యూఎస్‌లో ‘ఇండియా బజార్‌’ హవా | 'India Bazaar' in USA | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో ‘ఇండియా బజార్‌’ హవా

Published Fri, May 19 2017 12:14 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

యూఎస్‌లో ‘ఇండియా బజార్‌’ హవా - Sakshi

యూఎస్‌లో ‘ఇండియా బజార్‌’ హవా

► భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ డిమాండ్‌
► విక్రయాలకు అవకాశమిస్తున్న అమెజాన్‌


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విభిన్నమైన ఉత్పత్తులు. నాణ్యతకు ఏమాత్రం తీసిపోవు. ఇక ధర అంటారా.. అందరికీ అందుబాటులోనే. ఇంకేముంది భారతీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంటోంది. ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వేదికగా ఇప్పుడు 4.5 కోట్లకుపైగా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లలో కొలువుదీరాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 13 లక్షలు ఉన్నాయి.

మొత్తంగా భారత్‌ నుంచి ప్రతి రోజు 1,80,000 ప్రొడక్టులు అమెజాన్‌ గ్లోబల్‌ వెబ్‌సైట్లలో నమోదవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కస్టమర్ల ఆదరణతో యూఎస్‌లో ఇండియా బజార్‌ పేరుతో ప్రత్యేక పేజీని ప్రారంభించామని అమెజాన్‌ ఇండియా గ్లోబల్‌ సెల్లింగ్‌ హెడ్‌ అభిజిత్‌ కమ్రా గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. భారతీయ ప్రొడక్టులకు యూఎస్, యూకే, జర్మనీలు టాప్‌–3 మార్కెట్లుగా ఉన్నాయని చెప్పారు. హోమ్‌ ఫర్నీషింగ్, అపారెల్, జువె ల్లరీకి ఎక్కువగా డిమాండ్‌ ఉందని వివరించారు.

విక్రేతలకు వెన్నంటే..: అమెజాన్‌ 2015 మే నుంచి భారతీయ ఉత్పత్తులను విదేశాల్లో అమ్మడం ప్రారంభించింది. 20,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారు. వీరిలో 50 శాతంపైగా అమ్మకందారులు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ఉన్నారని అభిజిత్‌ తెలిపారు. ‘విక్రేతలకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. మధ్యవర్తులు లేరు. ధర నిర్ణయం అమ్మకందారులదే.

అమెజాన్‌కు చెల్లించే కమీషన్‌ పూర్తిగా పారదర్శకం. ఇక వర్తకులకు భారత కరెన్సీలో ఆదాయం సమకూరుతోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ట్రేడర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పైగా ఉత్పత్తుల నమోదు, ఎగుమతి బాధ్యతలు మావే. వివిధ మార్కెట్లలో డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులు, డిజైన్ల గురించి ముందే అలర్ట్‌ చేస్తున్నాం. తరచూ శిక్షణ, అవగాహన చేపడుతున్నాం. మే 20న హైదరాబాద్‌లో ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం’ అని అభిజిత్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement