guards
-
వలంటీర్లే ‘రక్షణ’ కవచాలు
సాక్షి అమలాపురం: తమ వ్యవస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సేవలతోనే వలంటీర్లు బదులిస్తున్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి ఏటిగట్లు తెంచుకుని ఊళ్లపై పడిపోకుండా తీసుకునే రక్షణ చర్యల్లో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏటిగట్లను రేయింబవళ్లు పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా నిలుస్తున్నారు. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నపుడు ఏటిగట్ల రక్షణ చాలా ముఖ్యం. ఆ ఏటిగట్లకు గండ్లు పడి ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించిన సందర్భాలు గోదావరి జిల్లాల్లో గతంలో ఎన్నో ఉన్నాయి. వరదల సమయంలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 534.73 కి.మీల పొడవునా ఉన్న ఏటిగట్ల పరిరక్షణ గతంలో ప్రభుత్వ యంత్రాంగానికి తలకుమించిన భారంగా ఉండేది. తక్కువ మంది సిబ్బంది ఉండటంతో ఇంత పొడవున ఏటిగట్లను పర్యవేక్షించడం సాధ్యం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వందలాది మంది వలంటీర్లు ఏటిగట్లను పర్యవేక్షిస్తూ పైఅధికారులకు నిరంతరం సమాచారం అందిస్తున్నారు. సమాచారం తక్షణం చేరవేత గత ఏడాది భారీ వరదలకు రాజోలులోని నున్నవారిబాడవ వద్ద గట్టు దాటి నీరు ప్రవహిస్తున్న విషయాన్ని తొలిసారిగా గుర్తించింది వలంటీర్లే. వారిచ్చిన సమాచారంతో అధికారులు వేగంగా రక్షణ చర్యలు చేపట్టడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది కూడా ఏటిగట్ల పర్యవేక్షణ బాధ్యతలను 740 మంది వలంటీర్లకు అప్పగించారు. ప్రతి అర కిలో మీటర్‌కు ఒక వలంటీర్‌ను నియమించారు. వీరు ఏటిగట్ల వద్ద రేయింబవళ్లు కాపలాగా ఉంటూ వరద ఉద్ధృతి, గట్ల పటిష్టతకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం పైఅధికారులకు అందిస్తున్నారు. ముంపు గ్రామాల్లో సేవలు ఏటిగట్ల పర్యవేక్షణ ఒక్కటే కాకుండా వరద ముంపుబారిన పడిన లంక గ్రామాల్లో వలంటీర్లు పలు రకాల సేవలందిస్తున్నారు. ముంపు బాధితులను గుర్తించి, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో సహాయపడుతున్నారు. వారికి భోజన సదుపాయల కల్పన, నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో చొరవ చూపుతున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, ముమ్మిడివరం, అయినవిల్లి వంటి వరద ప్రభావం అధికంగా ఉన్న మండలాల్లోని లంక గ్రామాల్లో వీరు చురుగ్గా సేవలందిస్తున్నారు. కష్టసమయంలో ఆసరాగా నిలబడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. నాడు తక్కువగా సిబ్బంది గతంలో గోదావరి వరద సమయంలో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తరువాత ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సహాయంగా ఉండేవారు. ఒక హెడ్‌వర్క్స్ ఏఈ తన పరిధిలో సుమారు 10 నుంచి 15 కి.మీ.ల పొడవున ఏటిగట్టు బాధ్యత చూసేవారు. వీరికి లష్కర్లు సహాయం అందించేవారు. ఇరిగేషన్ శాఖలో కొన్నేళ్లుగా లష్కర్ల కొరత ఉంది. అప్పట్లో ఏటిగట్లకు కన్నాలు పడినా, కుంగిపోయినా, గండ్లు పడే అత్యవసర సమయాల్లో సమాచారం ఉన్నతాధికారులకు చేరడంలో ఆలస్యమయ్యేది. ఈ కారణంగానే 2006 గోదావరి వరదలకు అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద ఏటిగట్లకు గండ్లు పడి స్థానికులు పెద్దఎత్తున నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. నిరంతరం అప్రమత్తంగా.. గోదావరి ఏటిగట్ల వద్ద వలంటీర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వారి పరిధిలోని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. గతేడాది వారిచ్చిన సమాచారంతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఏడాది కూడా వారు పర్యవేక్షణ పనిలో నిమగ్నమయ్యారు. – పువ్వాడ విజయ్ థామస్, డీడీవో, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇటీవల కుమ్రంభీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై ఓ ప్రజాప్రతినిధి సోదరుడి ఆధ్వర్యంలో దాడి. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలో పోడు భూముల సాగును అడ్డుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్‌పై దాడి. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కరరావులపై కర్రలతో దాడి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఎర్రబోరు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దారుణ హత్య. తెలంగాణ రాష్ట్రంలో అడవుల సంరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై పగ పెంచుకున్న గొత్తికోయలు మంగళవారం ఆయనపై దాడి చేసి హత్య చేసిన నేపథ్యంలో.. ‘అటవీ సిబ్బందికి ఆయుధాలు’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అడవుల సంరక్షణ కోసం విధులు నిర్వహించే అటవీశాఖ సిబ్బందికి మళ్లీ ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తాజాగా శ్రీనివాసరావు హత్యతో చలించిన ఎఫ్ఆర్ఓల సంఘం నాయకులు ఆ యుధాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అర్హులైన గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ’కార్య క్రమం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో 28 ఏళ్ల కిందట అటవీ, ఆబ్కారీ శాఖలకు చెందిన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆయుధాలు, వైర్లెస్ సెట్ల కోసం మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత పదేళ్లుగా రెండు శాఖల అధికారులు, సిబ్బందికి స్మగ్లర్లు, అక్రమార్కుల ఆగడాలు, పోడు భూముల సాగు నియంత్రణ సమస్యగా మారింది. 2013 సెప్టెంబర్ 15న నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పెంబిలో అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు 11 మంది సిబ్బందితో వెళ్లిన ఎఫ్ఆర్ఓ గంగయ్య (42)పై.. అక్కడున్న జనం గొడ్డళ్లతో దాడి చేసి చంపేశారు. మరో ఏడుగురిని గాయపరిచారు. అప్పుడున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పటి అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్ఎన్ రెడ్డితో ఆయుధాల అప్పగింతపై చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా అనేక దాడులు జరగ్గా.. దాడులు జరిగినప్పుడు ఆయుధాల విషయం చర్చించడం ఆ తర్వాత మరిచిపోవడం ఓ తంతుగా మారింది. ‘పోడు’నేపథ్యంలో పెరుగుతున్న దాడులు ఒక వైపు అర్హులైన గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుండగా.. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల్లో పోడు కోసం అడవులు నరుకుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరుగుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12.46 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కుల కల్పనకు సంబంధించి గిరిజనుల నుంచి 4,14,219 దరఖాస్తులు రాగా.. అందులో 10.36 లక్షల ఎకరాలకు సంబంధించిన 3.59 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. భద్రాద్రి నుంచి 2,99,478 ఎకరాలపై 305 గ్రామాల నుంచి 83,663 అర్జీలు ఉన్నట్లు వరంగల్ సీసీఎఫ్ ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలో ఎఫ్ఆర్ఓ హత్యకు పోడు భూముల సర్వే నేపథ్యం కూడా ఉండటంతో..ఈ అంశం భవిష్యత్తులో సర్వే ప్రక్రియకు అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ ఆయుధాలు ఇస్తేనే పోడు భూముల సర్వే అడవుల సంరక్షణ కోసం పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బంది ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్‌రావు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హ్యత నేపథ్యంలో ఎఫ్ఆర్ఓల సంఘం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. మా ప్రాణాలకు రక్షణ కల్పించకుండా పోడు భూముల సర్వేకు వెళ్లేది లేదు. ఆయుధాలు ఇవ్వాలని, మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని మా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. – షౌకత్ అలీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం -
మా ప్రజలు హింసకు గురవుతుంటే అలా వదిలేయ లేం: రాహుల్ గాంధీ
Indians Stuck In Ukraine: ఉక్రెయిన్ సంక్షోభంపై ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. తరలింపు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించడమే కాక ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిపై విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా ప్రధానమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు తరలింపు ప్రయత్నాల మధ్య సుమారు 2 వేల మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చినట్లు కూడా ప్రభుత్వం ఆదివారం తెలిపింది. అయితే ఇంకా కొంతమంది విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద చిక్కుకుపోయారు. అంతేకాదు ఆ సరిహద్దు వద్ద ఉన్న గార్డులు భారతీయ విద్యార్థులను హింసకు గురిచేస్తున్నారు. అమ్మాయిలని కనికరం కూడా లేకుండా దారుణంగా కొడుతున్నారు. కొంతమంది విద్యార్థులను సరిహద్దుల నుంచి నెట్టివేయడంతో అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగానూ, గందరగోళంగానూ ఉంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆయన అక్కడ పరిస్థితిపై ఆందోళన చెందుతూ దయచేసి ప్రభుత్వం త్వరితగతిన భారతీయ విద్యార్థులను తరలించాలని కోరారు. హింసకు గురువుతున్న భారతీయ విద్యార్థులు వారి కుటుంబాలను చూస్తుంటే హృదయం విలవిలాడిపోతుందని అన్నారు. అంతేకాదు తరలింపు చర్యలు మరింత ముమ్మరంగా సాగించాలని ప్రభుత్వానికి విజ్క్షప్తి చేశారు. నివేదికల ప్రకారం విద్యార్థులు పోలాండ్ దాటడానికి ప్రయత్నించినప్పుడు వేధింపులకు గురవుత్ను వీడియో అని తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, కేంద్ర ప్రభుత్వం గత వారం హంగరీ, పోలాండ్, రొమేనియ, స్లోవేకియా రిపబ్లిక్ సహాయంతో ప్రత్యామ్నాయ తరలింపు ప్రణాళికలను రూపొందించింది. పైగా సంబంధిత అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవద్దని ప్రభుత్వం ఒక ప్రకటనలో విద్యార్థులకు తెలిపింది కూడా. My heart goes out to the Indian students suffering such violence and their family watching these videos. No parent should go through this. GOI must urgently share the detailed evacuation plan with those stranded as well as their families. We can’t abandon our own people. pic.twitter.com/MVzOPWIm8D — Rahul Gandhi (@RahulGandhi) February 28, 2022 (చదవండి: యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి) -
7 మామిడి పండ్లకు నలుగురు బాడీగార్డ్స్.. ఎందుకో తెలుసా!
భోపాల్: వేసవికాలం వచ్చిందటే మనకు ముఖ్యంగా గుర్తుకు వచ్చేవి రెండే రెండు ..ఒకటి మండే ఎండలు..రెండోది మామిడి పండ్లు... మమాలుగా సీజన్ ఉన్నప్పుడు ఒక కేజీ మామిడి పండ్ల రేటు ఎంత ఉంటుంది.. మహా అయితే రూ. 50, అసలు మామిడి పండ్ల దిగుబడి మరి తక్కువగా ఉన్నప్పుడు రూ. 100-150 వరకు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జబల్పూర్ వాసి పండించిన మామిడి పండ్లు ఒక కేజీ ఏకంగా రూ. 2 లక్షల 70వేలు. ఏంటి షాక్ గురవుతున్నారా..! కేజీ మామిడి పండ్లు మరి ఇంతా ధర ఉంటాయాని విస్తుపోతున్నారా.. అవును మీరు చూసింది నిజమే..! ఒక కేజీ మామిడి పండ్ల ధర అక్షరాల రెండు లక్షల డెభైవేలు. ఈ మామిడి పండ్లు ప్రపంచంలోనే చాలా అరుదైనవి. జబల్పూర్కు చెందిన పరిహర్ ఈ మామిడి పండ్లను పండిస్తున్నాడు. ఈ పండ్లు జపాన్‌కు చెందిన మియాజాకి అనే అరుదైన మామిడి వంగడం. పరిహర్ చెన్నై వెళ్తున్న సమయంలో రైలులో ఉన్న వ్యక్తి తనకు ఈ మామిడి మొక్కను ఇచ్చాడని తెలిపాడు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధర పలికే జపనీస్ మియాజాకి మామిడి వంగడమని అతనికి తెలియదు. ప్రస్తుతం ఈ చెట్టుకు కాసిన ఏడు మామిడి పండ్లను కాపాడటం కోసం ఏకంగా నలుగురు కాపల సిబ్బందిని, ఆరు కుక్కలను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఒక వ్యాపారవేత్త ఒక మామిడి పండు కోసం ఏకంగా రూ. 21 వేలను వెచ్చించి తీసుకున్నాడు. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్ గుర్తించి, ఏకంగా 22 లక్షలు దక్కించుకున్నాడు! -
దొంగలో కరుణ
ఓ రోజు ఓ ధనవంతుడు ఓ అడవిగుండా పోతున్నాడు. ఉన్నట్టుండి ముగ్గురు దొంగలు ఆయనను చుట్టుముట్టి బెదిరించారు. ఆయన దగ్గరున్నదంతా దోచుకున్నారు.వారిలో ఒకడు ‘‘ఇతని దగ్గరున్నదంతా దోచేసుకున్నాం. కనుక ఇతనుండి లాభమేంటీ... ఇతనుంటే మనకు ప్రమాదం కూడా. చంపేస్తేనే మనం బయటపడగలం’’ అని ఆవేశంగా అన్నాడు. ఆ మాటలతో ఆగలేదు. తన దగ్గరున్న కత్తిని తీసి అతనిపై దాడికి దిగాడు.ఇంతలో రెండో దొంగ అడ్డుపడి ‘‘అతనిని చంపడం వల్ల మనకేమీ లాభం లేదు... అతణ్ణి కట్టిపడేసి ఇక్కడే వదిలేద్దాం. తనపై జరిగిన దాడి గురించి రక్షక భటులకు చెప్పలేడు’’ అన్నాడు.ఈ మాటేదో బాగానే ఉందనుకుని దొంగలు అతన్ని తాళ్ళతో కట్టి నడి అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు.కాసేపటి తర్వాత మూడోదొంగ ఒక్కడూ అతని దగ్గరకు వచ్చాడు. ‘‘నిన్ను మా వాళ్ళు బాగా వేధించారు కదూ. కొట్టారు. గాయపరిచారు కదూ... క్షమించు... నాకు నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నేను నిన్ను విడిచిపెడతాను...’’ అంటూ అతని కట్లు విప్పి అతన్ని విడిచిపెట్టాడు. అంతేకాదు, అడవి నుంచి అతన్ని తనతోపాటు బయటకు తీసుకువచ్చాడు. ‘‘నావెంటే రా... నువ్వు ఏ అవాంతరం లేకుండా సులభంగా మీ ఇంటికి చేరుకోగలవు...’’ అన్నాడు.దొంగ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు చెప్తూ ‘‘నువ్వు నాతోపాటు మా ఇంటికి రావాలి... ఎందుకంటే నువ్వు నాకెంతో సహాయం చేశావు. నీలోనూ ఎంతో కొంత మానవత్వం ఉంది. అది నాకెంతో ఆనందంగా ఉంది. నువ్వు మా ఇంటికి వస్తే మా కుటుంబసభ్యులను పరిచయం చేస్తాను. నన్ను కాపాడింది నువ్వేనని వారికి చెప్తాను, వారెంతో సంతోషిస్తారు...’’ అన్నాడు.కానీ దొంగ తనను క్షమించమని, తాను వాళ్ళింటికి రాలేనని, అక్కడికి వచ్చినట్లు తెలిస్తే తనను రక్షకభటులు బంధించి కారాగారంలో పెడతారంటూ ఆ ధనవంతుడికి దారి చూపించి వెళ్ళిపోయాడు.మొదటి ఇద్దరు దొంగలకన్నా అతను మేలు. అతనను దొంగే అయినప్పటికీ అతనిలో మిగిలిన ఇద్దరిలోనూ లేని మంచి గుణం ఎంతోకొంత ఉంది. కనుకనే అతను ఆ ధనవంతుడిని ఇంటికి చేరే మార్గాన్ని చూపించాడు.సత్త్వ, రజస్తమో గుణాల గురించి చెబుతూ రామకృష్ణ పరమహంస ఈ కథను చెప్పారు. – యామిజాల జగదీశ్ -
దొంగతనం చేయని సొమ్ము
‘మర్యాదగా సొమ్ములు ఎక్కడున్నాయో చెప్పు’ అని కత్తి తీశాడు దొంగ. ‘నా చదువుకు అంతరాయం కలిగించకు, అక్కడ పెట్టెలో ఉన్నాయి చూడు’ ఏమాత్రం ఉద్వేగపడకుండా చెప్పాడు సాధువు. ఒక సాధువు ఇంట్లో కూర్చుని మంత్రాలు ఏవో పఠిస్తున్నాడు. అప్పటికే బాగా రాత్రయింది. అయినా సాధువు లోతుగా పఠనంలో మునిగివున్నాడు. ఆ సమయంలో ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ అలికిడికి సాధువు ఏకాగ్రత చెదిరింది. ‘మర్యాదగా సొమ్ములు ఎక్కడున్నాయో చెప్పు’ అని కత్తి తీశాడు దొంగ. ‘నా చదువుకు అంతరాయం కలిగించకు, అక్కడ పెట్టెలో ఉన్నాయి చూడు’ ఏమాత్రం ఉద్వేగపడకుండా చెప్పాడు సాధువు. సాధువు చెప్పినట్టే దొంగ పెట్టె దగ్గరికి వెళ్లాడు. ‘అందులో కొన్ని నాకోసం ఉంచు, రేపు కొన్ని అవసరాలున్నాయి’ అన్నాడు సాధువు. సాధువు చెప్పినట్టే కొన్ని ఉంచి, మరికొన్ని సొమ్ములు తీసుకుని బయటికి వెళ్లబోయాడు దొంగ. ‘కనీసం సొమ్ములు తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పే మర్యాదైనా పాటించవయ్యా’ అన్నాడు సాధువు. దొంగ సిగ్గుపడ్డాడు. సాధువు చెప్పినట్టే ‘కృతజ్ఞతలు’ చెప్పి వెళ్లిపోయాడు. అయితే, ఆ రాత్రే ఆ దొంగను గస్తీ తిరుగుతున్న రక్షక భటులు పట్టుకున్నారు. తెల్లారి సాక్ష్యం తీసుకోవడం కోసం సాధువును పిలిపించారు. ‘లేదు, ఈయన నా సొమ్ములు దొంగతనం చేయలేదు. ఆయన కొన్ని కావాలన్నాడు, నేను ఇచ్చాను. దానికి బదులుగా కృతజ్ఞతలు కూడా చెప్పాడు’ అన్నాడు సాధువు. దాంతో, రక్షక భటులు దొంగను వదిలేశారు. ఆ తర్వాత ఆ దొంగ కూడా దొంగతనాన్ని వదిలేశాడు. -
క్రాష్ గార్డ్స్‌ను నిషేధిస్తే?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రమాదాల తీవ్రతను తగ్గించుకునేందుకు కార్ల యజమానులు ప్రత్యేకంగా క్రాష్ గార్డులను ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. ఈ కార్ క్రాష్ గార్డులపై కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ కొరడా ఝులిపిస్తోంది. మోటార్ వెహికల్ యాక్ట్‌ను ఉల్లంఘించి ఏర్పాటు చేసుకునే ఈ క్రాష్ గార్డులను నిషేధించే యోచనల రవాణ మంత్రిత్వ శాఖ ఉంది. క్రాష్ గార్డులనేవి.. పాదచారులకు, ద్విచక్ర వాహన దారులకు ప్రమాదమేనని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో కంపెనీ ఇచ్చిన వాటికి అదనగా ఏ మాత్రం మార్పులు చేర్పులు చేయరాదని మంత్రిత్వ శాఖ చెబుతోంది. సాధారణంగా వాహనదారులు కొత్త వాహనం కొత్త తరువాత ప్రమాద తీవ్రతను తగ్గించుకునే నేపథ్యంలో క్రాష్ గార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. దాదాపు ప్రతి ప్రభుత్వ వాహనానికి కూడా క్రాష్ గార్డులు ఉండడం గనార్హం. అయితే ఈ క్రాష్ గార్డుల వల్లే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశముదని రవాణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. క్రాష్ గార్డులు ఉండడం వల్ల ప్రమాద సమయంలో కంపెనీ ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కారణం వల్లనే క్రాష్ గార్డులను నిషేధించాలన్న ఆలోచనకి రవాణ మంత్రిత్వ శాఖ వచ్చినట్లు తెలుస్తోంది. -
పోలీసులపై దాడి, ఆయుధాలతో పరారీ
అనంతనాగ్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు అనంత్‌నాగ్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసి ఆయుధాలతో పరారయ్యారు. దల్విశ్ గ్రామంలో టీవీ టవర్ వద్ద పహారా కాస్తున్న పోలీసులపై గతరాత్రి దాడి చేసి, వారి వద్ద ఉన్న అయిదు తుపాకులను లాకెళ్లారు. మరోవైపు ముష్కర మూకల వరుస దాడుల నేపథ్యంలో ఆర్మీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. -
ఆ జంతువుకు సాయుధ బాడీ గార్డ్స్!
జంతువుకు సాయుధ బాడీ గార్డ్స్ ఏంటీ అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం. ఆ జంతువుకు చుట్టూ పదుల సంఖ్యలో బాడీ గార్డ్స్. దానిపై ఈగ కూడా వాలకుండా, ఏ లోటూ రాకుండా చూసుకుంటారు. అది ఎక్కడకు వెళ్తే అక్కడకు వాళ్లు కూడా దాని వెంటే ఆయుధాలు పట్టుకుని నడుస్తూ వెళ్తారు. రోజంతా దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కెన్యాలోఓ రైనోకు జరుగుతున్న మర్యాదలు ఇవి. ప్రపంచంలో అంతరించిపోవడానికి అత్యంత దగ్గరలో ఉన్న జంతుజాతికి చెందినవి నార్తర్న్ వైట్ రైనోస్. అందులోనూ ఈ భూమ్మీద ఈ జాతికి చెందిన మగ రైనో ఒక్కటే ఉంది. దీంతో కెన్యా ప్రభుత్వం దానిని రక్షించుకోవడానికి భారీ చర్యలే చేపడుతోంది. దానికి ఎటువంటి హాని కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసింది. కెన్యాలో ఈ జాతికి చెందిన ఆడ రైనోలు రెండు ఉన్నాయి. ఎలాగైనా వీటితో మగ రైనోను సంపర్కం జరిపించి ఆ జాతిని అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో వయస్సు మీద పడిన ఏకైక మగ రైనోకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా కూడా ఈ చర్యలు తీసుకుంటున్నారు. -
యువకుల ప్రాణాలుకాపాడిన కోస్ట్‌గార్డ్స్
-
ఇక చీకట్లోనూ గస్తీ
న్యూఢిల్లీ: కొత్తగా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ మహిళల రక్షణకు మరిన్ని చర్యలు ప్రారంభించనుంది. మహిళలపై ఎక్కువగా నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న చీకటి ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహించేందుకు ఓ దళాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఎన్నికల్లో పోటికి వచ్చే ముందు కూడా ఆప్ ఈ విషయాన్ని తమ ఎజెండాలోనూ ప్రకటించింది. 10 వేలమంది గార్డ్స్‌ను ఏర్పాటుచేస్తామని వీరిలో ఐదు వేలమందిని డీటీసీ బస్సుల్లో ఉపయోగిస్తామని కూడా ప్రకటించింది. అందులో భాగంగానే ఆ పార్టీ తాజా నిర్ణయం తీసుకుంది. -
SBIలో ప్రవేశించిన ముగ్గురు దొంగలు