ఐఫోన్‌పై అదిరిపోయే ఆఫర్‌ | Apple iPhone XR Lowest Price Ever | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌పై అదిరిపోయే ఆఫర్‌

Published Sat, Sep 28 2019 8:16 PM | Last Updated on Sat, Sep 28 2019 8:17 PM

Apple iPhone XR Lowest Price Ever - Sakshi

న్యూఢిల్లీ: ఐఫోన్‌ ప్రియులకు ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తీపి కబురు అందించింది. ‘గ్రేట్‌ ఇండియాన్‌ ఫెస్టివల్‌’ పేరిట ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 4 వరకు జరపనున్న సేల్స్‌లో ఐఫోన్లపై భారీగా తగ్గింపు ప్రకటించింది. యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌పై ఏకంగా రూ.10 వేలు తగ్గించింది. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు ముందుగా కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

తగ్గింపు తర్వాత ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ 68 జీబీ మోడల్‌ రూ. 39,999, 128 జీబీ వేరియంట్‌ రూ. 44,999, 256 జీబీ ఫోన్‌ రూ.57,999 ధరలకు లభిస్తాయి. అయితే ఈ ఆఫర్‌ పరిమిత సమయంలో మాత్రమే ఉంటుందని అమెజాన్‌ ఇండియా తెలిపింది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ఇంత తక్కువ ధరకు ఇంతకుముందెన్నడూ లభ్యం కాలేదని వెల్లడించింది. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు కానివారు నెలకు రూ.129, సంవత్సరానికి రూ. 999 చెల్లించి సభ్యత్వం పొందవచ్చు. (చదవండి: అమెజాన్‌ పండగ ఆఫర్లు)

ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ఫీచర్లు
డ్యూయల్‌ సిమ్‌
6.1 లిక్విడ్‌ రెటీనా ఎల్‌సీడీ డిస్‌ప్లే
12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
7 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
రీచార్జ్‌బుల్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీ
వైర్‌లెస్‌ చార్జింగ్‌, ఫేస్‌ ఐడీ
వాటర్‌, డస్ట్‌ రెసిస్టింగ్‌
ఏ12 బయోనిక్‌ చిప్‌ ప్రాసెసర్‌
ఆరు రంగుల్లో లభ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement