
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గుర్తించిన కోవిడ్–19 హాట్‌స్పాట్‌లు, కట్టడి జోన్‌లు మినహా ఇతర ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తూ ఈ నెల 15వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం మరికొన్ని సడలింపులను చేర్చింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాలు గుర్తించిన కంటైన్‌మెంట్ జోన్లకు ఈ సడలింపులు వర్తించవని తెలిపింది. హాట్‌స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లపై గతంలో ప్రకటించిన ఆంక్షలు మే 3వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది. రెస్టారెంట్లు, హెయిర్ సెలూన్లు తెరవరాదనీ, మద్యం, సిగరెట్లు, గుట్కా అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి సడలింపులపై అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొంది. అత్యవసర వస్తువులను సరఫరా చేసే ఈ–కామర్స్ సంస్థలకు సడలింపు కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది.
గ్రామీణ ప్రాంతాలు (పురపాలక సంఘాల వెలుపలి ప్రాంతాలు): గ్రామీణ ప్రాంతాల్లోని రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం కింద నమోదై ఉన్న షాప్స్. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, మార్కెట్ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ సడలింపు వర్తిస్తుంది. అయితే సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్‌కు మాత్రం ఇది వర్తించదు. అంటే షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లోని వాటికి వర్తించదు. అలాగే 50% మించకుండా సిబ్బంది పనిచేయాలి. వారంతా మా స్కులు ధరించి ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం కింద నమోదై ఉన్న షాప్స్‌కు సడలింపు వర్తిస్తుంది. ఇరుగుపొరుగున ఉన్న షాపులు, స్టాండ్ ఎలోన్ షాపులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ ఇది వర్తిస్తుంది. ఈ జాబితాలో దుస్తులు, సెల్‌ఫోన్, హార్డువేర్, స్టేషనరీ దుకాణాలు తెరవచ్చు. అయితే, మార్కెట్ కాంప్లెక్స్‌లలోని షాపులకు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని షాపులకు, సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్‌కు ఇది వర్తించదు. అలాగే 50 శాతం మించకుండా సిబ్బంది పనిచేయాలి. వారంతా మాస్కులు ధరించి ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment