Supreme Court of Singapore
-
‘ఫ్యూచర్’ కేసులో ఆర్బిట్రేషన్ తీర్పు అమలు చేయండి
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్‌తో విలీన ఒప్పందం విషయంలో ముందుకెళ్లరాదంటూ ఫ్యూచర్ రిటైల్‌కు సింగపూర్‌లోని ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ (ఈఏ) ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయని, అవి అమలయ్యేలా చూడాలని సుప్రీం కోర్టును ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కోరింది. ఇవే ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కూడా తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలియజేసింది. అయితే, ఈ విషయంలో ఫ్యూచర్ గ్రూప్‌కు అనుకూలంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇవ్వడం సరికాదని పేర్కొంది. రిలయన్స్–ఫ్యూచర్ డీల్ అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం ఈ మేరకు తమ వాదనలు వినిపించింది. సుప్రీం కోర్టు దీనిపై గురువారం లేదా వచ్చే మంగళవారం తదుపరి విచారణ చేపట్టనుంది. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్‌ను విలీనం చేసే దిశగా ఫ్యూచర్ గ్రూప్ దాదాపు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఫ్యూచర్ గ్రూప్‌లో వాటాదారైన అమెజాన్.. ఈ ఒప్పందం చట్టవిరుద్ధమంటూ న్యాయస్థానాలను, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. -
సింగపూర్ జలాల్లో చిక్కుకున్న భారత నావికులు
ఫిబ్రవరి నుంచి నౌకలోనే.. నానాకష్టాలు పడుతున్న 22 మంది సింగపూర్: భారత్‌కు చెందిన 22 మంది నావికులు సింగపూర్ జలాల్లో చిక్కుకుపోయి గత ఫిబ్రవరి నుంచి నానా కష్టాలు పడుతున్నారు. తైవాన్‌కు చెందిన చమురు రవాణా నౌక ‘ఫార్చ్యూన్ ఎలిఫెంట్’ కొద్దినెలల క్రితం సింగపూర్ తీరానికి వెళ్లింది. ఇందులో 22 మంది భారత నావికులతోపాటు ఒక రోమన్ దేశస్తుడు ఉన్నారు. నౌకలోని చమురు అన్లోడింగ్ చేయరాదంటూ సింగపూర్ సుప్రీంకోర్టు నుంచి తైవాన్‌కు చెందిన క్యాథే యునెటైడ్ బ్యాంక్ అనుమతి తెచ్చుకుంది. దీంతో 3 నెలల నుంచి చమురు అన్లోడింగ్ నిలిచిపోయింది. ఫలితంగా సిబ్బంది అంతా నౌకలోనే ఉండాల్సి వ స్తోంది. నీరు, తిండి, వేతనానికి ఇబ్బందేమీ లేకపోయినా నౌక నుంచి బయటకు రావడంపై ఆంక్షలు కొనసాగుతుండడంతో ఇబ్బందులపాలవుతున్నారు. కిందటివారం నావికులను మూడుగంటలపాటు సింగపూర్‌లోకి అనుమతించారు. నౌక మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్ల పరిమాణంలో ఉంది. ‘‘టీవీలు చూస్తూ, రేడియో వింటూ, తమ ఇళ్లకు ఫోన్లు చేస్తూ సిబ్బంది కాలక్షేపం చేస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ వారిలో నిరాశ పెరుగుతోంది. సొంతిళ్లకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు’’ అని నౌక కెప్టెన్ ఆశీష్ ఎన్ జా చెప్పారు.