ఈ–కామర్స్‌లోకి బాంబే డైయింగ్..
• రిటైల్ బ్రాండ్‌గా కొనసాగుతాం
• తయారీ పూర్తిగా నిలిపివేత
• కంపెనీ సీఈవో నగేశ్ రాజన్న
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్స్‌టైల్ రంగంలో ఉన్న బాంబే డైయింగ్ సొంతంగా ఈ–కామర్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే పలు ఈ–కామర్స్ సంస్థలు కంపెనీ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి.ఫిబ్రవరికల్లా ఈ–కామర్స్‌లోకి అడుగు పెడుతున్నట్టు బాంబే డైయింగ్ రిటైల్ సీఈవో నగేశ్ రాజన్న సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. తయారీ పూర్తిగా నిలిపివేశామని, థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్ల నుంచిఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రిటైల్ పైన ఫోకస్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 30 దాకా సబ్ బ్రాండ్లలో 5,000 రకాల బెడ్ షీట్లు, బ్లాంకెట్లు, టవల్స్ విక్రయిస్తున్నట్టు చెప్పారు.ఏటా 400 కొత్త రకాలను ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. అంతర్జాతీయ డిజైనర్లతో చేతులు కలపడం ద్వారా వినూత్న ఉత్పత్తులను తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది రిటైల్ విభాగం లాభాల్లోకి వస్తుందని తెలిపారు.
భారీ లక్ష్యంతో ముందుకు..: కంపెనీకి దేశవ్యాప్తంగా 30 సొంత, 200 ఫ్రాంచైజీ ఔట్‌లెట్లు ఉన్నాయి. 5,000లకు పైగా దుకాణాల్లో బాంబే డైయింగ్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. 2020 లక్ష్యంలో భాగంగా బ్రాండ్ స్టోర్ల సంఖ్య500లకు, టచ్ పాయింట్లను 10 వేలకు చేర్చనున్ననట్టు నగేశ్ వెల్ల డించారు. ‘వచ్చే నాలుగేళ్లలో బ్రాండ్ ప్రమోషన్‌కు రూ.100 కోట్లు వ్యయం చేస్తాం. 10% ఆదాయం సమకూరుస్తున్న ప్రధాన మార్కెట్లయిన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో 20% ఖర్చు పెడతాం. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో నియామకాలు ఉంటాయి. రిటైల్ ద్వారా 2015–16లో రూ.305 కోట్ల ఆదాయం సమకూరింది. 2020 నాటికి దీనిని రూ.1,000 కోట్లకు చేరుస్తాం’ అనివివరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో 50% అమ్మకాలు తగ్గాయని... చైనా నుంచి దిగుమతులూ పడిపోయాయని గుర్తు చేశారు.