
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవలే దసరా పండుగను పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు గ్రేట్ ఇండియన్ సేల్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం దేశీయ మార్కెట్‌లోకి అమెజాన్ ప్రవేశించినప్పటి నుంచి ఇదే అతిపెద్ద షాపింగ్ ఈవెంట్. ఈ ఈవెంట్ విజయవంతమైన క్రమంలో మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను కంపెనీ నిర్వహించబోతుంది. దివాలి కానుకగా అక్టోబర్ 4 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు అమెజాన్ తెరతీయబోతుంది. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ సేల్ నిర్వహించనుంది. త్వరలో రాబోతున్న సేల్‌లో, సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు హోల్డర్స్‌కు అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.
అన్ని మేజర్ బ్రాండులపైనా కూడా అమెజాన్ ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్, సోనీ, హెచ్‌పీ, ఎల్‌జీ, నోకియా, ఆపిల్ వంటి ప్రొడక్ట్‌లపై ''బిగ్ డీల్స్'' ఉండనున్నట్టు అమెజాన్ తెలిపింది. అంతేకాక ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పింది. అమెజాన్ తాజాగా నిర్వహించిన సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, పెద్ద పెద్ద ఉపకరణాలు బెస్ట్-సెల్లింగ్ ప్రొడక్ట్‌లుగా నిలిచాయి. గతేడాది దివాలి సేల్‌తో పోలిస్తే, కంపెనీ 2.5 వంతు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను, నాలిగింతలు ఎక్కువగా పెద్ద ఉపకరణాలను అమ్మినట్టు తెలిసింది.