![Flipkart Big Billion Days Sale 2022 Will Begin From September 23 And Will Go On Till September 30 - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/13/sale.jpg.webp?itok=K__8Smat)
దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశీయ ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌ను ప్రకటించింది. మరో ఈకామర్స్ కంపెనీ అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్-2022ను నిర్వహించనుంది. సెప్టెంబర్ 23నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు జరిగే ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ల్యాప్ ట్యాప్స్,స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్‌లు పొందవచ్చని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు.
సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే సేల్‌లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వినియోగించి ప్రొడక్ట్ కొనుగోలు దారులకు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, పేటీఎం ట్రాన్సాక్షన్‌లపై 10శాతం డిస్కౌంట్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్‌తో రూ.1లక్ష వరకు రుణం ఇస్తుంది. ఈ రుణాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. “కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్‌ను ఇతర ప్రీపెయిడ్ థర్డ్ పార్టీ కార్డ్‌ల ద్వారా చెల్లించవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డు హోల్డర్‌లకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది” అని ఇ-కామర్స్ దిగ్గజం తెలిపింది.
ఇటీవల ఫ్లిప్‌కార్ట్ తన యాప్‌ను అప్‌డేట్ చేసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే 2022 సేల్ సమయంలో కూపన్ రెయిన్, ట్రెజర్ హంట్, స్పిన్ ది బాటిల్ వంటి గేమిఫికేషన్ కార్యక్రమాలు కస్టమర్‌లు సేల్ సమయంలో ఆఫర్‌లను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది.
80శాతం డిస్కౌంట్
ప్రింటర్లు, మానిటర్లతో పాటు కంప్యూటర్ ఎక్విప్‌మెంట్‌పై 80 శాతం డిస్కౌంట్, టీవీలపై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. సేల్ సందర్భంగా, ప్రతిరోజూ ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు 'క్రేజీ డీల్స్', 'రష్ అవర్స్'లో 'ఎర్లీ బర్డ్ స్పెషల్' ఐటెమ్‌లపై డిస్కౌంట్లు 'టిక్ టాక్ డీల్స్' ను అందిస్తుంది.
భారీ తగ్గింపు
సేల్ సమయంలో నథింగ్ ఫోన్ 1, గూగుల్ పిక్సెల్ 6 ఎ ధర తగ్గనుంది. నథింగ్ ఫోన్ 1 ప్రారంభ ధర రూ. 28,999, గూగుల్ పిక్సెల్ 6 ఎ ప్రారంభ ధర రూ. 27,699గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment