ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌ : స్మార్ట్‌ఫోన్లపై డీల్స్‌ | Best Deals On Moto Honor Samsung Smartphones In Flipkart Sale | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌ : స్మార్ట్‌ఫోన్లపై డీల్స్‌

Published Fri, Oct 5 2018 3:25 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

 Best Deals On Moto Honor Samsung Smartphones In Flipkart Sale - Sakshi

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ రిటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఏడాది సైతం బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరుతో వార్షిక సేల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది సేల్‌ను ప్రమోట్‌ చేసేందుకు కంపెనీ అమితాబ్‌ బచన్‌, విరాట్‌ కోహ్లీ వంటి సెలెబ్రిటీలతో ఒప్పందాలు చేసుకుంది. అక్టోబర్‌ 10 నుంచి 14 వరకూ జరిగే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. మోటో, హానర్‌, శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్‌ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. సేల్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ 45,990 విలువైన ఈ ఫోన్‌ను రూ 16,000 తక్కువగా రూ 29,990కు ఆఫర్‌ చేస్తున్నారు.

గెలాక్సీ ఆన్‌6 రూ 11,990కే అందుబాటులో ఉండగా గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ రూ 17,990కు గాను రూ 9990కే ఆఫర్‌లో ఉంది. జే3 ప్రో రూ 8,490 నుంచి రూ 6190కే సేల్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో దాదాపు హానర్‌ కొత్త మోడల్స్‌ అన్నీ అందుబాటులో ఉన్నాయి. హానర్‌ 9ఎన్‌ డీల్‌ను సూపర్‌స్టార్‌ ఆఫర్‌గా చెబుతున్నారు. హానర్‌ 9ఎన్‌ ధరను గణనీయంగా తగ్గించగా, హానర్‌ 7ఏ రూ 7999కి సేల్‌లో ఆఫర్‌లో ఉంచారు.

ఇక హానర్‌ 8 ప్రో, హానర్‌ 9ఐ వరుసగా 19,999, 12,999కి అందుబాటులో ఉన్నాయి. నాలుగు కెమెరాలతో కూడిన హానర్‌ 9 లైట్‌ రూ 16,999కు గాను రూ 11,999కే ఆఫర్‌లో అందుబాటులో ఉంది. అత్యాధునిక ఫీచర్లు కలిగిన హానర్‌ 10 రూ 35,999 ధరకు గాను రూ 24,999కు సేల్‌లో అందుబాటులో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement