ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది భారత్‌లో 8,000 మందిని కొత్తగా నియమించుకోనుంది. కార్పొరేట్, టెక్నాలజీ, కస్టమర్ సరీ్వస్, ఆపరేషన్స్ విభాగాల్లో హైదరాబాద్‌సహా మొత్తం 35 నగరాల్లో ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2025 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలి్పంచాలన్నది లక్ష్యమని అమెజాన్ హెచ్‌ఆర్ లీడర్ దీప్తి వర్మ తెలిపారు. ఇప్పటికే దేశంలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్టు చెప్పారు. మహమ్మారి కాలంలో మూడు లక్షల మందికి ఉపాధి లభించిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment