హిందీ, యోగా అంటే జపనీయులకు మక్కువ పెరుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
టోక్యో: హిందీ, యోగా అంటే జపనీయులకు మక్కువ పెరుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ మంగళవారం జపాన్-ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసిన వ్యాపారవేత్తల సమావేశంలో ప్రసంగించారు.
భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, విశ్వ భాగస్వాములుగా పనిచేస్తున్నాయని మోడీ చెప్పారు. ఇరు దేశాల మధ్య మాటలకందని ఆధ్యాత్మిక సంబంధముందని పేర్కొన్నారు. హిందీ, యోగాలపై జపాన్ వాసులకు రోజురోజుకు ఆసక్తి పెరుగుతోందని మోడీ అన్నారు.