హాస్య నటులు కూడా హీరోలే | The hero of the comic actors | Sakshi
Sakshi News home page

హాస్య నటులు కూడా హీరోలే

Published Thu, Dec 15 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

హాస్య నటులు కూడా హీరోలే

హాస్య నటులు కూడా హీరోలే

‘‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అదే ఐడియా నలుగురు ప్రేమికుల జీవితాన్ని ఎలా మార్చిందన్నదే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కథ’’ అన్నారు కథానాయిక సలోని. నవీన్‌చంద్ర, శ్రుతీ శోధి, పృధ్వీ, సలోని ముఖ్య పాత్రల్లో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సలోని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

లవ్, రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో మహేశ్‌ పాత్రలో ‘థర్టీ ఇయర్స్‌’ పృధ్వీ, సమంత పాత్రలో నేను ఇంటర్మీడియట్‌ విద్యార్థులుగా కనిపిస్తాం. మా ఇద్దరి మధ్య వచ్చే పాటకు సెట్స్‌లో క్లాప్స్, విజిల్స్‌ కొట్టారు.

కామెడీ సీన్స్‌ చేయడం చాలా కష్టం.నా దృష్టిలో హాస్య నటులు కూడా హీరోలే. నా మనసుకు నచ్చితే ఎవరితోనైనా నటిస్తా. నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రా వదులుకోను. ఈ చిత్రదర్శకుడు సత్తిబాబు కూల్‌ పర్సన్‌. తనకు కావాల్సిన నటన రాబట్టుకున్నారు.
రాధామోహన్‌ గారు మంచి టేస్ట్‌ ఉన్న నిర్మాత.

హిందీలో అమితాబ్‌ బచ్చన్‌గారితో ఓ చిత్రం డిస్కషన్స్‌లో ఉంది. కొన్ని తెలుగు, తమిళ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement