ఆన్‏లైన్ లో ఫేక్ వస్తువులు అమ్మితే ఇక అంతే! | e commerce Company Will be Responsible For Fake Products | Sakshi
Sakshi News home page

ఆన్‏లైన్ లో ఫేక్ వస్తువులు అమ్మితే కంపెనీదే బాధ్యత

Published Sun, Mar 14 2021 4:06 PM | Last Updated on Sun, Mar 14 2021 4:25 PM

e commerce Company Will be Responsible For Fake Products - Sakshi

ప్రస్తుతం కరోనా పుణ్యమా అని చాలా మంది ప్రజలు బయటికి ఎక్కువగా వెళ్ళడానికి ఇష్ట పడటం లేదు. ప్రతి చిన్న వస్తువును కొనుక్కోవడానికి కూడా ఆన్ లైన్ షాపింగ్ మీద ఆధారపడుతున్నారు. కరోనా రాక ముందు కంటే వచ్చిన తర్వాతే ప్రజలు ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నట్లు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్న వస్తువులపై ప్రజలకు చాలా సందేహాలు ఉన్నాయి. ఇందులో కొనే వస్తువు నిజమా కదా?, ఫేక్ వస్తువు వస్తే ఏం చేయ్యాలి ? అనే సందేహాలు వారి మదిలో మెదులుతున్నాయి. 

ఈ మధ్య కాలంలోఈ కామర్స్ సైట్లలో కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ వస్తున్నట్లు వినియోగదారులు కంప్లైంట్ చేస్తున్నారు. ఇలాంటి వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకు సంబంధించిన కొన్ని నియమాలను నేషనల్ ఈ కామర్స్ పాలసీ ముసాయిదాలో పొందుపరిచింది. ప్రైవేట్, ప్రైవేట్‏యేతర డాటాపై ప్రభుత్వం ముసాయిదా ప్రక్రియలా పాలసీని పేర్కోంది. పరిశ్రమ అభివృద్ధి కోసం డేటా వినియోగంపై నూతన విధానం తీసుకురాబోతుంది. దీనిలో ప్రతి ఉత్పతులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వినియోగదారులకు తెలిసే విధంగా కొత్త ముసాయిదా తీసుకురానున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

ఏదైనా కంపెనీ ఉత్పత్తి ఆన్ లైన్ లో అమ్మాలని అనుకుంటే దానికి సంబందించిన ప్రతి సమాచారం యూజర్లకు అందించాల్సి ఉంటుంది. ఈ కామర్స్ కంపెనీలు తమ ఫాట్ ఫాంలలో విక్రయించే ఉత్పత్తులు నకిలీవి కాదని ముందే నిర్దారించుకోవడం కోసం సేఫ్ గార్డ్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆన్‏లైన్ లో నకిలీ ఉత్పత్తిని అమ్మితే అది అన్ లైన్ కంపెనీతోపాటు, అమ్మంకందారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ చర్య పారిశ్రామిక అభివృద్ధికి డేటా షేరింగ్ సహకరిస్తుందని తెలిపింది. ఇందుకోసం మరిన్ని డేటా నిబంధనలు రానున్నట్లుగా తెలిపింది. ఈ కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

చదవండి:

ఈ యాప్స్ ను వెంటనే డిలీట్ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement