నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన రొమాంటిక్ డ్రామాగా విడుదలై మంచి ఆదరణ పొందింది ‘హోమ్ టౌన్ చా చా చా’. ఈ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు కొరియన్ నటుడు కిమ్ సియోన్ హో. ఇటీవల ఈయనపై తన మాజీ ప్రియురాలు అబార్షన్ చేయించుకోమన్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిపై తాజాగా ఈ నటుడు స్పందించి క్షమాపణలు తెలిపాడు.
‘నేను కిమ్ సియోన్ హో. ఇంతకుముందు చేసిన వాదన గురించి క్షమాపణలు చెబుతున్నా. ఆ సమయంలో ఆ పోస్ట్‌లో నా పేరు చూడగానే ఎంతో భయపడ్డా. అందుకే అలా రియాక్ట్ అయ్యా. అందుకే అనాలోచితంగా, అజాగ్రత్తగా వ్యవహరించి ఆమెను బాధ పెట్టాను. దాని గురించి ఆమెను ప్రత్యక్షంగా కలిసి సారీ చెప్పాలని భావిస్తున్నాను’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు కిమ్. నటుడిగా ఇంత ఎత్తుకు ఎదిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరినీ నిరాశ పరిచానని కొరియన్ యాక్టర్ చెప్పాడు. ప్రశ్చాత్తాపంతో అందరికీ అపాలజీ చెబుతున్నట్లు ఈ నటుడు పేర్కొన్నాడు.
గుడ్ మేనేజర్, టు కాప్స్, 100 డేస్ మై ప్రిన్స్‌తో సహా అనేక ప్రదర్శనలలో నటించి నటుడిగా గుర్తింపు పొందాడు కిమ్. కాగా అపాలజీ చెప్పిన అనంతరం అతను నటిస్తున్న కొన్ని షోల నుంచి ఈ కొరియన్ నటుడిని తొలగించారు నిర్వహకులు.
చదవండి: ‘జస్టిస్ లీగ్’ డైరెక్టర్ నన్ను బెదిరించాడు: వండర్ వుమెన్
Comments
Please login to add a commentAdd a comment