ఒక్కరోజులోనే రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరి! | Stock Market Rally On september 30 2024 | Sakshi
Sakshi News home page

ఒక్కరోజులోనే రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరి!

Sep 30 2024 3:58 PM | Updated on Sep 30 2024 4:13 PM

Stock Market Rally On september 30 2024

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 368 పాయింట్లు తగ్గి 25,810 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 1272 పాయింట్లు దిగజారి 84,299 వద్ద ముగిసింది. ఈరోజు స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరైనట్లు మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి.

మదుపర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే జీవితకాల గరిష్ఠాలను చేరిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఉదయ నుంచే లాభాలు స్వీకరించినట్లు తెలిసింది. రానున్న యూఎస్‌ ఎన్నికలు, ఎఫ్‌ఐఐలు చైనావైపు మొగ్గు చూపుతుండడం వంటి అంశాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసినట్లు నిపుణులు చెప్పారు.

ఇదీ చదవండి: ఎట్టకేలకు రెండేళ్ల వివాదానికి పరిష్కారం!

సెన్సెక్స్‌ 30 సూచీలో జేఎస​్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, నెస్లే, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతి సుజుకీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement