న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్‌తో విలీన ఒప్పందం విషయంలో ముందుకెళ్లరాదంటూ ఫ్యూచర్ రిటైల్‌కు సింగపూర్‌లోని ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ (ఈఏ) ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయని, అవి అమలయ్యేలా చూడాలని సుప్రీం కోర్టును ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కోరింది. ఇవే ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కూడా తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలియజేసింది. అయితే, ఈ విషయంలో ఫ్యూచర్ గ్రూప్‌కు అనుకూలంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇవ్వడం సరికాదని పేర్కొంది.
రిలయన్స్–ఫ్యూచర్ డీల్ అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం ఈ మేరకు తమ వాదనలు వినిపించింది. సుప్రీం కోర్టు దీనిపై గురువారం లేదా వచ్చే మంగళవారం తదుపరి విచారణ చేపట్టనుంది. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్‌ను విలీనం చేసే దిశగా ఫ్యూచర్ గ్రూప్ దాదాపు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఫ్యూచర్ గ్రూప్‌లో వాటాదారైన అమెజాన్.. ఈ ఒప్పందం చట్టవిరుద్ధమంటూ న్యాయస్థానాలను, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment