
నయనతార
ఈ ఏడాది కొరియన్ కథతో ‘ఓ బేబి’ (కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు సమంత. లేడీ ఓరియంటెడ్ సినిమాగా సమంత కెరీర్‌లో పెద్ద హిట్ సినిమా అనిపించుకుంది ‘ఓ బేబి’. ఇప్పుడు నయనతార కూడా ఓ కొరియన్ కథలో నటించడానికి అంగీకరించారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని హీరో రానా నిర్మిస్తారట. ఇందులో నయనతార పోలీస్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment