ఈ ఆఫర్‌ను అస్సలు మిస్‌ చేసుకోవద్దు | massive discount on top 5 laptops in Amazon Great Indian Festival | Sakshi
Sakshi News home page

amazon: ఈ ఆఫర్‌ను అస్సలు మిస్‌ చేసుకోవద్దు

Published Sun, Oct 10 2021 1:19 PM | Last Updated on Sun, Oct 10 2021 3:49 PM

massive discount on top 5 laptops in Amazon Great Indian Festival   - Sakshi

ఈ కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు వరుస బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ రెడ్‌సీర్‌ రిపోర్ట్‌ ప్రకారం ఇప్పటికే అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌లు నాలుగు రోజుల్లో రూ.20250 కోట్ల బిజినెస్‌ నిర్వహించినట్లు తెలిపింది. ముఖ్యంగా ఈ నాలుగు రోజుల వ్యవధిలో 50శాతం గాడ్జెట్స్‌, గృహోపకరణాల్ని కొనుగులు చేసినట్లు తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా అమెజాన్‌ పలు ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. 

యాపిల్‌ మాక్‌బుక్‌ ఎయిర్‌ 
గతేడాది యాపిల్‌ సంస్థ ఎం1 ఎస్‌ఓఎస్‌తో యాపిల్‌ మాక్‌ బుక్‌ ఎయిర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.92,000 వేలు ఉండగా..ఫెస్టివల్‌ సేల్‌లో రూ.79,900కే సొంతం చేసుకోవచ్చు.ఇక పీ3 వైడ్‌ కలర్‌లో 13.3 అంగుళాల రెటీనా డిస్‌ప్లే, 8కోర్‌ సీపీయూ, 8కోర్‌ జీపీయూ, 16కోర్‌ న్యూరాల్‌ ఇంజిన్‌ ఫీచర్లు ఉన్నాయి. 8జీబీ మెమరీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ను అందిస్తుంది. 

ఏసర్ నైట్రో 5   
15.6 అంగుళా 144హెచ్‌ జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో హెచ్‌డీ క్వాలిటీ డిస్‌ ప్లే 11జనరేషన్‌ మోడల్ ఇంటెల్‌ కోర్‌ ఐ5 - 11400 హెచ్‌ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌..32 ఎక్స్‌పాండబుల్‌, 4జీబీ జీడీడీఆర్‌6 వీ ర్యామ్‌తో ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్‌ 3050, 256జీబీ పీసీఐఆ జెన్‌3 ఎన్వీఎంఈ ఎస్‌ఎస్‌డీ, 1 టెరాబైట్‌ 2.5 అంగుళాల ఆర్పీఎం హెచ్‌డీడీతో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్‌లో దీని ధర రూ.లక్ష ఉండగా సేల్‌ లో రూ.69,990కే లభిస్తుంది. 

విక్టస్‌ బై హెచ్‌పీ
16.1 అంగుళా ఫుల్‌ హెచ్‌డీ క్వాలిటీతో మైక్రో ఎడ్జ్‌ స్క్రీన్‌ బ్రైట్‌ 250నిట్స్‌తో వస్తుంది. 5జనరేషన్‌ ఏఎండీ రైజెన్‌ 55600హెచ్‌ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, నివిడియా జీఈఫోర్స్‌ జీటీఎక్స్‌ 1650 గ్రాఫిక్స్ కార్డ్‌, 512జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌తో మార్కెట్‌లో లభ్యం అవుతుండగా..ఈ ధర రూ.76,020 ఉంది.ఈ ఫెస్టివల్‌ సేల్‌లో రూ.61,990కే సొంతం చేసుకోవచ్చు. 

ఆసుస్‌ వివోబుక్‌ 14(2021)
అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ లో ఆసుస్‌ వివోబుక్‌ 14 (2021 మోడల్‌) రూ.41,990కే లభిస్తుంది. 11జనరేషన్‌తో ఇంటెల్‌ కోర్‌ ఐ3-1115జీ4 ప్రాసెసర్‌, 8జీబీ డీడీఆర్‌4 ర్యామ్‌తో..256జీబీ ఎం.2 ఎన్‌వీఎంఈ పీసీఐఈ ఎస్‌ఎస్‌డీ ఫీచర్లు ఉన్నాయి. 2.5 అంగుళాలున్న ఈ వివోబుక్‌ ప్రస్తుతానికి విండోస్‌10లో పనిచేస్తుంది.విండోస్‌ 11కి అప్‌ గ్రేడ్‌ చేసుకునే సౌకర్యం ఉందని ఆసుస్‌ వివోబుక్‌ ప్రతినిధులు తెలిపారు. 

లెనోవో ఐడియాపా స్లిమ్‌5 
300నిట్స్‌ బ్రైట్‌ నెస్‌తో 15.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్యానల్‌ను అందిస్తుంది. 11జెనరేషన్‌ ఇంటెల్‌ టైగర్‌ లేక్‌ కోర్‌ ఐ5-1135జీ7 ప్రాసెసర్‌, 16జీబీ ర్యామ్‌, 512జీబీ ఎస్‌ఎస్‌డీ ఫీచర్లు ఉండగా...విండోస్‌10కి సపోర్ట్‌ చేస్తుంది. ఉచితంగా విండోస్‌11కి అప్‌గ్రేడ్‌ అవ్వొచ్చు.ఇంటెల్‌ ఐరిస్‌ ఎక్స్‌ఈ గ్రాఫిక్స్‌ ఉన్న ఈ లెనోవో ఐడియాపాడ్‌ స్లిమ్‌5 ధర రూ.62,990గా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement