..  చక్కని చుక్క

Published Wed, Jul 4 2018 12:16 AM | Last Updated on Wed, Jul 4 2018 12:16 AM

Super Star Krishna's Film Title For Sampoornesh Babu - Sakshi

‘హృదయ కాలేయం’ ఫేమ్‌ సంపూర్ణేశ్‌ బాబు హీరోగా ‘టక్కరి దొంగ.. చక్కనిచుక్క’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. అలీ కథానాయకుడిగా ‘అల్లరి పెళ్లికొడుకు’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జె.జె.ప్రకాష్‌ రావు, నిర్మాత ఎం.రాజ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో ఆర్‌.కె. ఫిలిం ఫ్యాక్టరీస్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.

‘మర్యాద రామన్న’ ఫేమ్‌ సలోని కథానాయికగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రకాష్‌ రావు, నిర్మాత ఎం.రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ –‘‘లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. స్క్రిప్ట్‌ బాలా బాగా వచ్చింది. ఈ చిత్రంలో నాలుగు ఫైట్లు, ఆరు పాటలు ఉంటాయి. ఈ నెల రెండో వారంలో షూటింగ్‌ ప్రారంభమవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమెరా: పైడాల శ్రీనివాస్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement