hotspots
-
ప్రమాదంలో జీవ వైవిధ్యం
ఆకాశాన్నంటే హిమాలయాల నుంచి, మూడు వైపులా ఆవరించిన అనంత సాగర జలరాశి దాకా; సహారా ఇసుక ఎడారి మొదలుకుని, అపార జీవరాశికి ఆలవాలమైన సుందర్బన్ వంటి అడవుల దాకా... అంతులేని జీవ వైవిధ్యానికి పుట్టిల్లు మన దేశం. అలాంటి జీవవైవిధ్యం ఇప్పుడు మనిషి నిర్వాకం వల్ల అక్షరాలా అతలాకుతలమవుతోంది. అస్తిత్వం కోసం పెనుగులాడుతోంది. అతి త్వరలో పూర్తిగా అంతరించిపోయే పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కారణమేమిటి? ♦ విచ్చలవిడిగా అడవుల నరికివేత, అడ్డూ అదుపూ లేని పట్టణీకరణ, ఫలితంగా విపరీతమైన కాలుష్యం, వాతావరణ మార్పులు తదితరాలు. ♦ భారత్‌లో 1990–2020 మధ్య 30 ఏళ్లలోనే ఏకంగా ఏడు లక్షల హెక్టార్ల మేరకు అడవి నరికివేతకు గురైనట్లు యుటిలిటీ బిడ్డర్ నివేదిక చెబుతోంది. ఇదిఇలాగే కొనసాగితే వన్యప్రాణులకు కనీసం నిలువ నీడ కరువవుతుంది. ♦ విచ్చలవిడిగా విస్తరిస్తున్న నగరాలు క్రమంగా చిత్తడి, గడ్డి నేలల వంటి సహజ జీవ వ్యవస్థలను కబళిస్తున్నాయి. ♦ ప్రణాళికలేని విస్తరణతో పలు నగరాలు వరదల వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. ♦దీని తాలూకు విపరిణామాలకు బెంగళూరే అతి పెద్ద ఉదాహరణ. కేవలం గత 50 ఏళ్లలోనే నగరంలో పచ్చదనం 88 శాతం, నీటి వనరులు 79 శాతం మటుమాయమయ్యాయి! ♦ పెరిగిపోతున్న ధ్వని, కాంతి కాలుష్యం వణ్యప్రాణుల జీవితాలను, ప్రవర్తనను, పునరుత్పత్తి సామర్థ్యాన్ని... మొత్తంగా వాటి మనుగడనే దెబ్బ తీస్తోంది. ముప్పేట ముప్పు! ♦ జీవవైవిధ్యం అంతరిస్తే తలెత్తే విపరిణామాలను ఊహించడం కూడా కష్టమే. ♦ వాతావరణ ధోరణులు పూర్తిగా మారిపోతాయి. వాటితో పాటే రుతువులూ క్రమం తప్పిపోతాయి. అంతా అల్లకల్లోలమవుతుంది. ♦ సముద్ర మట్టాలు మరింత పెరిగి తీర ప్రాంతాలను క్రమంగా కనుమరుగవుతాయి. ♦ సముద్ర జలాల్లో ఆమ్లత్వం పెరిగి వాటిలోని జీవజాలానికి ముప్పు ఏర్పడుతుంది. ♦ హిమానీ నదాలు శరవేగంగా కరిగిపోతాయి. ♦ ప్రజలు భారీగా నిర్వాసితులవుతారు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ♦ పలు అరుదైన జీవ జాతులు శాశ్వతంగా అంతరించిపోతాయి. రాయల్ బెంగాల్ టైగర్, గోల్డెన్ లంగూర్, సిరోయ్ లిలీ వంటివి ఇప్పటికే ఈ జాబితాలోకి చేరాయి. ఏం చేయాలి? ♦ జీవవైవిధ్యపరంగా ప్రస్తుత తిరోగమన ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వాలు తక్షణం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రంగంలోకి దిగాలి. ♦ శాస్త్రీయ, సమాజ, విధానపరంగా కలసికట్టుగా కృషి జరగాలి. ♦ పర్యావరణ, సహజ వనరుల పరిరక్షణకు నగదు ప్రోత్సాహకాల వంటివి ఇవ్వాలి. ఉత్తరాఖండ్ ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ♦ తీవ్ర వాతావరణ పరిస్థితులను నిరోధించి పర్యావరణ సమతుల్యతను కాపాడే మడఅడవుల వంటి సహజ వనరులను పూర్తిస్థాయిలో పరిరక్షించుకోవాలి. ♦ పర్యావరణ విద్యను బోధన ప్రణాళికలో తప్పనిసరి చేయాలి. ♦ జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యత ప్రజలందరికీ అర్థమయ్యేలా ముమ్మర ప్రచారం చేపట్టాలి. హాట్‌స్పాట్స్.. విశేషాల పుట్టిళ్లు! ♦ అంతర్జాతీయ గుర్తింపున్న 36 జీవవైవిధ్య హాట్స్పాట్లలో నాలుగింటికి భారత్ నెలవు. అవి హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, ఇండో–బర్మా జోన్, సుందర్బన్ అడవులు. ♦ ఇవి మనుషులతో పాటు పలు జీవజాలాలకు నిలయాలు. ♦ తాగునీటి, ఆహార అవసరాలను సమర్థంగా తీరుస్తున్నాయి. ♦ వాతావరణాన్ని నియంత్రిస్తూ జీవజాలానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ♦ ప్రాణికోటి మనుగడకు అత్యవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తికి ఇవి ప్రధాన వనరులు. ♦ ఈ హాట్స్పాట్లు అతి పెద్ద పర్యాటక ఆకర్షణలు. తద్వారా స్థానికులకు ఆర్థికంగా పెద్ద ఆలంబనగా నిలుస్తున్నాయి. ♦ ఇక ఈ హాట్ స్పాట్స్‌కు మూలమైన అడవుల మీద దేశ జనాభాలో 22 శాతం మంది తమ జీవికకు, సామాజిక, సాంస్కృతిక అవసరాలకు పూర్తిగా ఆధారపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గంజాయి అక్రమ రవాణాకు హాట్‌స్పాట్స్‌గా మారుతున్న రైళ్లు
-
థర్డ్ వేవ్‌కు మార్కెట్లే హాట్స్పాట్లా?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో తీవ్రంగా ప్రభావితమైన దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులుగా పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో రోజువారీగా పాజిటివ్ కేసులు దాదాపు వందలోపే నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదు కావడంతో లాక్డౌన్ సమయంలో కరోనా భయంతో ఇళ్లకే పరిమితమైన ఢిల్లీ వాసుల వ్యవహారశైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లరాదన్న ప్రోటోకాల్స్‌ను చాలామంది తుంగలో తొక్కేస్తున్నారు. కరోనా వచ్చే ముందు ఏవిధంగా ఢిల్లీలోని మార్కెట్లు కిటకిటలాడాయో, ఇప్పుడూ అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని చూస్తుంటే ప్రజల్లో కరోనా పట్ల భయం ఏమాత్రం లేదన్నదని స్పష్టంగా అర్థమౌతోంది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో కరోనా మూడో వేవ్ వస్తుందనే అంచనాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా రాబోయే కొద్ది నెలల్లో దేశంలో మూడో వేవ్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఊహాగానాల మధ్య ప్రజలు తమ షాపింగ్ ఆసక్తిని ఏమాత్రం తగ్గించుకోవట్లేదనేది ఇక్కడ పరిశీలించాల్సిన అంశం. ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమై, మార్కెట్లు తెరుచుకున్నప్పటి నుంచి షాపింగ్‌కు వెళ్లే ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీంతో లజ్‌పత్‌నగర్, సరోజిని నగర్, సదర్ బజార్‌తో సహా ఢిల్లీలోని అనేక మార్కెట్లలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం, ప్రజల అలసత్వం కారణంగా ఇవి మూడో వేవ్‌కు హాట్స్పాట్లుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గత నెలలో జరిగిన ఒక విచారణ సందర్భంగా, ఢిల్లీ హైకోర్టు సైతం కోవిడ్ విషయంలో మార్కెట్లలో నెలకొన్న నిర్లక్ష్యంపై పదునైన వ్యాఖ్యలు చేసింది. దీంతో జనసాంద్రత ఎక్కువగా ఉండే జనపథ్ , కన్నాట్ ప్లేస్ , కరోల్‌బాగ్, సరోజిని నగర్, సదర్ బజార్ ,లజ్‌పత్ నగర్, చాందిని చౌక్, ఐఎన్ఏ మార్కెట్, పట్‌పడ్ గంజ్, లక్ష్మీ నగర్ వంటి మార్కెట్లపై ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మార్కెట్లలో ప్రజలు భౌతిక దూరం పాటించే పరిస్థితి మాత్రం కనిపించదు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఈ మార్కెట్లు కరోనా హాట్స్పాట్లుగా మారే అవకాశాలున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్‌లాక్–1 ప్రకటన సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మార్కెట్లే కాక మంగోల్‌పురి, మధు విహార్, త్రినగర్, పహాడ్‌గంజ్ మెయిన్ బజార్, పాత ఢిల్లీ మార్కెట్, సఫ్దర్‌జంగ్ మార్కెట్ సమీపంలోని దక్షిణ ఢిల్లీ మార్కెట్, ఇండియా గేట్ సమీపంలోని న్యూ ఢిల్లీ మార్కెట్, కన్నాట్ ప్లేస్ ఎదురుగా ఉన్న ఎం బ్లాక్ మార్కెట్, డిఫెన్స్ కాలనీ దగ్గర ఉన్న దక్షిణ ఢిల్లీ మార్కెట్లలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విషయంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. లజ్‌పత్ నగర్ మార్కెట్ మూసివేత కోవిడ్ నియమాలను పాటించని కారణంగా లజ్‌పత్‌నగర్, సరోజిని నగర్ సహా ఇతర మార్కెట్ల మూసివేతపై ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) నోటీసులు జారీ చేసింది. ఈ మార్కెట్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోవడమే కాకుండా, వందలాది మంది విక్రేతలు మార్కెట్లో అక్రమంగా వస్తువులను విక్రయిస్తున్నారని స్థానిక దుకాణాదారులు ఎన్డీఎంసీకి లేఖ రాశారు. అదే సమయంలో ఢిల్లీలోని అన్ని జిల్లాల అధికారులకు అందుతున్న ఫిర్యాదుల మేరకు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించని మార్కెట్లు, షాపులపై దాడి చేసి సీల్ చేస్తున్నారు. అయితే మూడో వేవ్ ఊహాగానాల నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అపే విషయంలో పాలనా యంత్రాంగం, వ్యాపారస్థుల ముందు పెద్ద సవాలు ఉంది. దుకాణదారులు వ్యాపారంతో పాటు కరోనా సంక్రమణ నివారణపై దృష్టిపెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఇప్పటివరకు 14,34, 608 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 14,08,699 మంది రోగులు నయమయ్యారు. రికవరీ రేటు 98.18 శాతంకు చేరింది. అదే సమయంలో, మృతుల సంఖ్య 24,997కు పెరిగింది. ఢిల్లీలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 695కి చేరింది. -
కునుకులేని అమెరికా
మేలో అంతా బాగానే ఉందనుకున్నారు. ఆంక్షలు సడలించారు, మార్కెట్లు బార్లా తెరిచేశారు. కంటికి కనిపించని శత్రువుపై విజయం సాధించామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ జూన్‌లో సగర్వంగా ప్రకటించారు. సెకండ్ వేవ్ ప్రశ్నే లేదంటూ ధీమాగా చెప్పారు. పదిహేను రోజులు గడిచాయో లేదో కరోనా కేసులు రెట్టింపు వేగంతో పెరిగిపోయాయి. దక్షిణ, పశ్చిమాది రాష్ట్రాలు కొత్త హాట్స్పాట్లుగా మారాయి. 39 లక్షల 19 వేల కేసులు, లక్షా 43 వేల మృతులతో అమెరికా నిద్రలేని దేశంగా మారింది. వాషింగ్టన్ : ఒకప్పుడు రోజుకి 20 వేల కరోనా కేసులు నమోదైతేనే అందరూ హడలెత్తిపోయారు. కోవిడ్ ధాటికి అంతటి అగ్రరాజ్యం విలవిలలాడిపోయింది. అలాంటిది కళ్ల ముందే ప్రతీ వారం కొత్త రికార్డులు బద్దలవుతున్నాయి. రోజుకి 30 వేలు, 40 వేలు, 50 వేలు అలా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ప్రతీరోజూ 60 నుంచి 70వేల కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చేసింది. యూరప్‌లో నమోదవుతున్న కేసుల కంటే అయిదు రెట్లు ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల వెన్నులో కరోనా వణుకు పుట్టిస్తోంది. 50 రాష్టాలకుగాను 40 రాష్ట్రాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. గత రెండు వారాల్లోనే కేసుల్లో 50% పెరుగుదల కనిపిస్తే, మరణాల రేటు 46% పెరిగింది. కొత్త హాట్స్పాట్లు ఏప్రిల్, మే నెలల్లో న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తే ఇప్పుడు అరిజోనా, ఫ్లోరిడా, టెక్సాస్, జార్జియా, అలబామా, లూసియానా వంటి రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఈ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ పాకింది. అరిజోనాలో వారం రోజుల్లోనే 27% కేసులు పెరిగాయి. ఫ్లోరిడా, సౌత్ కరోలినాలో 19% పెరుగుదల కనిపిస్తోంది. టెక్సాస్‌లో 18%, జార్జియాలో 17% పెరుగుదల కనిపిస్తోంది. అప్పుడూ, ఇప్పుడూ కూడా కాలిఫోర్నియాను కరోనా కకావికలం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఏకంగా 27% కేసులు పెరుగుతున్నాయి. టెక్సాస్‌లో రెండు వారాల లాక్డౌన్ విధించారు. కాలిఫోర్నియాలో రెస్టారెంట్లు, బార్లు, చర్చిలు మూసివేశారు. లూసియానా, అలబామా, మోంటానాలో ఇల్లు దాటి బయటకు వస్తే మాస్క్ తప్పనిసరి చేశారు. అరిజోనా, టెక్సాస్, ఫ్లోరిడాలలో మరణాల రేటు అత్యధికంగా ఉంది. ఎందుకీ పెరుగుదల? ►దేశ ఆర్థిక వ్యవస్థా? ప్రజారోగ్యమా? దేనికి ప్రాధాన్యతనివ్వాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థికానికే ప్రాధాన్యమని కుండబద్దలు కొట్టేశారు. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మార్కెట్లన్నీ ఆదరాబాదరాగా తెరిచేశారు. ►కరోనాని కట్టడి చేయడంలో ముఖ్యపాత్ర పోషించే మాస్కుల చుట్టూ రాజకీయాలు నడిచాయి. డెమొక్రాట్ పార్టీకి చెందిన సెనేటర్ లామర్ అలెగ్జాండర్ మీరు ట్రంప్‌కి అనుకూలమైతే మాస్కులు వేసుకోకండి, వ్యతిరేకమైతే మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. అమెరికన్లలో అత్యధికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం అంటే తమ స్వేచ్ఛ హరించినట్టేనన్న భావనలో ఉన్నారు. ►కేసులు ఎక్కువైతే హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుందని ప్రజలు విశ్వసించారు. ప్రపంచంలో అతి పెద్దదైన వరల్డ్ డిస్నీ పార్క్, బీచ్‌లు, క్లబ్బుల్లో జన ప్రవాహమే కనిపించింది. ►అధ్యక్ష ఎన్నికల ప్రచారం, నిధుల సేకరణతో రాజకీయపరమైన కార్యకలాపాలు జోరందుకున్నాయి. ►జాతి వివక్ష వ్యతిరేక ప్రదర్శనల్లో కూడా ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం అగ్రరాజ్యం కొంప ముంచాయి. ఇక రోజుకి లక్ష కేసులు? అమెరికాలో కేసుల పెరుగుదల చూస్తుంటే రోజుకి లక్ష కేసులు నమోదయ్యే రోజు ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది. రానున్న శీతాకాలంలో అమెరికాలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించడానికే భయంగా ఉందని డైరెక్టర్ ఆఫ్ ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) డాక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాని కట్టడి చేయడంలో అమెరికా చాలా తప్పుదారిలో నడుస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజలు తమ తీరు మార్చుకోకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిపుణుడు ఆంటోని ఫాసీ హెచ్చరించారు. -
కొత్త హాట్‌స్పాట్స్!
-
లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్‌కు అడ్డుకట్టపడకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఈ నెల (మే 31 ) చివరి వరకు లాక్డౌన్ పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ముంబై, పూణే, మాలెగావ్, ఔరంగాబాద్, సోలాపూర్ వంటి హాట్‌స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశంపై చర్చించామని రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రదేశాల్లో లాకడౌన్ 3.0 ముగిసేలోపు కేంద్రం ప్రకటించే మార్గదర్శకాలకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. (లాక్డౌన్ పొడగింపు : 200 పాయింట్లు పతనం ) కాగా బుధవారం రాత్రికి మహారాష్ట్రలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 25922 కు చేరగా, 975 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వైరస్ కారణంగా 596 మంది మరణించారు. మరోవైపు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో కరోనా వైరస కేసుల సంఖ్య 81970 కు చేరగా, మరణాల సంఖ్య 2649 చేరింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడవ దశ లాక్డౌన్ మే17వతేదీతో ముగియనుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో లాక్డౌన్ కొనసాగనుందని సూచించిన సంగతి తెలిసిందే. చదవండి : మూడ్ లేదు.. ఇక తెగతెంపులే వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు -
మే నెల అత్యంత కీలకం
న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్-19)పై జరుగుతున్న పోరులో మే నెల అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. హాట్‌స్పాట్స్‌ను కఠినంగా నియంత్రించడం, గ్రీన్‌జోన్స్‌ను సురక్షితంగా కాపాడుకోవడమన్న రెండు అంశాలు అమీతుమీ తేల్చేస్తాయని వీరు అభిప్రాయపడ్డారు. రైల్వే, విమాన ప్రయాణం, అంతర్రాష్ట బస్సు సర్వీసులను మే నెల మొత్తం బంద్ చేయడమే మేలని స్పష్టం చేశారు. కరోనాపై పోరు కొనసాగిస్తూ రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలని ప్రధాని వ్యాఖ్యానించడం తెల్సిందే. (రష్యా ప్రధానికి కరోనా) లాక్డౌన్ నుంచి సడలింపులు ఉంటాయన్న వార్తలు వస్తున్న తరుణంలో వైద్య నిపుణులు కంటైన్మెంట్ జోన్లు, గ్రీన్‌జోన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందేనని చెబుతున్నారు. దేశంలో రెండు వారాల క్రితం సుమారు 170 హాట్‌స్పాట్ జిల్లాలు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 129కి తగ్గాయి. ఇదే సమయంలో గ్రీన్జోన్లు 325 నుంచి 307కు, తగ్గిపోగా, ఆరెంజ్ జోన్లు 207 నుంచి 297కు పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వైరస్ నాశనం కాదని, వ్యాప్తిని నియంత్రించగలమన్నది గుర్తించాలని, కాబట్టి రెడ్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించడం మేలని, అదే సమయంలో గ్రీన్జోన్లలో నియంత్రణలు ఎత్తివేసి.. రెడ్జోన్ల వారు అక్కడికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రి అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్ కుమార్ గుప్తా తెలిపారు. (సొంతూరికి దారేది?) శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సర్జన్ అయిన డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ, ప్రజా రవాణా వ్యవస్థలతోపాటు మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, మతపరమైన ప్రాంతాలపై నిషేధం కొనసాగాలని సూచించారు. గ్రీన్జోన్ల సరిహద్దులను మూసివేయడంతోపాటు భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు తొడుక్కోవడం వంటి నిబంధనలను అక్కడ పాటించేలా చూడాలని అరవింద్ తెలిపారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో అవి తగ్గేదాకా లాక్డౌన్ కొనసాగాలని అన్నారు. లాక్డౌన్ మరో నాలుగు వారాలపాటు ఉంటే బాగుంటుందని, కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ దశలో లాక్డౌన్ ఎత్తివేయడం సరికాదని మ్యాక్స్ హెల్త్‌కేర్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రోమెల్ అభిప్రాయపడ్డారు. గ్రీన్జోన్లలో కొంత ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం కల్పించాలని అన్నారు. (ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ) భిన్నాభిప్రాయాలు లాక్డౌన్ ఎత్తివేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ జనాభాలో యువత 44 శాతం ఉండడం, ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైబడి ఉండడం, క్షయ వ్యాధిని నిరోధించే బీసీజీ టీకాలు తీసుకోవడం, కరోనా వైరస్ స్ట్రెయిన్స్‌లో ఉన్న తేడాలు తదితర కారణాలతో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందన్న వాదనలు ఉన్నాయి. అందుకే భౌతిక దూరం, పారిశుద్ధ్యం చర్యల్ని పకడ్బందీగా తీసుకొని దశలవారీగా లాక్డౌన్ ఎత్తేయాలని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ మరో వాదనను వినిపిస్తోంది. భారత్ ఇప్పటివరకు వైరస్‌ని తొక్కి పట్టి ఉంచిందని, 130 కోట్ల జనాభా ఉన్న దేశం లాక్డౌన్ ఎత్తేస్తే వ్యాధి మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ అధ్యక్షుడు సమీర్ శరణ్ హెచ్చరించారు. ఈ వైరస్ పూర్తిస్థాయి నిర్మూలనకి ఏడాది పడుతుందని లాక్డౌన్ ఎత్తేసే సమయంలో కట్టుదిట్టమైన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. -
లాక్డౌన్లో మరిన్ని సడలింపులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గుర్తించిన కోవిడ్–19 హాట్స్పాట్లు, కట్టడి జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తూ ఈ నెల 15వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం మరికొన్ని సడలింపులను చేర్చింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాలు గుర్తించిన కంటైన్మెంట్ జోన్లకు ఈ సడలింపులు వర్తించవని తెలిపింది. హాట్స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లపై గతంలో ప్రకటించిన ఆంక్షలు మే 3వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది. రెస్టారెంట్లు, హెయిర్ సెలూన్లు తెరవరాదనీ, మద్యం, సిగరెట్లు, గుట్కా అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి సడలింపులపై అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొంది. అత్యవసర వస్తువులను సరఫరా చేసే ఈ–కామర్స్ సంస్థలకు సడలింపు కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలు (పురపాలక సంఘాల వెలుపలి ప్రాంతాలు): గ్రామీణ ప్రాంతాల్లోని రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదై ఉన్న షాప్స్. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, మార్కెట్ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ సడలింపు వర్తిస్తుంది. అయితే సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్‌కు మాత్రం ఇది వర్తించదు. అంటే షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లోని వాటికి వర్తించదు. అలాగే 50% మించకుండా సిబ్బంది పనిచేయాలి. వారంతా మా స్కులు ధరించి ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదై ఉన్న షాప్స్‌కు సడలింపు వర్తిస్తుంది. ఇరుగుపొరుగున ఉన్న షాపులు, స్టాండ్ ఎలోన్ షాపులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లలో ఉన్న షాపులకూ ఇది వర్తిస్తుంది. ఈ జాబితాలో దుస్తులు, సెల్‌ఫోన్, హార్డువేర్, స్టేషనరీ దుకాణాలు తెరవచ్చు. అయితే, మార్కెట్ కాంప్లెక్స్‌లలోని షాపులకు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని షాపులకు, సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్‌కు ఇది వర్తించదు. అలాగే 50 శాతం మించకుండా సిబ్బంది పనిచేయాలి. వారంతా మాస్కులు ధరించి ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. -
ఏపీ, తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్, ఆరెంజ్ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్జోన్లు, 207 జిల్లాలను ఆరెంజ్ జోన్లగా గుర్తించింది. 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు, అలాగే 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్చుతామని కేంద్రం పేర్కొంది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి రెండు జాబితాలుగా విభజించింది. (హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు) ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్ జాబితాలో చేర్చింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. ఏపీలో రెడ్‌జోన్ జిల్లాల వారిగా కర్నూలు గుంటూరు నెల్లూరు ప్రకాశం కృష్ణా వైఎస్ఆర్ కడప తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి చిత్తూరు విశాఖపట్నం అనంతపురం ఇక తెలంగాణలో ఎనిమిది జిల్లాలను రెడ్‌జోన్ జాబితాలో చేర్చింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. హాట్‌స్పాట్ క్లస్టర్‌గా నల్లగొండ జిల్లాను కేంద్రం గుర్తించింది. తెలంగాణలో రెడ్‌జోన్ జిల్లాలు హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ అర్బన్ రంగారెడ్డి జోగులాంబ గద్వాల మేడ్చల్ కరీంనగర్ నిర్మల్ తెలంగాణలో 19 జిల్లాలను ఆరెంజ్ జోన్ల జాబితా సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలు ఉన్నాయి. -
కరోనా: పంచ సూత్రాలు పాటించాల్సిందే
సాక్షి, నిజామాబాద్ : రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. అందుకుగాను ఆదివారం నుంచి నగరంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలు కరోనా నివారణకు పంచసూత్రాలను పాటించాలని స్పష్టం చేశారు. ఆయన శనివారం తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ పంచా సూత్రలను వివరించారు. 1. పిల్లలు, పెద్దలందరూ కుటుంబ సభ్యులతో కలసి ఇంట్లోనే ఉండాలి. 2. పిల్లలను మార్కెట్‌కు తీసుకుని రావొద్దు. 3. ఇంట్లో నుంచి బయటకు వెళితే తప్పకుండా మాస్క్‌లు ధరించాలి. ప్రీ ప్లేయర్, సర్జికల్ మాస్క్‌లు వాడాలి. భౌతిక దూరం పాటించాలి. 4. బయట నుంచి ఇంట్లోకి వెళ్లగానే సబ్బుతో తప్పకుండా మోచేతి వరకు చేతులు శుభ్రం చేసుకోవాలి. 5. ఎవరికైనా జ్వరం, దగ్గు ఉంటే వెంటనే సమాచారం అందించాలి. అని వివరించిన మున్సిపల్ కమిషనర్ ఆదివారం నుంచి సూపర్మార్కెట్లు, రిలయన్స్ మార్ట్, జనరల్ స్టోర్స్, కిరాణా షాపులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే అమ్మకాలు జరపాలని, ఆ తర్వాత బంద్ పాటించాలని స్పష్టం చేశారు. ఒక్క మెడికల్ షాపులు మాత్రం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. హాట్‌స్పాట్ జోన్లలో.. నగరంలో ప్రకటించిన కంటైన్మెంట్ క్లస్టర్ (హాట్‌స్పాట్) ఏరియాల్లో బారికేడ్లు కట్టి ఆ ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రోన్లతో స్ప్రే.. కంటైన్మెంట్ క్లస్టర్లు, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా స్ప్రే చేయిస్తామని కమిషనర్ తెలిపారు. ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వారి రక్త నమునాలను సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపుతున్నట్లు తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. నగరంలోని ప్రజలకు తక్కువ ధరలకు కూరగాయలు అందించేందుకు ప్రత్యేకంగా శివాజీనగర్‌లోని ఐటీఐ ఆవరణలో కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. సంచార కూరగాయల విక్రయాలు కూడా జరుపుతున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరిస్తే కరోనా నియంత్రించవచ్చని ఆయన కోరారు. -
అన్ని దారులూ బంద్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో హాట్‌స్పాట్ (కంటైన్మెంట్) ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు గృహనిర్బంధంలో ఉండిపోయారు. వారిని ప్రభుత్వం పూర్తిగా హోం క్వారంటైన్‌కు పరిమితం చేసింది. తెలంగాణలో వివిధ జిల్లాల్లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం 130 హాట్స్పాట్లను ప్రకటించింది. శుక్రవారం ఆయా ప్రాంతాల్లో నిర్ణీత ప్రదేశం మేరకు పూర్తిగా అష్టదిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ ఎటూ వెళ్లకుండా చర్యలు చేపట్టింది. అక్కడున్న ప్రజలకు అవసరమైన పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను కూడా ప్రభుత్వ యంత్రాంగమే సమకూరుస్తోంది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల డ్రోన్లను వినియోగిస్తూ పోలీసులు పహారా కాస్తున్నారు. వైద్య బృందాలు ఇళ్లకు వెళ్లి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న వారిని గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. కేసులు ఎక్కువ ప్రాంతాల్లో... రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 27 జిల్లాలకు విస్తరించగా అందులో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, గద్వాల, కరీంనగర్, నిర్మల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వైరస్ వ్యాప్తి తక్కువగానే నమోదైనప్పటికీ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు, వారి కుటుంబీకుల ద్వారా అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎక్కడెక్కడ అత్యధికంగా పెరిగాయో ఆయా ప్రాంతాలను ప్రభుత్వం హాట్స్పాట్లుగా గుర్తించింది. కనీసం రెండు, మూడు కేసులు మొదలుకొని గరిష్టంగా ఐదు కేసులు నమోదైన ప్రాంతాలను ఒక్కో హాట్‌స్పాట్‌గా పరిగణించింది. అలా రాష్ట్రంలో 130 హాట్స్పాట్లను గుర్తించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. లాక్డౌన్ అమలులో కనీసం ఏదైనా అవసరానికి బయటకు వెళ్లడానికి వీలుండగా హాట్‌స్పాట్ ప్రాంత ప్రజలు ఎటూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మొత్తం 2.88 లక్షల ఇళ్లను గుర్తించారు. ఒక్కో ఇంట్లో సరాసరి ఐదుగురు సభ్యులుంటారని అంచనా వేశారు. ఆ ప్రకారం 14.40 లక్షల మంది అష్టదిగ్బంధంలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో 3,116 వైద్య బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయి. ఒక్కో వైద్య బృందంలో ఇద్దరు సభ్యులున్నారు. పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. 14 రోజులు ఇంటిపట్టునే ఉండాలి.. 130 హాట్స్పాట్లలో ఉండే లక్షలాది మంది ప్రజలు నిర్ణీత తేదీ నుంచి 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాలి. కేసుల తీవ్రతను బట్టి జిల్లా అధికారులు హాట్స్పాట్లను మ్యాపింగ్ చేశారు. దాని పరిధిని కిలోమీటర్ నుంచి మూడు కిలోమీటర్ల వరకు నిర్ధారించారు. వైద్య, పోలీసు బృందాలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటయ్యాయి. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 30 ఇళ్లను కవర్ చేస్తారు. హాట్స్పాట్లలో కొన్ని కేసులున్న సాధారణ ప్రాంతాల్లో 50 ఇళ్లను పర్యవేక్షిస్తారు. పీహెచ్సీ వైద్యులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక్కో హాట్‌స్పాట్ ఏరియాలో తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడి ప్రజల్లో ఎవరికైనా అనుమానిత లక్షణాలుంటే వారిని గుర్తించి అవసరాన్ని బట్టి ఆస్పత్రులకు పంపిస్తారు. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలు గుర్తించినప్పుడు ఎవరికివారు ఇళ్లలోనే వేర్వేరు గదుల్లో ఉండాలని సూచిస్తారు. హాట్స్పాట్లలో నిరంతరం పర్యవేక్షించేందుకు అవసరమైన వాలంటీర్లు, సహాయకులను జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతోపాటు బ్లీచింగ్ పౌడర్‌తో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించడానికి టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. జిల్లాలవారీగా హాట్‌స్పాట్ ప్రాంతాలు... – ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్ జిల్లాలను రక్షిత ప్రాంతాలుగానే గుర్తించారు. అయితే సంగారెడ్డి జిల్లాలోని 7 ప్రాంతాలను హాట్‌స్పాట్ కేంద్రాలుగా గుర్తించారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్, కొత్త బస్టాండ్ సెంటర్, అంగడిపేట్, జహిరాబాద్ టౌన్, జహిరాబాద్ పట్టణంలోని గడిమాహేళా, కొండాపూర్, సంగారెడ్డి పట్టణంలోని మధురానగర్ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. – ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17 హాట్స్పాట్లు ఉన్నాయి. వరంగల్ అర్బన్‌లో జులైవాడ, సుబేదారి, ఈద్గా, కుమార్‌పల్లి, మండి బజార్, పోచమ్మ మైదాన్, చార్‌బౌళి, కాశిబుగ్గ, గణేష్ నగర్, నిజాంపుర, లక్ష్మీపురం, రంగంపేట, శంభునిపేట, బాపూజీనగర్, చింతగట్టు క్యాంపులను ఏర్పాటు చేశారు. – జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రం హాట్‌స్పాట్‌గా ఉంది. – జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎం.డీ.కాలనీ మిలీనియం క్వార్టర్స్‌ను హాట్‌స్పాట్‌గా గుర్తించారు. – మహబూబాబాద్ జిల్లాలో గడ్డిగూడెం, పక్కనున్న తండాను కంటైన్మెంట్ జోన్ పరిధిలో చేర్చారు. – ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 14 హాట్స్పాట్లను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు, షాహిన్‌నగర్, క్యూబా కాలనీ, ఎంఎం పహాడ్, దుబ్బచర్ల, మణికొండ (ఆరు) ఏరియాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించారు. వికారాబాద్ టౌన్లో రాజీవ్ నగర్, మధుకాలనీ, ఇసాక్‌ఖాన్ బాగ్, తాండూరు పట్టణంలోని శాంతి నగర్, ఇందిరమ్మ కాలనీ, పరిగి పట్టణంలోని వల్లబ్ నగర్, ఎన్టీఆర్ నగర్, మర్పల్లిలో హాట్స్పాట్లు ఉన్నాయి. – నిజామాబాద్ జిల్లాలో 19 ప్రాంతాలను హాట్స్పాట్లుగా ప్రకటించారు. నిజామాబాద్‌లో హైమద్‌పుర, బర్కత్‌పుర, గౌతంనగర్, ఎల్లమ్మగుట్ట, మాలపల్లి, ఆటోనగర్, ఖిల్లా రోడ్, హబీబ్‌నగర్, చంద్రశేఖర్కాలనీలు ఉన్నాయి. ఇక బోధన్‌లో శక్కర్‌నగర్, రాకాసిపేట్, శక్కర్‌నగర్ చౌరస్తా ఉన్నాయి. రెంజల్లో కందకుర్తి గ్రామం (9వ వార్డు), మోస్రాలో 9వ వార్డు, మాక్లూర్‌లో మైనారిటీ కాలనీ, నందిపేటలో బర్కత్‌పుర, భీంగల్‌లో బొదిరెగల్లీ, బాల్కొండలో ఆత్తర్గల్లీ, ఆర్మూర్‌లో జిరాయిత్నగర్ ఉన్నాయి. – కామారెడ్డి జిల్లాలో మూడు ప్రాంతాలను హాట్‌స్పాట్ క్లస్టర్లుగా గుర్తించారు. బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీ, ఆరాఫత్కాలనీ, మదీనా కాలనీ వీటి పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 హాట్స్పాట్లు ఉన్నాయి. కరీంనగర్లో ఇండోనేసియన్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలగానే ముకరంపురా, కశ్మీర్‌గడ్డ ప్రాంతాలను మార్చి 19 నుంచే రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రభుత్వం తాజాగా హాట్స్పాట్ల నిర్ణయంతో ఈ రెండు ప్రాంతాలతోపాటు హుస్సేనిపురా, మంకమ్మతోటలను కూడా కంటైన్మెంట్ క్లస్టర్ల జాబితాలో చేర్చారు. హుజూరాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీ, మార్కెట్ ఏరియా, విద్యానగర్, మామిండ్లవాడలోని 1,620 ఇళ్లను ఈ పరిధిలోకి తెచ్చారు. – పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ అన్నపూర్ణ నగర్ కాలనీ, గోదావరి ఖనిలను హాట్స్పాట్లుగా ప్రకటించి ఆ ప్రాంతాలను మూసివేశారు. – జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ, కల్లూరు గ్రామాలలో హాట్స్పాట్లను ఏర్పాటు చేశారు. – ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ అర్బన్ (19 వార్డులు), నేరడిగొండ మండలం (మూడు గ్రామాలు), ఉట్నూర్ మండలం (ఐదు గ్రామాలు) పరిధిలో 72,666 మంది ప్రజలను హోంక్వారంటైన్‌కు పరిమితం చేశారు. – నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజుల్పేట్, మొఘల్‌పుర, గుల్జార్ మార్కెట్, జోహ్రానగర్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. భైంసా పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన మదీనాకాలనీ, పాండ్రి గల్లీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. – ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. నల్లగొండ పట్టణం పరిధిలో మీర్ బాగ్ కాలనీ, రహమత్ నగర్, బర్కత్‌పుర, మాన్యం చెలక, మిర్యాలగూడ పట్టణంలో సీతారాంపురం, దామరచర్ల మండలంలో దామరచర్ల ఈ జాబితాలో ఉన్నాయి. – సూర్యాపేట జిల్లాలో 4 హాట్స్పాట్లు ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలో కుడకుడ, భగత్‌సింగ్ నగర్, కొత్తగూడెం బజార్, నాగారం మండలంలో వర్ధమానుకోట ఉన్నాయి. – మహబూబ్‌నగర్ జిల్లాలో 5 ప్రాంతాలను హాట్‌స్పాట్ కేంద్రాలుగా గుర్తించారు. రామయ్య బౌళి, మర్లు, బీకే రెడ్డి కాలనీ, సద్దలగుండు, షాషాబ్ గుట్ట (కొంత ప్రాంతం)లలో పకడ్బందీ చర్యలు కొనసాగుతున్నాయి. – జోగుళాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అయిజ, శాంతినగర్, రాజోళి ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని 37 వార్డులను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అయిజలో 12, 17, 19, 20 వార్డుల పరిధిలోని కమతంపేట, కాలమ్మపేట, రంగుపేట, తెలుగుపేట, గుర్రంతోట, ఉప్పరిపేట, కుమ్మరిపేట, నదీమ్ మసీద్ కాలనీ, బ్రాహ్మణ వీధి, సంత బజార్, అంబేడ్కర్ కాలనీ, టీచర్స్ కాలనీలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. శాంతినగర్‌లో 7వ వార్డు పరిధిలోని జమ్ములమడుగుకు చెందిన ముగ్గురుకి పాజిటివ్ రాగా, అందులో ఒకరు మృతి చెందారు. దీంతో 7వ వార్డుతో వడ్డెపల్లి, శాంతినగర్ ప్రాంతాల్లోని 3, 4, 5, 6, 8, 8, 10 వార్డులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. రాజోళిలో రెండు కేసులు నమోదవడంతో మండల కేంద్రాన్ని పూర్తిగా కంటైన్మెంట్ జోనుగా ప్రకటించి కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. – నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్ కాలనీని హాట్‌స్పాట్‌గా గుర్తించారు. – కల్వకుర్తి పట్టణంలోని బలరాంనగర్, సుభాష్ నగర్ ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించారు. – ఖమ్మం జిల్లాలో హాట్‌స్పాట్ ప్రాంతాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతీ తెలిపారు. అయితే కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో హాట్‌స్పాట్ తరహాలోనే ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలతోపాటు ప్రజలు స్వీయ నిర్బంధం పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖిల్లా, పెద్దతండా ప్రాంతాల ప్రజలు బయటికి రావద్దని కోరారు. -
లాక్డౌన్ మరింత కట్టుదిట్టం
-
రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్ క్లస్టర్లు
సాక్షి, హైదరాబాద్ : కరోనా కేసులు రోజురోజుకూ పదుల సంఖ్యలో వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం కరీంనగర్ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అనుసరించేందుకు సిద్ధమైంది. కరోనా కేసులు అధికంగా ఉన్న 130 ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించింది. వీలైనంత త్వరగా ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు బుధవారమే ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇదే అత్యుత్తమ విధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలుత కరీంనగర్లో ఇదే ఫార్ములాతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో పోలీసులు, ఆరోగ్య శాఖ విజయవంతమయ్యాయి. కానీ మర్కజ్ యాత్రికుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు ఏం చేస్తారంటే..? కరోనా హాట్స్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఈ ప్రాంతాల నుంచి కేసులు అధికంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు కాలనీ, డివిజన్ లేదా ఊరు మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. సదరు ప్రాంతానికి దాదాపు కిలోమీటరు ప్రాంతంలో ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. జనసంచారం పూర్తిగా నిషిద్ధం. సూటిగా చెప్పాలంటే ఆ ప్రాంతం మొత్తం హోం క్వారంటైన్ అయినట్లే. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రాంత వాసులంతా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఎవరికైనా అత్యవసర సమస్యలు ఉత్పన్నమైతే పోలీసులకు సమాచారమివ్వాలి. అందుకు ప్రత్యేకంగా నంబర్లు ఇస్తారు. రోజూ నిత్యావసరాలు ఇంటికే వస్తాయి. ఈ బాధ్యతలన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లు, మార్కెటింగ్, పౌరసరఫరాలు, బల్దియాలు సమన్వయం చేసుకుని పోలీసుల సమక్షంలో పంపిణీ చేస్తాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో 12 ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎంత కాలం అంటే.. సాధారణంగా 14 రోజుల పాటు ఆయా ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇంటింటి సర్వే చేస్తారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ 14 రోజుల్లో ఏ రోజు పాజిటివ్ కేసులు వెలుగుచూసినా మరో 14 రోజులు దిగ్బంధనం పెంచుతారు. ఉదాహరణకు చివరి రోజు ఒక్క కేసు వెలుగుచూసినా.. మరో రెండు వారాలు ఆ ప్రాంత వాసులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. పూర్తిగా ఆ ప్రాంతాల్లో ప్రజలందరికీ నెగెటివ్ వచ్చే వరకు పోలీసుల కనుసన్నల్లోనే ఉంటాయి. -
కరోనా: అక్కడ పూర్తిగా లాక్డౌన్!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 343కు చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో 15 జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను (హాట్స్పాట్లు) ఈ నెల 15వ తేదీ వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్కే తివారి బుధవారం ప్రకటించారు. హోమ్ డెలివరీ, వైద్య బృందాలను మాత్రమే ఇక్కడికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో ఒకరి నుంచి మరొకరి కోవిడ్ సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడించారు. లక్నో, ఆగ్రా, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ నగర్(నోయిడా), కాన్పూర్, వారణాసి, షామ్లి, మీరట్, బరేలీ, బులంద్‌షహర్, ఫిరోజాబాద్, మహరాజ్‌గంజ్, సీతాపూర్, సహరన్పూర్, బస్తీ జిల్లాల్లోని హాట్స్పాట్లను మూసివేసినట్టు తెలిపారు. మొత్తం జిల్లాలను మూసివేయడం లేదని, హాట్స్పాట్ల వరకే ఇది పరిమితమని హెంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్ అవస్థి స్పష్టం చేశారు. అలాగే ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న 20 హాట్స్పాట్లు మూసివేశారు. (ఆ ప్రచారం తప్పు: ప్రధాని మోదీ) ఆగ్రాలో 22, ఘజియాబాద్‌లో 13, లక్నో, కాన్పూర్, నోయిడాల్లో 12, మీరట్‌లో 7, వారణాసి, షహరన్‌పూర్, మహరాజ్‌గంజ్‌లలో 4, షామ్లి, బులంద్‌షహర్, ఫిరోజాబాద్, బస్తిల్లో 3 చొప్పున హాట్స్పాట్లను గుర్తించినట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. అత్యవసర సేవలు, మీడియా సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇళ్లలోని వారు బయటకు రాకుండా ఆంక్షలు ఉంటాయి. ప్రతి ఇంటిని శానిటైజ్ చేస్తారు. (కరోనా: లాక్డౌన్ కొనసాగించాలి) -
కరోనా: శ్రీకాకుళంలో ఏడు హాట్ స్పాట్లు
సాక్షి, శ్రీకాకుళం: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ మాట ఎలా ఉన్నా.. చీమ చిటు క్కుమన్నా పట్టేసుకునే వ్యూహాన్ని అధికారులు అనుసరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి 6 వేలమందికి పైగా జిల్లాలోకి వచ్చా రు. అధికారులు దాదాపుగా వారందరినీ గుర్తించి.. హోమ్, ప్రత్యేక క్వారంటైన్లో పెట్టారు. జిల్లాలో ఇంతవరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అలాగని మనం సురక్షితమని చెప్పలేం. ఎప్పుడెవరు, ఎక్కడి నుంచి జిల్లాలో ప్రవేశిస్తారో చెప్పలేని పరిస్థితి. విదేశాలు, ముంబాయి, ఢిల్లీ నుంచి వచ్చిన వారితో ఎటువంటి ముప్పు వాటిల్లుతుందో అంచనా వేయలేం. అందుకే జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద తీవ్రతను గమనించి జిల్లాలో ఏడు హాట్ స్పాట్లను గుర్తించారు. వాటిపై నిరంతర నిఘా పెట్టారు. డేంజర్ జోన్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదన్న ఉద్దేశంతో పకడ్బందీగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కలెక్టర్ జె.నివాస్, మరోవైపు జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై దృష్టి సారించారు. హాట్ స్పాట్లపై నిరంతర నిఘా విదేశాల నుంచి జిల్లాకు 1445మంది వచ్చారు. ముంబాయి, ఢిల్లీ, రాజస్థాన్, చెన్నై, బెంగళూరుతోపాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాల నుంచి 6031 మంది ప్రవేశించారు. వీరంతా ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం తొలుత 14 రోజుల క్వారంటైన్ సరిపోతుందని భావించారు. కానీ గుంటూరులో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వ్యక్తికి ఆ తర్వాత పాజిటివ్ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా 14 రోజుల క్వారంటైన్‌ను 28 రోజులకు పెంచారు. వీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా నిర్ణయించారు. శ్రీకాకుళం, పలాస, గార, పోలాకి, ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి మండలాలను ఈ విధంగా గుర్తించి, ఈ ప్రాంతాలపై నిఘా ఎక్కువగా పెట్టడంతోపాటు ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కదలికలను గమనించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రత్యేక బృందాలను నియమించారు. కోవిడ్ ఆఫీస ర్, స్పెషలాఫీసర్లతో సాంకేతికంగా అక్కడి పరిస్థితులను జిల్లా అధికారులు తెలుసుకోనున్నారు. చెక్ పోస్టులతో అడ్డగోలు ప్రవేశాలకు చెక్ బయటి ప్రాంతాల నుంచి వచ్చే వారిని కట్టడి చేయడానికి జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లాలోకి ఎవరూ రాకుండా 27 అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను పటిష్టం చేశారు. పక్కనున్న విజయనగరం జిల్లా నుంచి ఎవరూ ప్రవేశించకుండా ఏడు అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. హైవే ద్వారా ఎవరూ రాకుండా ఎచ్చెర్ల, టెక్కలి, కోట»ొమ్మాళి వద్ద కొత్తగా చెక్ పోస్టులు నెలకొల్పారు. ఎవరైనా వస్తే అక్కడి నుంచి నేరుగా క్వారంటైన్‌కు పంపించనున్నారు. -
దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15తో లాక్డౌన్ ముగియనుంది. ఆ తరువాత?.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందున్న ప్రశ్న ఇది. లాక్డౌన్ ఎలా ఎత్తివేయాలి? కేంద్రం ప్రకటించినట్టు దశలవారీగా ఎత్తివేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? అనే సందేహాలు వైద్యాధికారులను వేధిస్తున్నాయి. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల నుంచి వచ్చిన వారితో అనూహ్యంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి నియంత్రణలోకి వస్తుందా? వస్తే ఎప్పటిలోగా? ఇలాంటి సందేహాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఎలా గైనా లాక్డౌన్ ఎత్తివేయాలనే కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు కొందరు కీలక అధికారులు చెబుతున్నారు. అయితే అదెలా అన్నదే సమస్య. హాట్స్పాట్ల మ్యాపింగ్‌పై దృష్టి ఇప్పుడున్న సమాచారం ప్రకారం కరోనా ప్రభావిత హాట్స్పాట్లు రాష్ట్రంలో 25 ఉన్నట్లు తేల్చారు. అంటే ఈ ప్రాంతాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈనెల 10 నాటికి ఈ హాట్స్పాట్ల సంఖ్య మరో 25 పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. మర్కజ్ మినహా మిగిలిన కేసులు నమోదయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ఈ అంచనా నిజమైతే, 50 హాట్స్పాట్లను తెలంగాణలో మ్యాపింగ్ చేస్తారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను మ్యాపింగ్‌చేసి హాట్స్పాట్లు ప్రకటిస్తారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లాలో నిర్ణీత ప్రాంతాలను గుర్తించి హాట్స్పాట్లను మ్యాపింగ్ చేస్తారు. అలాగే ఏదైనా జిల్లాలోని ఒక మండలంలో కేసు నమోదైతే, దాన్ని హాట్‌స్పాట్‌గా మ్యాపింగ్ చేస్తారు. ఇలా రాష్ట్రంలో పాజిటివ్ కేసులున్న ప్రాంతాలతో హాట్స్పాట్ల మ్యాపింగ్ చేస్తారు. ఈ హాట్స్పాట్ల పరిధిలో ‘కంటైన్మెంట్ ప్లాన్’ను అమలుచేస్తారు. అంటే ప్రజల ఇంటింటికి వెళ్లి కరోనా లక్షణాలున్న అనుమానితులను పట్టుకుంటారు. లక్షణాలుంటే ఆసుపత్రులకు తరలిస్తారు. వైద్య పరీక్షలు చేస్తారు. పాజిటివ్ ఉంటే చికిత్స చేస్తారు. హాట్స్పాట్ల ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగిస్తారు. పదో తేదీ నాటికి రానున్న స్పష్టత ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంది. జనజీవనం అల్లకల్లోలమైంది. వ్యాపారాలు, సంస్థలు, దుకాణాలు, మాల్స్ మూతపడ్డాయి. ఉపాధి కరువై సాధారణ జనం అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో సేవలందక రోగులు నరకయాతన పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలన్నదే సర్కారు ఉద్దేశం. ఇప్పటివరకు మర్కజ్ నుంచి వచ్చిన వారితో 21 జిల్లాలు ప్రభావితమయ్యాయి. మిగిలిన జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అత్యధికంగా హైదరాబాద్, వరంగల్ అర్బన్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సగానికి పైగా కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నాయి. ఇందులో మర్కజ్ నుంచి వచ్చిన కేసులే ఇప్పుడు 80శాతంపైగా ఉన్నాయి. పైగా ఇప్పటివరకు ఎక్కడా రెండో కాంటాక్ట్ దాటి మూడో వ్యక్తికి కరోనా సోకలేదనే అంచనా ఉంది. అంటే మర్కజ్ నుంచి వచ్చినవారితో కుటుంబసభ్యులు, సమీప బంధువులకు మాత్రమే కరోనా సోకింది. ఇక విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి కూడా వారితో సన్నిహితంగా మెలిగిన వారికే వచ్చింది. అంటే వైరస్ వ్యాప్తి జనసమూహంలోకి ఇంకా వెళ్లిన జాడల్లేవు. కాబట్టి ఈనెల 10 నాటికి మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు, కుటుంబీకులకు, కాంటాక్టులకు వేలాది మందికి పరీక్షలు చేస్తారు. అప్పటివరకు కేసుల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేసులు తగ్గితే దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేత! హాట్‌స్పాట్ ప్రాంతాల మ్యాపింగ్, ఆ ప్రాంతాల ప్రజల ఇళ్లకు వెళ్లి అనుమానితులను గుర్తించడం ద్వారా ఈనెల 10 తర్వాత కేసుల సంఖ్యలోని హెచ్చుతగ్గులను అంచనా చేస్తారు. పదో తేదీ తర్వాత కేసుల సంఖ్యలో తగ్గుదల ఉంటే, 15వ తేదీ తర్వాత విడతల వారీగా లాక్డౌన్ ఎత్తివేసే అవకాశముంది. ప్రపంచంలో అనేక దేశాలు ఇదే చేస్తున్నాయి. కేసుల సంఖ్య రోజుకు ఐదారుకంటే ఎక్కువగా నమోదుకాని పరిస్థితి ఉండాలి. అప్పుడు మ్యాపింగ్ చేసిన హాట్స్పాట్లను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో లాక్డౌన్ ఎత్తివేస్తామని కరోనా ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడొకరు చెప్పారు. అదీ కొన్ని నిర్ణీత కార్యకలాపాల నిమిత్తమే ఎత్తివేస్తారు. అయితే కొన్నాళ్లపాటు రాత్రివేళలో కర్ఫ్యూ కొనసాగిస్తారు. హాట్స్పాట్లలో మాత్రం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చాకే లాక్డౌన్ ఎత్తివేస్తారు. ‘హైదరాబాద్ సహా ఒకట్రెండు జిల్లాల్లో లాక్డౌన్ ఇప్పుడే ఎత్తివేసే పరిస్థితి లేదు. నమోదైన కేసుల్లో ఎక్కువ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మలక్‌పేట మొదలు టోలీచౌక్ వరకు కేసులు గణనీయంగా ఉన్నాయి. మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. ఇక, మిగిలిన ప్రాంతాలలో లాక్డౌన్ ఎత్తివేతపై ఆలోచించాల్సి ఉంటుంది’అని ఆ అధికారి వివరించారు. మొత్తానికి లాక్డౌన్ ఎత్తివేత ప్రక్రియపై వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. హాట్స్పాట్ల పరిధి ఎంతమేరకు ఉంటుంది? ఎంత దూరం వరకు మ్యాపింగ్ చేస్తారన్న దానిపై మార్గదర్శకాలను కేంద్రం ఇస్తుందని ఒక అధికారి తెలిపారు. -
బతుకుపై ఆశ ఉంటే ఈ నగరాలకు పోవద్దు!
లండన్: లాంగ్ హాలీడేస్ వస్తే చాలు.. వెంటనే ఓ టూర్ వేయాలనే ఆలోచన వచ్చేస్తుంది. అది కూడా యూరప్ టూర్ అనే విషయం మదిలో మెదులుతుంది. అయితే, నిజానికి పర్యాటకానికి యూరప్ చాలా చక్కటి ఖండమే కానీ, అక్కడ ఉన్న సంపన్న దేశాలు మాత్రం ఇప్పుడు అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదే ఉగ్రవాదం. ఈ ప్రాంతాల్లోని సేద తీరే చోట్లే లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని ఓ సర్వే తెలిపింది. అంతేకాదు.. యూరప్ టూర్ వేయొచ్చుకానీ, అక్కడి ఏ దేశాల్లోని నగరాలు సురక్షితంకావో అనే విషయాలు కూడా వెల్లడించింది. ఇది తెలిపిన వివరాల ప్రకారం స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు ఉగ్రవాద హిట్ లిస్ట్ లో ఉన్న దేశాలని, ఇక్కడికి వెల్లడం ఒక రకంగా ఎక్కువ తీవ్రత ఉన్న సమస్యలోకి వెళ్లడమేనని అంటోంది. ఒక్కసారి యూరప్ లో ఏ నగరాలు ఉగ్రవాద భారిన ఉన్నాయో పరిశీలిస్తే.. ఉగ్రవాద సమస్య ఎక్కువగా ఉన్న దేశాలివే.. స్పెయిన్ ఫ్రాన్స్ జర్మనీ బెల్జియం సాధారణ పరిస్థితులు ఉండే దేశాలు ఇటలీ డెన్మార్క్ గ్రీస్ క్రొయేషియా పోర్చుగల్ (కొంచెం ఆలోచించాల్సిన నగరం) ఉగ్రవాద సమస్య ఎక్కువగా ఉన్న దేశాలివే.. ఈజిప్టు ట్యూనిషియా టర్కీ