
బిలియన్ డాలర్ల సమీకరణలో ఫ్లిప్‌కార్ట్
ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,671 కోట్లు) సమీకరించనుంది. ఇందుకోసం ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,671 కోట్లు) సమీకరించనుంది. ఇందుకోసం ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఫ్లిప్‌కార్ట్ రెండంకెల స్థాయిలో సుమారు 10 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్‌తో నిధులను సమీకరించాలని భావిస్తోంది. అయితే, ఈ వేల్యుయేషన్ 8 బిలియన్ డాలర్ల స్థాయికే పరిమితం కావొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.
సుమారు 15 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఫ్లిప్‌కార్ట్ గతంలో పెట్టుబడులు సమీకరించడం తెలిసిందే. అమెజాన్, స్నాప్‌డీల్‌తో తీవ్ర పోటీ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ నిధుల సమీకరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్, యాక్సెల్ పార్ట్‌నర్స్, డీఎస్‌టీ గ్లోబల్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఇప్పటి దాకా కంపెనీలో 3 బిలియన్ డాలర్ల పైగా నిధులు సమీకరించింది.