ముఖ నిగారింపుని మరింతగా పెంచుకునేందుకు కొరియన్‌లు స్లాప్ థెరపీని వాడతారు. స్లాప్ థెరపీ అంటే చెంప మీద పెళ్లున కొట్టడం.రెండు చేతులతో ముఖానికి ఇరువైపులా కొట్టడం వల్ల ముఖచర్మం గ్లోగా కనిపిస్తుంది.
►ముందుగా ముఖాన్ని వేడినీటితో కడిగి, తడిలేకుండా శుభ్రంగా తుడవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాయాలి. ఇప్పుడు మెల్లగా కొట్టడం ప్రాంభించి క్రమంగా పెద్దగా కొట్టాలి. ఇలా ఏడు నిమిషాలు పాటు చేస్తే స్లాప్ థెరపీ అయిపోయినట్లే.
►రోజూ క్రమం తప్పకుండా ఈ స్లాప్ థెరపీ చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి, సహజసిద్ధంగానే చర్మం రేడియంట్ నిగారింపుని సంతరించుకుంటుంది.
►ఈ థెరపీతో నిగారింపే కాకుండా చర్మం మీద ముడతలు త్వరగా రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. అందుకే దీనిని యాంటీఏజింగ్ థెరపీ అని కూడా పిలుస్తారు.
►రక్తప్రసరణ పెరగడం వల్ల టాక్సిన్స్ బయటకు పోయి ముఖం మీద మొటిమలు కూడా రావు.
ఇంకెందుకాలస్యం... ఏ మాత్రం శ్రమలేని స్లాప్ థెరపీతో మీ ముఖాన్ని మెరిపించండి.
Comments
Please login to add a commentAdd a comment