Indian Actor Dev Joshi:స్పేస్ టూరిజంలో మరో సరికొత్త సంచలనం సృష్టించేందుకు అపరకుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది 8 మందిని అంతరిక్షంలోకి పంపించనున్నారు.
తాజాగా నింగిలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఆ ఎనిమిది మంది ఎవరనేది జపాన్ బిలియనీర్ యుసాకు మాయఝావా రివిల్ చేశారు. ఎందుకంటే? మూన్ ట్రిప్ కోసం స్పేస్ ఎక్స్‌కు చెందిన స్పేస్ షిప్ స్పేస్ క్రాఫ్ట్ సీట్లు కొనుగోలు చేసింది ఆయన కాబట్టి. ఇక స్పేస్‌లోకి వెళ్లే ప్రయాణికుల్లో ఓ భారతీయ నటుడు ఉండటం విశేషం.ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా?
జపాన్‌లో అత్యంత ధనవంతుల జాబితాలో బిజినెస్ టైకూన్ యుసాకు మేజావా (Yusaku Maezawa) ఒకరు. ఎలాన్ మస్క్ తరహాలో ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ట్విటర్‌లో ట్వీట్‌లు చేస్తూ అందర్ని ఆకర్షిస్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ ట్వీట్. 2020 జనవరి 1న మేజావా చేసిన ఓ ట్వీట్‌ను ఎవరైతే ఎక్కువ సార్లు రీట్వీట్ చేస్తారో..వారిలో 1000 మందిని ఎంపిక చేసి 1 మిలియన్ యెన్ ($7300) చెల్లిస్తానని ప్రకటించారు. ఎందుకు ఇలా ఫ్రీగా ఇస్తున్నారని ప్రశ్నిస్తే ఇదొక సోషల్ ఎక్స్‌పెరిమెంట్. నేనిచ్చే డబ్బులు వారికి ఆనందాన్ని ఇస్తుందో లేదో చూడాలని ఇలా ప్రకటించినట్లు తెలిపారు.
ఉచితంగానే
ఇప్పుడు అదే మేజావా ప్రపంచ వ్యాప్తంగా 8 మందిని ఎంపిక చేసి వారిని ఉచితంగా చంద్రుని మీదకు పంపించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ‘డియర్ మూన్ క్రూ’ పేరుతో అంతరిక్ష ప్రయాణం ప్రారంభం కానుంది. నింగిలోకి వెళ్లనున్న ఆ 8 మంది మొత్తం ఆరు రోజుల ప్రయాణం చేయనుండగా .. మూడు రోజులు పాటు చంద్రుడి చుట్టూ తిరిగి భూమి మీదికి రానున్నారు.
ఆ 8 మంది ఎవరంటే
ఆకాశాన్నీ దాటి అంతరిక్షంలోకి వెళ్లనున్న 8 మందిలో మనదేశానికి చెందిన నటుడు దేవ్ జోషితో పాటు జపనీస్ ఫ్యాషన్.. అమెరికన్ డిజె, నిర్మాత స్టీవ్ అయోకి, Czech artist యెమి ఎడి, అమెరికన్ యూట్యూబర్ టిమ్ డాడ్, బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ కరీం ఇలియా, ఐరిష్ ఫోటోగ్రాఫర్ రియానన్ ఆడమ్, దక్షిణ కొరియా కె-పాప్ బ్యాండ్ స్టార్ చోయ్ సెయుంగ్-హ్యూన్ (Choi Seung-hyun) అమెరికన్ చిత్రనిర్మాత బ్రెండన్ హాల్ ఉన్నారు.
భారత్‌కు చెందిన ఆ నటుడు ఎవరంటే
వారిలో మనదేశంలోని గుజరాత్‌కు చెందిన దేవ్ జోషి చిన్నప్పట్నుంచి పలు సీరియల్స్, సినిమాల్లో బాలీవుడ్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇతనికి కేవలం 22 సంవత్సరాలే. పలు నివేదికల ప్రకారం.. భారతీయ నటుడు, గుజరాత్‌కు చెందిన దేవ్ జోషి 3 ఏళ్ల వయస్సులో బాల నటుడిగా బుల్లితెరకు పరిచయం అయ్యాడు. అలా సోనీ (సోనీ సాబ్) టీవీ అక్టోబర్ 8, 2012లో విడుదల చేసిన బాల్ వీర్‌లో, బాల్ వీర్ రిటర్న్‌తో సీరియల్స్ తో పాటు 20కి పైగా గుజరాతీ సినిమాలు, ఇతర అడ్వటైజ్మెంట్‌లలో యాక్ట్ చేశారు. తాజాగా ఉచితంగా అంతరిక్షంలోకి వెళ్లే అదృష్టాన్ని దక్కించుకున్నారు.
That's our Flight Path to the Moon and Back! 💙🚀 https://t.co/LtLxGuvNKW
— Dev Joshi (@devjoshi10) December 10, 2022
Comments
Please login to add a commentAdd a comment