అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్ సేల్‌లో 79శాతం మంది కొత్త కస్టమర్లు టైర్‌టూ, త్రీ టైర్ నగరాల నుంచి షాపింగ్ చేశారని తెలిపింది. అంతేకాదు అమెజాన్‌లో మొత్తం 30వేల మంది అమ్మకం దార్లు లాభపడ్డారని, వారిలో 70శాతం మంది నాన్ మెట్రో నగరాలకు చెందినవారేనంటూ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.
► ఈ సీజన్‌లో స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలతో తమ ఇళ్లను భద్రపరచుకోవాలనే వినియోగదారుల ఆసక్తి పెరిగింది. కంపెనీ ప్రకారం, టాప్ బ్రాండ్‌ల నుండి మునుపటి కంటే ఎక్కువ సెక్యూరిటీ కెమెరాల అమ్మకాలు జరిగాయి.
► స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, టీవీలు, ఫ్యాషన్, బ్యూటీ, కాస్మోటిక్స్ వస్తువులు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసినట్లు తెలిపింది.
►తొలిసారి అమెజాన్‌లో 10 లక్షల మంది స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేశారని, వారిలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో 84 శాతం కంటే ఎక్కువ 5జీ ఫోన్లు ఉన్నట్లు చెప్పింది.
► లక్ష మంది కస్టమర్‌లు తొలిసారి అమెజాన్ నుండి మొక్కల కుండీలు, గార్డెనింగ్ టూల్స్, మట్టి సప్లిమెంట్‌లు, తోటపని ఉత్పత్తులను కొనుగోలు చేశారు.
► అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ పరికరాలు ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లకు ఇష్టమైనవిగా కొనసాగుతున్నాయని, ఈ సమయంలో అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల్లో ఎకో డాట్ (3వ తరం), ఫైర్ టీవీ స్టిక్ (3వ తరం) ఉన్నాయని కంపెనీ తెలిపింది.
► అమెజాన్ అమ్మకందారులలోని స్థానిక దుకాణాలు 2 రెట్లు పెరిగాయి. ప్రతి నిమిషానికి 10కి పైగా ఉత్పత్తులను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.
► అమెజాన్ లాంచ్‌ప్యాడ్ ప్రోగ్రామ్‌లో అనుసందానంగా ఉన్న స్టార్టప్‌లు, బ్రాండ్‌లు ప్రతి 2.5 సెకన్లకు ఒక ప్రత్యేకమైన ప్రొడక్ట్‌లను విక్రయిస్తున్నాయని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ అన్నారు.
చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్: బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్
Comments
Please login to add a commentAdd a comment