
ఇక చీకట్లోనూ గస్తీ
న్యూఢిల్లీ: కొత్తగా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ మహిళల రక్షణకు మరిన్ని చర్యలు ప్రారంభించనుంది. మహిళలపై ఎక్కువగా నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న చీకటి ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహించేందుకు ఓ దళాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఎన్నికల్లో పోటికి వచ్చే ముందు కూడా ఆప్ ఈ విషయాన్ని తమ ఎజెండాలోనూ ప్రకటించింది. 10 వేలమంది గార్డ్స్ను ఏర్పాటుచేస్తామని వీరిలో ఐదు వేలమందిని డీటీసీ బస్సుల్లో ఉపయోగిస్తామని కూడా ప్రకటించింది. అందులో భాగంగానే ఆ పార్టీ తాజా నిర్ణయం తీసుకుంది.