10 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ | Amazon Great Indian Festival to start from October 10 | Sakshi
Sakshi News home page

10 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌

Published Mon, Oct 1 2018 2:17 AM | Last Updated on Mon, Oct 1 2018 2:17 AM

Amazon Great Indian Festival to start from October 10 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దసరా, దీపావళి సీజన్‌ సందర్భంగా భారీ ఆఫర్లు, డీల్స్‌తో ఈ నెల 10 నుంచి 15 వరకు ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ను నిర్వహిస్తున్నట్లు ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రకటించింది. ఈ సారి కూడా తమ ప్రైమ్‌ కస్టమర్లకు ఈ డీల్స్‌ను, ఆఫర్లను ముందే చూసే అవకాశం ఉంటుందని తెలియజేసింది.

స్మార్ట్‌ఫోన్లు, టీవీల వంటి గృహోపకరణాలు, హోమ్‌–కిచెన్‌ ఉత్పత్తులు, ఫ్యాషన్‌ వస్తువులతో పాటు గ్రోసరీ, కన్సూమర్‌ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తదితరాలపై ఈ 5 రోజులూ భారీ ఆఫర్లు కొనసాగుతాయని ఈ సందర్భంగా అమెజాన్‌ తెలియజేసింది. అక్టోబరు 10న అర్ధరాత్రి 12 గంటలకు మొదలయ్యే ఈ ఫెస్టివల్‌... అక్టోబరు 15 రాత్రి 11.59కి ముగుస్తుంది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్‌ కార్డులతో చెల్లించేవారికి 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు అమెజాన్‌ వాలెట్‌లో సొమ్ము వేస్తే అదనంగా రూ.300 క్యాష్‌బ్యాక్‌ ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement