
ముంబై: జపాన్‌కు చెందిన ప్రీమియం లోదుస్తుల బ్రాండ్ ‘వాకూల్’ భారత్‌లో పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలో భాగంగా రానున్న మూడేళ్ల కాలంలో 2021 నాటికి భారత్‌లో రూ.100 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపింది. భారత్‌లో విక్రయాలు పెంచుకునేందుకు గాను ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల సంఖ్యను 12 నుంచి 70కు పెంచనున్నట్టు, షాప్ ఇన్ షాప్ స్టోర్లను 80కి, దేశవ్యాప్తంగా స్టోర్లను 150కి పెంచనున్నట్టు ప్రకటించింది.
ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా మార్కెట్లలో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయడంతోపాటు, దేశంలోని నాలుగు ప్రాంతాల్లోనూ టాప్ 10 పట్టణాలపై మరింత దృష్టి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. టైర్–1, 2 ప్రాంతాల్లో 30 పట్టణాలకు విస్తరించనున్నట్టు పేర్కొంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు మింత్రా, జబాంగ్, టాటా క్లిక్, వాకూల్ ఇండియా డాట్ కామ్ ద్వారా విక్రయాలను పెంచుకునే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment