అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో డిస్కౌంట్ల పండుగ | Amazon Great Indian Festival Announced: Dates Revealed | Sakshi
Sakshi News home page

మళ్లీ డిస్కౌంట్ల పండుగ: ఒకేసారి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌

Published Thu, Oct 12 2017 1:29 PM | Last Updated on Thu, Oct 12 2017 2:30 PM

Amazon Great Indian Festival Announced: Dates Revealed

సాక్షి, న్యూఢిల్లీ : మళ్లీ డిస్కౌంట్ల ఉత్సవం ప్రారంభం కాబోతుంది. ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ రెండూ ఒకేసారి తన సేల్‌ ఆఫర్లకు తెరతీయబోతున్నాయి. అమెజాన్‌ తన తర్వాతి ఎడిషన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ తేదీలను బహిర్గతం చేసింది. అక్టోబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 17 వరకు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను నిర్వహించనున్నట్టు పేర్కొంది. అదే రోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌ కూడా తన బిగ్‌ దివాలి సేల్‌ను నిర్వహిస్తోంది. అమెజాన్‌ ఈ దివాలి సేల్‌లో భాగంగా మొబైల్‌, యాక్ససరీస్‌, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ వంటి వాటిపై డీల్స్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుదారులకు ఈ సేల్‌లో అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా వచ్చేస్తుంది. 30వేల వరకు ఉత్పత్తులపై నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అమెజాన్‌ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు పేర్కొంది. మొబైల్‌ఫోన్లపై 40 శాతం వరకు, యాక్ససరీస్‌పై 80 శాతం వరకు, పవర్‌ బ్యాంకులపై 65 శాతం వరకు, మొబైల్‌ కేసులపై 80 శాతం వరకు, బ్లూటూత్‌ హెడ్‌సెట్లపై 20 శాతం వరకు తగ్గింపును ఇ‍వ్వనుంది. ఇతర కేటగిరీ ఉత్పత్తులు టీవీలపై 40 శాతం వరకు, ల్యాప్‌టాప్‌లపై రూ.20వేల వరకు, హెడ్‌ఫోన్లు, స్పీకర్లపై 60 శాతం వరకు, స్టోరేజ్‌ డివైజ్‌లపై 50 శాతం వరకు, వీడియో గేమ్‌లపై 60 శాతం వరకు, నెట్‌వర్కింగ్‌ డివైజ్‌లపై 60 శాతం వరకు తగ్గింపును యూజర్లు పొందవచ్చు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్డెన్‌ అవర్స్‌ డీల్స్‌ను అమెజాన్‌ ఆఫర్‌ చేయనుంది. స్పెషల్‌ ధన్‌తెరాస్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement