Sleep Movie Review: నిద్రతోనే భయపెట్టే సినిమా | Korean Sleep Movie 2024 Review In Telugu And Storyline Inside | Sakshi
Sakshi News home page

Sleep Movie Review : నిద్రతోనే భయపెట్టే సినిమా.. స్లీప్ ఎలా ఉందంటే?

Published Sun, Aug 4 2024 10:49 AM | Last Updated on Sun, Aug 4 2024 1:57 PM

Sleep Movie Review In Telugu

టైటిల్: స్లీప్(కొరియన్ మూవీ)
దర్శకత్వం: జాసన్ యూ
నిర్మాణ సంస్థ లోటే ఎంటర్‌టైన్‌మెంట్‌
జోనర్: హారర్ థ్రిల్లర్‌
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్‌(తెలుగులోనూ అందుబాటులో ఉంది)
నిడివి: 95 నిమిషాలు

హారర్ సినిమా అంటే మనందరికీ గుర్తొచ్చేది దెయ్యమే. ఆ సబ్జెక్ట్‌ లేకుండా హారర్ సినిమా తీయడం చాలా అరుదు. తెలుగు చాలా హారర్ చిత్రాలు వచ్చాయి. కానీ దెయ్యం ఎక్కడా కనిపించకుండా ఆడియన్స్‌ను భయపెట్టేలా సినిమాలు చాలా తక్కువే ఉంటాయి. అలాంటి సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రమే స్లీప్‌. 2023లో వచ్చిన కొరియన్‌ హారర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ఎలా ఉండో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
ఈ సినిమా మొత్త ఇద్దరు దంపతుల చుట్టే తిరుగుతుంది. సౌత్‌ కొరియాలో హైయోన్-సూ (లీ సన్-క్యున్), సూ-జిన్ (జంగ్ యు-మి) కొత్తగా పెళ్లి చేసుకుని ఓ ఫ్లాట్‌లో నివసిస్తుంటారు. ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ హాయిగా జీవనం సాగిస్తుంటారు. కానీ అనుకోకుండా ఓ రాత్రి జరిగిన సంఘటనతో వారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ సంఘటన తర్వాత సూ జిన్‌లో భయం మొదలవుతుంది. అసలు తన భర్త ఎందుకిలా చేస్తున్నాడో భయంతో వణికిపోతుంది.

ఆ తర్వాత తన భర్త హయన్‌ సూతో కలిసి వైద్యుని సంప్రదిస్తుంది సూ జిన్. ఆ తర్వాత ఆమె భర్తకు ఉన్న విచిత్రమైన, భయంకరమైన వింత సమస్య గురించి ఆమెకు అసలు నిజం తెలుస్తుంది. దీంతో భర్తను కాపాడుకునేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నిస్తుంది. అసలు అతనికి ఏమైంది? భయంకరమైన డిజార్డరా? లేక దెయ్యం ఆవహించిందా?.. ‍అలాగే వీరికి పుట్టిన బాబును ఎలా రక్షించుకుంది? అనేది తెలియాలంటే స్లీప్ ఓసారి చూడాల్సిందే.  

ఎలా ఉందంటే..
స్లీప్‌.. హారర్‌ మూవీ అయినప్పటికీ డైరెక్టర్‌ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ను సినీ ప్రియులకు పరిచయం చేశాడు. దెయ్యాన్ని చూపించకుండానే ఆడియన్స్‌ను భయపడేలా చేశాడు. ఇందులో విచిత్రమైన డిజార్డర్‌ను పరిచయం చేస్తూ.. హారర్‌తో పాటు ఆడియన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. అతనికి ఉన్నది డిజార్డరా? లేక నిజంగానే దెయ్యం పట్టిందా? అన్న అనుమానాన్ని ఆడియన్స్‌లో రేకెత్తించాడు. అక్కడక్కడా మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించినా.. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ను మరింత భయపెట్టేస్తాయి. కొన్ని సీన్స్‌ అయితే ఒళ్లు గగుర్పొడ్చేలా ఉ‍న్నాయి. అలాగే చివర్లో వచ్చే డ్రిల్లింగ్‌ మిషన్‌ సీన్‌ చిన్నపిల్లలకు చూపించకపోవడం మంచిది. మొత్తంగా ఓటీటీలో సస్పెన్ష్ థ్రిల్లర్స్‌ ఎంజాయ్ చేసే ఆడియన్స్‌ స్లీప్ చూసేయొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement