మరోసారి అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ | Amazon Great Indian Sale Is Coming Back Again On These Dates | Sakshi
Sakshi News home page

మరోసారి అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’

Published Thu, Oct 18 2018 10:47 AM | Last Updated on Thu, Oct 18 2018 11:56 AM

Amazon Great Indian Sale Is Coming Back Again On These Dates - Sakshi

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ (ఫైల్‌ ఫోటో)

ఆన్‌లైన్‌ ఫెస్టివల్‌ సీజన్‌ సేల్స్‌ ఇంకా ముగియలేదు. గత కొన్ని రోజుల క్రితమే అమెజాన్‌ గ్రాండ్‌ సక్సెస్‌తో ముగించిన గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌, మరోసారి ప్రారంభం కాబోతుంది. రెండో రౌండ్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ అక్టోబర్‌ 24 నుంచి మొదలవుతుందని అమెజాన్‌ ప్రకటించింది. ఈ సేల్‌ 24 అర్థరాత్రి నుంచి ప్రారంభమై, అక్టోబర్‌ 28 అర్థరాత్రి వరకు కొనసాగనుంది. రెండో రౌండ్‌ ఫెస్టివల్‌ సీజన్‌ సేల్‌లో ఎక్స్‌క్లూజివ్‌ లాంచ్‌లు, ఆఫర్లు ఉండనున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, హోమ్‌ అప్లియెన్సెస్‌, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై పలు డీల్స్‌ను ప్రకటించింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఈఎంఐ కార్డు యూజర్లకు నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లను తీసుకొస్తోంది. ఈ ఆన్‌లైన్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

ఈ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. అమెజాన్‌ పే యూజర్లకు రూ.250 విలువైన క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. ఈ సేల్‌లో కొత్త అమెజాన్‌ కస్టమర్లందరికీ ఫ్రీ షిప్పింగ్‌ ఉండనుంది. ఈ సారి గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో ప్రతి రోజూ రెడ్‌మి 6ఏ ఫ్లాష్‌ సేల్‌ నిర్వహించనుంది. అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌, మూడో జనరేషన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌ ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లో అందుబాటులోకి రానున్నాయి. అలెక్స్‌ ఆధారిత డివైజ్‌లకు 70 శాతం వరకు డిస్కౌంట్‌ లభించనుంది. బెస్ట్‌ సెల్లింగ్‌ బుక్స్‌ను కేవలం రూ.19కే అమెజాన్‌ విక్రయిస్తోంది. ఈ సేల్‌ను కరెక్ట్‌గా దివాళిగా ముందు తీసుకొస్తోంది. గత కొన్ని రోజుల క్రితమే తొలి రౌండ్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ముగిసింది. ఇప్పుడు నిర్వహించబోయేది రెండో రౌండ్‌ ఫెస్టివల్‌ సేల్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement