దక్షిణ కొరియా యూత్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ సింగర్ చోయ్ సంగ్ బాంగ్(33) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దక్షిణ సియోల్‌లోని తన నివాసంలో విగతజీవిగా పడున్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు..మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన దర్యాప్తును ప్రారంభించారు.
చోయ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైన హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో మాత్రం చోయ్ ఆత్మహత్య చేసుకున్నాడనే తేలిందట. చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన యూట్యూబ్ చానెల్‌లో ఓ లేఖను అప్‌లోడ్ చేసిన ఆయన.. తన వల్ల ఇబ్బంది పడినవారందరికి క్షమాపణలు చెప్పారు.
2011లో రియాలిటీ సింగింగ్ పోటీ ‘కొరియాస్ గాట్ టాలెంట్’లో రెండో స్థానం పొందిన తర్వాత చోయ్ మరింత ఫేమస్ అయ్యాడు. చిన్న వయసులోనే స్టార్ సింగర్‌గా ఎదిగిన ఆయనకు..అదే స్థాయిలో వివాదాలు కూడా చుటుటముట్టాయి. ముఖ్యంగా తాను క్యాన్సర్ బారిన పడ్డానని, చికిత్స కోసం డబ్బులు కావాలంటూ విరాళాలు వసూలు చేయడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. డబ్బు కోసమే క్యాన్సర్ బారిన పడినట్లు అబద్దం చెప్పినట్లు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. తనకు వచ్చిన విరాళాలు కూడా తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే కొన్నాళ్లుగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఒంటరిగా ఉంటున్న చోయ్..ఇప్పుడు విగతజీవిగా మారడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment