
భోపాల్: వేసవికాలం వచ్చిందటే మనకు ముఖ్యంగా గుర్తుకు వచ్చేవి రెండే రెండు ..ఒకటి మండే ఎండలు..రెండోది మామిడి పండ్లు... మమాలుగా సీజన్ ఉన్నప్పుడు ఒక కేజీ మామిడి పండ్ల రేటు ఎంత ఉంటుంది.. మహా అయితే రూ. 50, అసలు మామిడి పండ్ల దిగుబడి మరి తక్కువగా ఉన్నప్పుడు రూ. 100-150 వరకు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జబల్‌పూర్ వాసి పండించిన మామిడి పండ్లు ఒక కేజీ ఏకంగా రూ. 2 లక్షల 70వేలు. ఏంటి షాక్ గురవుతున్నారా..! కేజీ మామిడి పండ్లు మరి ఇంతా ధర ఉంటాయాని విస్తుపోతున్నారా.. అవును మీరు చూసింది నిజమే..! ఒక కేజీ మామిడి పండ్ల ధర అక్షరాల రెండు లక్షల డెభైవేలు. ఈ మామిడి పండ్లు ప్రపంచంలోనే చాలా అరుదైనవి.
జబల్‌పూర్‌కు చెందిన పరిహర్ ఈ మామిడి పండ్లను పండిస్తున్నాడు. ఈ పండ్లు జపాన్‌కు చెందిన మియాజాకి అనే అరుదైన మామిడి వంగడం. పరిహర్ చెన్నై వెళ్తున్న సమయంలో రైలులో ఉన్న వ్యక్తి తనకు ఈ మామిడి మొక్కను ఇచ్చాడని తెలిపాడు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధర పలికే జపనీస్ మియాజాకి మామిడి వంగడమని అతనికి తెలియదు. ప్రస్తుతం ఈ చెట్టుకు కాసిన ఏడు మామిడి పండ్లను కాపాడటం కోసం ఏకంగా నలుగురు కాపల సిబ్బందిని, ఆరు కుక్కలను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఒక వ్యాపారవేత్త ఒక మామిడి పండు కోసం ఏకంగా రూ. 21 వేలను వెచ్చించి తీసుకున్నాడు.
చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్ గుర్తించి, ఏకంగా 22 లక్షలు దక్కించుకున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment