ఈ రోజుల్లో కాసేపు ఊపిరి బిగపట్టుకుని ఉండమన్నా ఉంటారేమో కానీ సెల్‌ఫోన్ లేకుండా క్షణం ఉండలేరు. ప్రతిదాంట్లో మంచి చెడు ఉన్నట్లే దీనివల్ల కూడా ఉపయోగం, ప్రమాదం.. అన్నీ ఉన్నాయి. మన ఫోన్ అవతలి వ్యక్తి చేతిలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్టే అన్‌లాక్‌డ్.
కథ
తింటున్నా, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్తున్నా, షికారుకు వెళ్లినా, జర్నీ చేస్తున్నా, ఏం చేసినా సరే.. ప్రతీది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది నామీ. ఒకరోజు బస్‌లో తన ఫోన్ మర్చిపోతుంది. అది కాస్త సీరియల్ కిల్లర్‌కు దొరుకుతుంది. నిజానికి పాస్‌వర్డ్ తెలియకపోవడంతో అతడు ఏమీ చేయలేక కోపంతో ఫోన్‌ను పగలగొడతాడు. పొరపాటున ఫోన్ కిందపడి అద్దం పగిలిందని, బాగు చేసి ఇస్తానని అమ్మాయిని పిలుస్తాడు. ఆపై పాస్‌వర్డ్ చేప్పమని అడుగుతాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది.
తన నిశ్శబ్ధమే..
ఈ క్రమంలో అక్కడికి వచ్చిన నామీ తటపటాయిస్తూనే తన పాస్‌వర్డ్ చెప్తుంది. దీంతో అతడు ఆమె ఫోన్‌ను హ్యాక్ చేసి ఇచ్చేస్తాడు. తన ప్రతి కదలికను గమనిస్తుంటాడు. నెమ్మది నెమ్మదిగా ఆమె జీవితాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని తనకు సంతోషమనేదే లేకుండా చేస్తాడు. అయితే ఇక్కడ సీరియల్ కిల్లర్ ఎక్కువ నిశ్శబ్ధంగా ఉండటం వల్ల నెక్స్ట్ ఏం చేస్తాడన్న ఉత్సుకత కలగక మానదు.
పాస్‌వర్డ్ అడగడమే విడ్డూరం
సినిమాలో క్యారెక్టర్ల గురించి పెద్దగా పరిచయం చేయకపోవడంతో చివర్లో కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. పెద్ద ట్విస్టులు లేకుండా కథ ఒకే లైన్‌లో ముందుకు సాగుతుంది. అయితే ఫోన్ స్క్రీన్ మార్చడానికి పాస్‌వర్డ్ అక్కర్లేదు. అలాగే షాపులోని వ్యక్తి (సీరియల్ కిల్లర్)కి పాస్‌వర్డ్ రాసివ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఇక్కడ షాపువాడు ఫోన్ పాస్‌వర్డ్ అడగడం, ఆమె రాసిచ్చేయడం కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఒక గంట 57 నిమిషాల నిడివి ఉన్న ఈ కొరియన్ థ్రిల్లర్ మూవీని ఓసారి చూసేయొచ్చు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment